Puri Musings : యుద్ధాలు అణు బాంబుల వల్ల కాదు పక్క వాళ్లతో వస్తాయి

Puri Musings : డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ పూరి మ్యూజింగ్స్ పేరుతో తరచుగా పలు విషయాల గురించి తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు. అయితే యూట్యూబ్ ఛానల్ లో ఆయన చెప్పే ఈ మ్యూజింగ్స్ వీడియోస్ కు సపరేట్ గా ఫ్యాన్ బేస్ ఉందంటే అతిశక్తి కాదు. ఆయన మ్యూజింగ్స్ వినడానికి వెయిట్ చేస్తున్న వాళ్ల కోసం తాజాగా భూమిపై శాంతి అనే అంశంతో మరో మ్యూజింగ్స్ వదిలారు పూరి జగన్నాథ్. మరి అందులో ఆయన చెప్పిన ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటి? అంటే…

యుద్ధం వచ్చిందే మతం వల్ల

పూరి జగన్నాథ్ తన తాజా మ్యూజింగ్స్ లో శాంతి, యుద్ధం గురించి మాట్లాడారు. 1965 లో ఒక మత పెద్ద స్పీచ్ ఇస్తూ ప్రపంచంలోని అన్ని దేశాలు ఆయుధాల ఉత్పత్తిని ఆపేయాలని, న్యూక్లియర్ బాంబులను తయారు చేయడం నిలిపివేయాలని కోరారని, అప్పట్లో ఆయన స్పీచ్ బాగా వైరల్ అయ్యిందని గుర్తు చేశారు పూరి. అలాగే 1985లో జిడ్డు కృష్ణమూర్తి కూడా ఇదే టాపిక్ పై మాట్లాడారని, అలా ఎన్నో వేల ఏళ్ల నుంచి శాంతి కోసం అన్నీ మతాలు మాట్లాడాయని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పటి వరకు జరిగిన యుద్ధాన్ని మతాల వల్లే జరిగాయని, ఇప్పటికీ దాని వల్లే జరుగుతూ ఉన్నాయని వూరి చెప్పడం మ్యూజిక్స్ లో వినొచ్చు.

బతుకే సంఘర్షణ..

ఇక మనిషి ఎప్పుడూ సంఘర్షణలోనే బ్రతుకుతున్నాడని, ఇప్పటికి కూడా కుటుంబంతో మొదలుపెట్టి పక్కింటి వాళ్ళు, సమాజం, చివరికి తనతో తానే గొడవ పడుతుంటాడని వివరించారు. ఇలా గొడవపడే ఆ మనిషే తన కుటుంబం, భాష, దేశం కోసం యుద్ధాలు చేస్తాడని, దేశాల మధ్య రెండు గ్రూపుల మధ్య గొడవలు జరుగుతూనే ఉంటాయి అంటూ యుద్ధానికి అంతం లేదనే విషయాన్ని వెల్లడించారు.

- Advertisement -

శాంతి గురించి ప్రస్తావిస్తూ..

యుద్ధం లేకుండా శాంతి లేదని, యుద్ధాన్ని ఆపాలంటే ముందు మన మధ్య జరిగే చిన్న చిన్న గొడవలకు ఫుల్ స్టాప్ పెట్టాలని అన్నారాయన. మరి ఈ చిన్న చిన్న గొడవలు ఎలా ఆపాలి అంటే ఒకరినొకరు అసహ్యించుకోవడం తగ్గిస్తే చాలని తెలియజేశారు. ఒక ఊరిలో ఇద్దరు వ్యక్తుల మధ్య మొదలయ్యే గొడవ ఒక తరం తర్వాత ఊరును రెండు వర్గాలుగా చీల్చి, ఆ తర్వాత తరంలో రెండు జాతులుగా మారే అవకాశం ఉంటుందని, నెక్స్ట్ తరంలో ప్రపంచ యుద్ధానికి కారణం కూడా కావచ్చు అని యుద్ధానికి మూల కారణం ఏంటో చెప్పుకొచ్చారు పూరి.

యుద్ధాన్ని ఆపాలంటే..

ఒక చిన్న తగదా వైరస్ లా వ్యాపించి వెయ్యేళ్ళ దాకా కొనసాగుతుంది కాబట్టి దేన్నైనా ఆపాలి అనుకుంటే ప్రారంభంలోనే ఫుల్ స్టాప్ పెడితే భవిష్యత్తు బాగుంటుందని పేర్కొన్నారు పూరి. ఎదుటివారిని, వారి మతాన్ని గౌరవించడం నేర్చుకుంటే ఒక యుద్ధాన్ని ఆపినట్టేనని చెబుతూనే పక్కవారితో అసభ్యంగా, పరుషంగా ఒక్క మాట మాట్లాడినా అది ఏదో ఒక రోజు యుద్ధానికి దారి తీస్తుందని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు పూరి. ఆటం బాంబులు తయారు చేస్తేనో లేదంటే వాటిని ఆపితేనో యుద్ధాలు రావని, ఆటం బాంబుల లాంటి ఆలోచన వల్ల యుద్ధాలు వస్తాయని, కాబట్టి ప్రశాంతంగా ఉంటూ పక్కవారిని కూడా ప్రశాంతంగా ఉండనివ్వండి అని తన మ్యూజింగ్స్ లో కోరారు పూరి జగన్నాథ్

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు