TFDA : తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ కి విరాళం అందించిన ఐకాన్ స్టార్

TFDA: తెలుగు ఫిలిం డైరెక్టర్ అసోసియేషన్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. దర్శకరత్న దాసరి నారాయణరావు గారి జన్మదిన సందర్భంగా మే 4వ తారీఖున డైరెక్టర్స్ డే గా జరుపుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సంవత్సరం ఈ డైరెక్టర్స్ డే ను గ్రాండ్ గా చేయాలని చాలా ప్లాన్ వేసింది తెలుగు ఫిలిం డైరెక్టర్ అసోసియేషన్. అయితే దీనికి ఇందులో భాగంగా చాలామంది దర్శకులను స్వయంగా కలిసి ఈ ఈవెంట్ కి ఇన్వైట్ చేశారు డైరెక్టర్స్ అసోసియేషన్. ఈ ఈవెంట్ ను 4వ తారీఖున చేయాల్సిందే కానీ కొన్ని అనివార్య కారణాల వలన మే 19 వ తారీఖు కు ఈవెంట్ ను పోస్ట్ పోన్ చేశారు. అయితే ఇందులో భాగంగా చాలామందిని ఇన్వైట్ కూడా చేశారు డైరెక్టర్ అసోసియేషన్.

ఒకప్పుడు దర్శకరత్న దాసరి గారిని ఇండస్ట్రీకి పెద్దదిక్కుగా ఫీలయ్యేవారు. దాసరి గారు చనిపోయినప్పుడు కూడా ఇండస్ట్రీకి ఒక పెద్ద దిక్కున కోల్పోయామంటూ చాలామంది బాధపడ్డారు. ఆయన లేని లోటు ఇప్పటికి కనిపిస్తుంది. ఇకపోతే ఇప్పుడు డైరెక్టర్ అసోసియేషన్ కి లక్షల్లో విరాళాలు అందుతున్నాయి. రీసెంట్ గా రెబల్ స్టార్ ప్రభాస్ 35 లక్షలను ఈ అసోసియేషన్ కు విరాళంగా అందించారు. ఈ విషయాన్ని ఒక మీటింగ్ లో మారుతి గారు అనౌన్స్ చేశారు.

మారుతి దర్శకత్వంలో ప్రభాస్ రాజాసాబ్ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే . ఈ సినిమాను పీపుల్ మీడియా నిర్మాణ సంస్థ నిర్మిస్తుంది. అయితే ఈ సినిమాపై అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రభాస్ నుంచి ఒక కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ సినిమా వచ్చి చాలా ఏళ్లయింది. మళ్లీ అటువంటి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ను ప్రభాష్ నుంచి ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు మారుతి. అయితే ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో సినిమా చేయడం వలన ఇదే విషయాన్ని మారుతి స్వయంగా వెల్లడించారు.

- Advertisement -

ఇకపోతే మెగాస్టార్ చిరంజీవిని అలానే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇంకా చాలామందిని కలుస్తూ ఈవెంట్ కి ఇన్వైట్ చేస్తున్నారు. అలానే హరీష్ శంకర్ కూడా ఈ ఈవెంట్ కి ఎవరెవరు హాజరవుతున్నారు కూడా లిస్టును చదివారు. తాజాగా ఈ డైరెక్టర్ అసోసియేషన్ పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను కలిశారు. అల్లు అర్జున్ డైరెక్టర్ అసోసియేషన్ కి 10 లక్షలు రూపాయలు విరాళంగా అందించారు. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆగస్టు 15 రిలీజ్ కి సిద్ధంగా ఉంది. రీసెంట్ గా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్ కు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే డైరెక్టర్స్ ఈవెంట్ కూడా అల్లు అర్జున్ కూడా హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు