Veeramallu teaser: ధర్మం కోసం యుద్ధం.. టీజర్ డేట్ లాక్..!

Veeramallu Teaser.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా లైనప్ లో హరిహర వీరమల్లు సినిమా కూడా ఒకటి ..2021 లోనే మొదలైన ఈ చిత్రం ఇప్పటికీ పూర్తి కాలేదు. ఒకవైపు రాజకీయాలలో బిజీగా ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తన సమయాన్ని సినిమా కోసం కేటాయించలేకపోతున్నారు. కానీ ఎలాగైనా సరే ఈ సినిమాను పూర్తి చేసి సెప్టెంబర్ లోగా విడుదల చేయాలని చిత్ర బృందం ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా.. అర్జున్ రాంపాల్ కీలకపాత్ర పోషిస్తున్నారు.. పీరియాడికల్ యాక్షన్ చిత్రంగా రాబోతున్న హరిహర వీరమల్లు సినిమా నుంచి శ్రీరామనవమి రోజున ధర్మం కోసం యుద్ధం అంటూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే .. అయితే ఇప్పుడు మళ్ళీ టీజర్ ని కూడా విడుదల చేస్తున్నామంటూ ఒక పోస్టర్ను విడుదల చేశారు చిత్ర బృందం.

Veeramallu Teaser: War for Dharma.. Teaser Date Locked..!
Veeramallu Teaser: War for Dharma.. Teaser Date Locked..!

టీజర్ డేట్ లాక్..

ధర్మం కోసం యుద్ధం అంటూ ఒక పోస్టర్ ను విడుదల చేస్తూ.. టీజర్ మే 2వ తేదీన ఉదయం 9 గంటలకు రిలీజ్ చేయబోతున్నామని ప్రకటించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే ఒక రేంజ్ లో ఊగిపోయే అభిమానులు.. ఇప్పుడు గత 3 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు సినిమా నుంచి టీజర్ అంటే ఏ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.. మరి ఈ టీజర్ ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తుంది? సినిమాపై బజ్ ఎలా క్రియేట్ చేస్తుంది? అన్నది చూడాలి.

పవన్ కళ్యాణ్ సినిమాలు..

పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికి వస్తే..OG, ఉస్తాద్ భగత్ సింగ్ , హరిహర వీరమల్లు సినిమాలు లైన్లో ఉన్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం OG, హరిహర వీరమల్లు సినిమాల నుంచి అప్డేట్లను వదులుతూ అభిమానులలో అంచనాలను పెంచేస్తున్నారు. మరొకవైపు పవన్ కళ్యాణ్ రాజకీయంగా బిజీగా ఉన్న విషయం తెలిసిందే.. ఎలాగైనా సరే ఈసారి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావాలని ఆయన అటు టిడిపి ఇటు బిజెపితో పొత్తు పెట్టుకొని కూటమితో ముందుకు సాగుతున్నారు.. ప్రతిపక్షాలను కలగలుపుకుంటూ అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తూ ముందుకు వెళుతున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన సినిమాలను విడుదల చేసి అభిమానులలో తన క్రేజ్ మరింత పెంచుకునే ఓట్లు సంపాదించే ప్రయత్నం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఇకపోతే పవన్ కళ్యాణ్ కి దేశవ్యాప్తంగా ఎంత ఫాన్ ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే.. అయితే సినిమాల పరంగా ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ నిజజీవితంలో ఉపయోగపడడం లేదు. ఇప్పటికే రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఓడిపోతున్నారు. నిజానికి ఎంతో స్టార్డం ఉన్న పవన్ కళ్యాణ్ ను సినిమాల పరంగా ఆదరిస్తున్నారే కానీ నిజజీవితంలో ఆయనను ఒక నాయకుడిగా గుర్తించలేకపోతున్నారు. అందుకే సినిమాలపరంగా సక్సెస్ అయిన పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఫెయిల్యూర్ అవడానికి కారణం ఇదే అని చెప్పడంలో సందేహం లేదు.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు