Suspense Movie on OTT : ఆ పని కోసం బాయ్ ఫ్రెండ్ తో సముద్రంలోకి వెళ్తే… తెల్లారి లేచే సరికి నడి సముద్రంలో ఆమె ఒక్కతే…

Suspense Movie on OTT : మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ మంజుమ్మెల్ బాయ్స్ ను థియేటర్లలో చూశాక ఈ జానర్ సినిమాలంటే ఆడియన్స్ కి ఆసక్తి పెరిగిపోయింది. అందుకే ఎక్కువగా ఎదురు చూసే హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలనే కాకుండా సర్వైవల్ థ్రిల్లర్స్ అంటే కూడా ఇష్టపడే వారి సంఖ్య పెరిగిపోయింది. ఒకవేళ మీరు కూడా సర్వైవల్ థ్రిల్లర్ మూవీ లవర్స్ అయితే కచ్చితంగా ఈ మూవీ మీకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. నిజానికి ఇదొక హాలీవుడ్ మూవీ. కానీ ఇప్పుడు తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ఓ పని కోసం బాయ్ ఫ్రెండ్ తో సముద్రంలోకి వెళ్లిన ఒక అమ్మాయి తెల్లారి లేచేసరికి నడి సముద్రంలో ఒక్కతే ఉంటుంది. ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీని చాలా మంది ఇంకా చూసి ఉండరు. మరి ఆ మూవీ పేరేంటి? ఎందులో స్ట్రిమింగ్ అవుతుంది? అనే వివరాల్లోకి వెళితే…

ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న హాలీవుడ్ మూవీ పేరు అడ్రిఫ్ట్. ఈ సర్వైవల్ థ్రిల్లర్ మూవీలో అందమైన ప్రేమ కథ కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉన్న ఈ మూవీ తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ఇక అడ్రిఫ్ట్ స్టోరీలోకి వెళ్తే… మూవీ స్టార్టింగ్ స్టార్టింగే ఓ అమ్మాయి నడి సముద్రంలో నీళ్లు నిండిపోయిన బోట్ లో నిద్ర లేస్తుంది. చుట్టూ ఎవ్వరూ కనిపించరు. పిలిచినా ఒక్కరూ పలకరు. ఆ తర్వాత ఆమె గతాన్ని చూపిస్తారు. టామీ అనే ఓ 24 ఏళ్ల అమ్మాయి ఓ చిన్న గ్రామానికి వచ్చి అక్కడ కుక్ గా పని చేస్తూ ఉంటుంది. అది సముద్రం ఒడ్డున ఉండే అతి చిన్న గ్రామం. అదే సమయంలో ఆమెకు హీరోతో పరిచయం జరుగుతుంది. ఆ హీరోకు ఇల్లు లేకపోవడంతో తానే సొంతంగా ఒక బోట్ ను కొని ఇల్లు లాగా తయారు చేసుకుని, అందులోనే నివసిస్తూ ఉంటాడు.

ఇక ఆ తర్వాత వీళ్లిద్దరి మధ్య పెరిగిన పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది. ఆ సమయంలోనే ఓ ముసలి జంట వీళ్ళిద్దరిని కలుస్తారు. తాము చెప్పే ఓ బోట్ ను కాలిఫోర్నియాలో వదిలేసి వస్తే భారీగా డబ్బులు ఇస్తామని చెప్పి డీల్ కుదుర్చుకుంటారు. నిజానికి అక్కడికి వెళ్లడం టామీకి అస్సలు ఇష్టం ఉండదు. కానీ బాయ్ ఫ్రెండ్ కోరిక మేరకు ఓకే చెప్తుంది. ఇక ఇద్దరూ కలిసి ప్రయాణం మొదలుపెడతారు.

- Advertisement -

ఆ ప్రయాణంలో ఊహించని ప్రమాదం చోటు చేసుకుంటుంది. టామీ బాయ్ ఫ్రెండ్ కనిపించకుండా పోతాడు. అసలు టామీ బాయ్ ఫ్రెండ్ సడన్ గా ఎందుకు మాయమయ్యాడు? సముద్రంలో ఆమె ఒక్కతే ఎన్ని రోజుల పాటు గడపాల్సి వచ్చింది? అసలు ఆమె ఆ సముద్రం నుంచి బయట పడిందా? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే అడ్రిఫ్ట్ మూవీని చూసి తీరాల్సిందే. కాబట్టి ఇంకా ఈ మూవీని చూడకపోతే తప్పకుండా ఓసారి లుక్కెయ్యండి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు