Mehreen Pirzada: పెళ్లి కాకుండానే తల్లి.. రెండేళ్లుగా ప్రయత్నం..!

Mehreen Pirzada..సినీ సెలబ్రిటీలు ఎక్కువగా తమ అందం పోతుందని ప్రెగ్నెన్సీ విషయం పై కాస్త ఆలస్యం చేస్తూ ఉంటారనే వాదనలు వినిపిస్తూ ఉంటాయి. మరి కొంతమంది తల్లి అవ్వడం కోసం చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నాం అంటూ తెలియజేస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం ఉన్న రోజుల్లో ప్రెగ్నెన్సీ ను చాలా మంది మహిళలు వాయిదా వేస్తూ ఉన్నారు.. ఇలాంటి వారికి ఎగ్ ఫ్రీజింగ్.. ఒక వరం అని కూడా చెప్పవచ్చు.. అయితే వయసులో ఉన్నప్పుడే ఆరోగ్యకరమైన అండాలని భద్రపరచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది..

సెలబ్రిటీలకు ఎగ్ ఫ్రీజింగ్ ఒక వరం..

ముఖ్యంగా సెలబ్రిటీలలో ఇప్పటికే చాలామంది హీరోయిన్స్ కూడా ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా అలాంటి లిస్టులో హీరోయిన్ మెహ్రీన్ కూడా ఇప్పుడు చేరిపోయింది.. తాను కూడా ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకున్నట్లు స్వయంగా సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడించింది.. తన ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియోని షేర్ చేస్తూ నా ఎగ్ ఫ్రీజింగ్ జర్నీ అంటూ క్యాప్షన్ ని జత చేసింది మెహ్రీన్.. అయితే ఇలాంటి ప్రక్రియ చేయడం కోసం తాను రెండు సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నాను చివరికి ఈ రోజున ఈ ఎగ్ ఫ్రీజింగ్ పూర్తి చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉందంటూ మెహ్రీన్ తెలియజేసింది.

ఎగ్ ఫ్రీజింగ్ కోసం రెండేళ్లు కష్టపడ్డా..

అయితే మెహ్రీన్ ఎగ్ ఫ్రీజింగ్ కోసం ఎలా కష్టపడిందనే విషయాన్ని ఈ వీడియోలో చూస్తే మనకి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ విషయాన్ని అందరితో పంచుకోవాలా వద్దా అని అనుమానం కూడా వచ్చిందని కానీ తనలాంటి చాలామంది మహిళలు ప్రపంచంలో ఎక్కువమంది ఉన్నారు. ఎప్పుడు పెళ్లి చేసుకోవాలో పిల్లల్ని ఎప్పుడు కనాలో తెలియక సతమతమవుతున్నారు. కేవలం భవిష్యత్తు కోసమే ఇది చాలా ముఖ్యంగా భావించాను. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నానని తెలియజేసింది ఈ ముద్దుగుమ్మ.

- Advertisement -

తల్లి కావడం కోసం ఎదురుచూడాల్సిన పనిలేదు..

ఈ ప్రక్రియ వల్ల తాను తల్లి కావాలనే కల మరికొన్ని సంవత్సరాలు మరింత ఆలస్యం కావచ్చు అందుకని ఈ ఎగ్ ఫ్రీజింగ్ ఆసుపత్రులు ఉంటే ఫోబియా ఉన్న తనలాంటి వారికి ఇది చాలా సులువుగా అవుతుందని కూడా తెలిపింది. అలాగే హార్మోన్ల ఇంజక్షన్ కారణంగా తను ఆసుపత్రికి వెళ్లిన ప్రతిసారి కూడా కళ్ళు తిరిగి పడిపోయే పరిస్థితి ఏర్పడిందని .. తన జీవితంలో ఇది చాలా విలువైనది అంటే కచ్చితంగా అవుననే చెబుతానని తెలియజేస్తోంది మెహ్రీన్.. మీరు ఎలాంటి పని ఎంచుకున్నా సరే అది మీ కోసమే చేయండి..అంటూ తెలిపింది.

గైనకాలజిస్ట్ డాక్టర్ రమ్మీ కి ధన్యవాదాలు..

అయితే ఇందులో సహాయ పడినటువంటి గైనకాలజిస్ట్ డాక్టర్ రమ్మీ అలాగే తన తల్లిదండ్రులకు కూడా ధన్యవాదాలు అంటూ మెహ్రీన్ తన ఇంస్టాగ్రామ్ లో ఒక స్టోరీని సైతం రాసుకొచ్చింది …ప్రస్తుతం అందుకు సంబంధించిన ఈ వీడియో కూడా వైరల్ గా మారుతోంది. మొత్తానికైతే పెళ్ళి కాకుండానే తల్లి అవ్వడానికి సిద్ధమయ్యింది అంటే నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు