Aryan Rajesh : అన్న ఆర్యన్ రాజేష్ సినిమాలు చేయకపోవడానికి అల్లరి నరేష్ కారణమా?

Aryan Rajesh : దివంగత డైరెక్టర్ ఇవివి సత్యనారాయణ వారసుడిగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆర్యన్ రాజేష్ ప్రస్తుతం వెండితెరకు దూరంగా ఉంటున్నారు. చాలా కాలం క్రితం రెండు మూడు సినిమాల్లో అతిథి పాత్రల్లో నటించిన ఆయన ఇప్పుడు పూర్తిగా కనిపించడం మానేశారు. అయితే ఈ గ్యాప్ కి కారణం తానే అంటూ అల్లరి నరేష్ తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మరి ఇంతకీ ఈ అన్నదమ్ముల మధ్య ఏం జరుగుతోంది? అనే ఆసక్తికరమైన విషయంలోకి వెళ్తే…

ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్ ఇద్దరూ అన్నదమ్ములన్న విషయం తెలుగు ఆడియన్స్ కి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ హీరోలు ఒకప్పుడు పోటీపడి సినిమాలు చేశారు. కానీ ప్రస్తుతం ఆర్యన్ రాజేష్ సినిమాల విషయంలో వెనుకబడిపోయారు. ఇక అల్లరి నరేష్ కెరీర్ కూడా ఒకానొక సమయంలో ముగిసిపోయినట్టే అని అనిపించింది. కానీ ఆయన తన మూస ధోరణి పక్కన పెట్టి నాంది మూవీతో మరోసారి తనలోని యాక్టింగ్ స్కిల్స్ ను ప్రూవ్ చేసుకున్నారు. అల్లరి నరేష్ అంటే కేవలం కామెడీనే కాదు సీరియస్ క్యారెక్టర్లకు కూడా సెట్ అవుతాడు అన్పించుకున్నాడు. దీంతో మళ్లీ జోరుగా సాగుతోంది అల్లరి నరేష్ కెరీర్. కానీ ఆయన అన్న ఆర్యన్ రాజేష్ మాత్రం ఇటీవల కాలంలో సినిమాల్లో కనిపించడం మానేశారు.

ఆయన చివరిసారిగా 2012లో బాలరాజు ఆడి బామ్మర్ది అనే సినిమాలో కనిపించారు. ఆ తర్వాత 2019లో వచ్చిన వినయ విధేయ రామ సినిమాలో శేఖర్ అనే పాత్రలో, 2023లో రిలీజ్ అయినా స్పై మూవీలో ఏజెంట్ సుభాష్ వర్ధన్ అనే పాత్రలో కనిపించాడు. కానీ నిజానికి తన కొడుకును స్టార్ హీరోగా చూడాలి అనేది ఇవివి సత్యనారాయణ కోరిక. మరి అలాంటిది ఆర్యన్ రాజేష్ పూర్తిగా స్క్రీన్ కు దూరం అవ్వడం వెనక కారణం ఏంటి అనే ప్రశ్న తాజాగా అల్లరి నరేష్ కు ఎదురైంది.

- Advertisement -

ఆ ఒక్కటి అడక్కు అనే సినిమా ప్రమోషన్లలో భాగంగా పాల్గొన్న ఇంటర్వ్యూలో అల్లరి నరేష్ ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తూ సరైన క్యారెక్టర్లు రావట్లేదని, ఆర్యన్ రాజేష్ స్టోరీలు వింటున్నట్టు వెల్లడించారు. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో విలన్ లు కరువయ్యారని, ధృవ సినిమాలో అరవింద స్వామి సాఫ్ట్ గా కనిపిస్తూనే తనలోని విలనిజాన్ని బయట పెట్టారని, అలాంటి క్యారెక్టర్ లు చేయమని తన అన్నకు సలహా ఇచ్చారట అల్లరి నరేష్.

దీంతో ప్రస్తుతం ఆర్యన్ రాజేష్ టాలీవుడ్ కు విలన్ గా మారే ఆలోచనలో ఉన్నాడని, సరైన  స్క్రిప్ట్ దొరికితే వెంటనే రంగంలోకి దిగుతాడని క్లారిటీ ఇచ్చాడు అల్లరి నరేష్. ప్రస్తుతం మూడు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న అల్లరి నరేష్ తన అన్నను గైడ్ చేస్తూ బాగానే ముందుకు వెళ్తున్నాడు. మరి వీరిద్దరి స్ట్రాటజీ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి. కాగా అల్లరి నరేష్ మే 3న ఆ ఒక్కటి అడక్కు మూవీతో థియేటర్లలోకి రాబోతున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు