Actor Kidnap Case : మిస్ అయిన 5 రోజులకు కిడ్నాప్‌గా తెల్చిన పోలీసులు… సీసీటీవీతో బయటకొచ్చిన అసలు విషయం

Actor Kidnap Case.. ఈ మధ్యకాలంలో అనుకోకుండా కొంతమంది మిస్ అవుతున్నారు.. పోలీసులు ఆరా తీసినా కొన్ని కేసులు మిస్టరీ గానే మిగిలిపోతూ ఉంటాయి. అయితే మరి కొన్నింటిని చేదిస్తూ ఉంటారు.. ఇదిలా ఉండగా తాజాగా గత కొన్ని రోజులుగా ప్రముఖ టీవీ సీరియల్ నటుడు గురు చరణ్ సింగ్ కనిపించకుండా పోయారు.. ఈ మేరకు నటుడు తండ్రి ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.. గురు చరణ్ సింగ్ ఏప్రిల్ 22న ముంబైకి వెళ్లేందుకు వచ్చి ఢిల్లీ ఎయిర్పోర్టులోని సీసీటీవీ ఫుటేజ్ లో కనిపించాడని స్నేహితులు తెలిపారు. అయితే ఆ ఫుటేజ్ కాకుండా మరేదైనా ఫుటేజ్ ఉందా ? చివరిసారిగా ఆయన ఎవరికి ఫోన్ చేశారు? ఇలా వారి ఫోన్ నెంబర్ పై ఆరా తీస్తున్నారు పోలీసులు..

Actor Kidnap Case : The real thing revealed by the police who was kidnapped for 5 days of missing... CCTV
Actor Kidnap Case : The real thing revealed by the police who was kidnapped for 5 days of missing… CCTV

మిస్సింగ్ కాదు కిడ్నాప్..

తాజాగా విస్తుపోయే నిజాలు బయటపడినట్లు తెలుస్తోంది. సీసీటీవీ ఫుటేజ్ ని క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు.. ఐదు రోజుల తర్వాత గురుచరణ్ సింగ్ మిస్సింగ్ కాదు కిడ్నాప్ అయి ఉండవచ్చని తేల్చి చెప్పారు.. దీంతో నటుడు గురు చరణ్ సింగ్ గురించి ఢిల్లీ పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేయగా సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగానే పోలీసులు ఈ పని చేసినట్లు సమాచారం. అయితే ఇక్కడ ఊహించని నిజాలు బయటపడినట్లు తెలుస్తోంది.. గురు చరణ్ సింగ్ ఫోను పరిశీలించగా.. అందులో కొన్ని లావాదేవీలను కూడా వారు గుర్తించారు.

ఐదు రోజుల తర్వాత సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలు..

అంతేకాదు ఐపీసీ సెక్షన్ 365 కింద పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది . 50 ఏళ్ల నటుడు గురు చరణ్ సింగ్ దాదాపు 5 రోజులుగా కనిపించకుండా పోవడంతో ఆయన తండ్రి ఢిల్లీలోని పాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.. ఇక అప్పుడే ఈ విషయాలన్నీ వెలుగులోకి వచ్చాయి.. తాజాగా అందుతున్న నివేదికల ప్రకారం గురు చరణ్ సింగ్ కుటుంబ సభ్యులను పోలీసులు విచారించగా ఆయన గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారని.. ముఖ్యంగా మానసిక ఆరోగ్యం బాగానే ఉన్నా శారీరక ఆరోగ్యంగా ఇబ్బందులు పడ్డారని చెప్పారు. క్షేమంగా తిరిగి వస్తాడనే ఆశాభావం వ్యక్తం చేశారు కుటుంబ సభ్యులు..

- Advertisement -

మిస్సింగ్ కేసులో పోలీసుల విచారణ..

ఇకపోతే టీవీ సీరియల్ ” తారక్ మెహతా కా ఊల్తా ఛష్మా ” సీరియల్లో సోది పాత్ర పోషించిన గురుచరణ్ సింగ్ ఈ పాత్ర ద్వారా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు.. తాజాగా ఈ సీరియల్ టీం తో కూడా పోలీసులు మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇక ఇదే సమయంలో అభిమానులు కూడా సోషల్ మీడియా ద్వారా గురు చరణ్ సింగ్ గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే మరి ఆయనను కిడ్నాప్ చేశారనే వార్తలు వస్తున్నాయి. కానీ ఎవరు చేశారు ?ఎందుకు చేశారు ? అసలు నిజంగా ఆయనను కిడ్నాప్ చేశారా? లేక శారీరక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో ఎక్కడైనా ఉండి పోయారా? అన్న విషయాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ కోణంలోనే పోలీసులు దర్యాప్తు చేపట్టారు.. మరి పూర్తి వివరాలు తెలియాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు