Dead Boy Detectives on OTT : దెయ్యాలు డిటెక్టివ్స్‌లా ఇన్వెస్టిగేషన్ చేస్తే… వెన్నులో వణుకు పుట్టించే హార్రర్ సిరీస్ ఓటీటీలోకి వచ్చేసింది

Dead Boy Detectives on OTT : డిటెక్టివ్స్ అనగానే వెంటనే పోలీసులు గుర్తొస్తారు. ఇంకాస్త ఆలోచిస్తే హాలీవుడ్ స్పై సినిమాలు, జేమ్స్ బాండ్ లాంటి హీరోలు గుర్తొస్తారు. కానీ దెయ్యాలు డిటెక్టివ్స్ గా మారితే ఎలా ఉంటుంది అనే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో వచ్చిన తాజా సిరీస్ డెడ్ బాయ్ డిటెక్టివ్స్. ఈ హాలీవుడ్ సిరీస్ తెలుగు భాషలో కూడా అందుబాటులో ఉంది. మరి డెడ్ బాయ్ డిటెక్టివ్స్ ని ఎక్కడ చూడొచ్చు? అంటే…

టీనేజ్ దయ్యాలు ఇన్వెస్టిగేషన్ చేస్తే…

డెడ్ బాయ్ డిటెక్టివ్స్ సిరీస్ లో దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తుండడం విశేషం. మరణానంతరం ఒక డిఫరెంట్ వరల్డ్ లో ఉన్న ఇద్దరు టీనేజర్ గోస్ట్స్ భూమిపై ఉన్న ఓ మనిషి సహాయంతో ఈ ఇన్వెస్టిగేషన్ ను మొదలు పెడతారు. ఎడ్విన్ అండ్ చార్లెస్ అనే ఇద్దరు టీనేజర్స్ చనిపోయి, మరణానంతరం కూడా భూమిపైనే గడుపుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఏకంగా ఓ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ స్టార్ట్ చేసి పారా నార్మల్ కేసులను పరిశోధిస్తారు. మరి ఇంతకీ వీళ్ళ క్లైంట్స్ ఎవరు? ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఎలా సాగుతుంది? అనే ఇంట్రెస్టింగ్ విషయాన్ని ఎనిమిది ఎపిసోడ్స్ చూసి తెలుసుకోవాలి.

ఒక్కో ఎపిసోడ్ థ్రిల్లింగ్ గా…

ఈ సిరీస్ మొత్తం ఎనిమిది ఎపిసోడ్లతో రాగా, ఒక్కో ఎపిసోడ్ దాదాపుగా గంటపాటు నడుస్తుంది. అలాగే ఒక్కో ఎపిసోడ్ లో ఒక్కో కేసును సాల్వ్ చేస్తూ ముందుకు వెళ్తాయి ఈ దెయ్యాలు. గంటసేపు అనగానే బోర్ కొడుతుందేమో అని ఫీల్ అవుతున్నారెమో. కానీ ప్రతి ఎపిసోడ్ గ్రిప్పింగ్ సన్నివేశాలతో, ఊహించని జీవులతో, ట్విస్టులతో థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఇక ట్రైలర్ల లో చూస్తే ఈ సిరీస్ కు తెలుగు డబ్బింగ్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయింది. ఒకవేళ వీకెండ్ ఫ్రీగా ఉంటే ఈ ఫాంటసీ హారర్ థ్రిల్లర్ మూవీని చూసి ఎంజాయ్ చేయొచ్చు.

- Advertisement -

ఎక్కడ చూడవచ్చు అంటే..

కాగా హారర్ ఫాంటసీ థ్రిల్లర్ సిరీస్ డెడ్ బాయ్ డిటెక్టివ్స్ నెట్ ఫ్లిక్స్ లో ఏప్రిల్ 25 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. కేవలం ఇంగ్లీష్ లోనే కాకుండా తెలుగు, హిందీ, తమిళం, ఫ్రెంచ్, హంగేరియన్, జర్మనీ, ఇటాలియన్, ఇండోనేషియన్, జపనీస్, స్పానిష్ లాంటి ఇంటర్నేషనల్ భాషలో అందుబాటులో ఉంది. హాలీవుడ్ సినిమాలను ఇష్టపడే వారు ఏ భాషలో కావాలంటే ఆ భాషలో చూసే అవకాశాన్ని కల్పిస్తోంది నెట్ ఫ్లిక్స్. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ భాషతో ఇబ్బంది పడే ఛాన్స్ ఉండదు.

డీసీ వాళ్ళదే డెడ్ బాయ్ డిటెక్టివ్స్..

డెడ్ బాయ్ డిటెక్టివ్స్ సిరీస్ ను డిసీ కామిక్ నుంచి తీసుకుని, లైవ్ యాక్షన్ సిరీస్ గా రూపొందించారు. ఇప్పటికే ఈ విధంగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెర పైకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే డెడ్ బాయ్ డిటెక్టివ్స్ సిరీస్ ను మాత్రం నెట్ ఫ్లిక్స్ సిరీస్ గా రూపొందించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు