Naga Chaitanya next movie update : చై డేరింగ్ డెసిషన్… ఐరన్ లెగ్ హీరోయిన్ కు ఛాన్స్?

Naga Chaitanya next movie update : యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య విరుపాక్ష ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్న విషయం తెలిసిందే. ఇందులో హీరోయిన్ గా ఓ ఐరన్ లెగ్ హీరోయిన్ ను తీసుకునే డేరింగ్ డెసిషన్ తీసుకున్నాడు నాగ చైతన్య అనే వార్త బయటకు వచ్చింది. మరి ఇంతకీ ఈ సినిమాలో నాగ చైతన్యతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న ఆ హీరోయిన్ ఎవరు? అనే వివరాల్లోకి వెళితే…

చైతన్య డేరింగ్ డెసిషన్

నాగ చైతన్య ప్రస్తుతం తండేల్ మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ పూర్తవ్వగానే వీరుపాక్ష మూవీతో గత ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ కార్తీక్ దండుతో నెక్స్ట్ మూవీ చేయబోతున్నాడు. చైతు కోసం కార్తీక్ ఇప్పటికే విభిన్నమైన థ్రిల్లర్ కథనం సిద్ధం చేశాడని, ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని సమాచారం. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు. ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అంజనీష్ లోక్నాథ్ మ్యూజిక్ అందించబోతున్నారు. మిథికల్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ మూవీ 2026 లో రిలీజ్ కాబోతోందని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇందులో హీరోయిన్ ఫిక్స్ అయిందనే వార్త ప్రస్తుతం ఫిలిం నగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఆ వార్త ప్రకారం నాగ చైతన్య, కార్తీక్ దండు కొత్త మూవీలో బాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించబోతుందని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉందని సమాచారం.

పూజకు చై సెకండ్ ఛాన్స్….

హీరోయిన్ పూజా హెగ్డే ఇప్పటికే ఓసారి అక్కినేని నాగ చైతన్యతో కలిసి సిల్వర్ స్క్రీన్ పై రొమాన్స్ చేసింది. ఒక లైలా కోసం అనే మూవీలో కెరియర్ స్టార్టింగ్ లో వీళ్ళిద్దరూ కలిసి నటించారు. ఆ తరువాత స్టార్స్ తో అవకాశం రావడంతో మళ్ళీ చైతన్యతో కలిసి నటించలేదు బుట్టబొమ్మ. అయితే ఇటీవల కాలంలో పూజా హెగ్డే కు హిట్స్ అనేవి కరువైన విషయం తెలిసిందే. వరస డిజాస్టర్ల కారణంగా టాలీవుడ్ పూజ హెగ్డేను పూర్తిగా మర్చిపోయింది. బాలీవుడ్లో అడపా దడపా వస్తున్న ఛాన్సులను ఉపయోగించుకుంటూ అక్కడే గడిపేస్తుంది ఈ బ్యూటీ. ఇక రీసెంట్ గా ముంబైలోని బాంద్రాలో ఓ లగ్జరీ ఇల్లు కొని అక్కడే మకాం కూడా పెట్టేసింది. ఈ నేపథ్యంలోనే ఆమె నాగ చైతన్య సినిమాలో హీరోయిన్ గా నటించబోతోంది అనే వార్త ఇంట్రెస్టింగ్ గా మారింది. గతంలో ఆమె సినిమాలన్నీ డిజాస్టర్ గా నిలిచిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ అక్కినేని అభిమానులు నాగ చైతన్య డేరింగ్ డెసిషన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనే చర్చ మొదలుపెట్టారు. మరి ఈ సినిమాలో బుట్టబొమ్మ హీరోయిన్ అంటూ వస్తున్న వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే దాకా ఆగాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు