Amrita Pandey: నటి అనుమానాస్పద మృతి.. కేసులో ఊహించని ట్విస్ట్..!

Amrita Pandey..గడిచిన కొద్దిరోజుల నుంచి భోజ్ పురి నటి అమృత పాండే మృతి మీద పలు రకాల విషయాలు వివాదాలుగా మారుతున్నాయి.. ముఖ్యంగా ఈ నటి మరణం పైన ఇప్పటికే విచారణ కొనసాగుతోంది. పోలీసులు అన్ని కోణాలలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.. ఇంతలోనే ఇప్పుడు ఒక షాకింగ్ న్యూస్ బయటకు వచ్చినట్టుగా తెలుస్తోంది.. అందుతున్న సమాచారం ప్రకారం.. నటి అమృత డిప్రెషన్ తో బాధపడిందా లేకపోతే కలత చెందినదా అనే వాదనలో నిజం లేదని రుజువయ్యేలా కనిపిస్తోంది.

సడన్గా అమృత మృతి..

నటి అమృత పాండే మరణానికి రెండు రోజుల ముందే తన భర్త స్నేహితులతో కలిసి ఒక పార్టీలో బాగా ఎంజాయ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ పార్టీలో అమృత కూడా బాగా డాన్స్ వేస్తూ పార్టీని ఎంజాయ్ చేసినట్లుగా సమాచారం. అయితే అలా ఎంజాయ్ చేసిన కేవలం 48 గంటలలోనే తన జీవితాన్ని ముగించుకోవాలని ఎందుకు అనుకుంటుంది అనే విషయం పైన ఇప్పుడు పోలీసులకు కొత్త అనుమానం మొదలైంది. భోజ్ పురి ఇండస్ట్రీ ఒక్కసారిగా నటి అమృత పాండే మరణ వార్తతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

అమృత మరణం పై అనుమానాలు..

అమృత పాండే భర్త యానిమేషన్ రంగంలో పని చేస్తూ ఉండేవారని ఆయన పేరు చంద్రమణి.. ఝంగాండ్ లో ముంబైలో నివసిస్తూ ఉండేవారట. అమృత సోదరి వివాహానికి హాజరయ్యేందుకు ఏప్రిల్ 12న బీహార్ కు వెళ్లారట.. అమృత భర్త కూడా తన వెంటే ఉన్నారట. అమృత సోదరి వివాహం అయిపోయిన తర్వాత ఏప్రిల్ 18న ముంబైకి తిరిగి వచ్చిన తర్వాత భాగల్పూర్ కు వెళ్ళింది.. ఏప్రిల్ 25వ తేదీన అమృత పార్టీ చేస్తున్నప్పుడు తన భర్తతో ఆమె ఉండడం వల్ల కూడా పలు రకాల ప్రశ్నలు ఇప్పుడు ఎదురవుతున్నాయి. అమృత పాండే భర్త చంద్రమణి ఈనెల 18వ తేదీన ముంబైకి తిరిగి వచ్చేసారట.

- Advertisement -

అమృత మృతదేహంపై విస్తుపోయే నిజాలు..

ఏప్రిల్ 27వ తేదీన అమృత తన సోషల్ మీడియా ఖాతా నుండి.. అతని జీవితం రెండు పడవల మీద ఉన్నది.. ఆ పడవని వదిలేయడం వల్ల అతని మార్గం మరింత సులువు అయింది అంటూ ఒక పోస్ట్ ని రాసుకుంది. ఆ తర్వాత కొన్ని గంటలకే ఆమె మృతదేహంతో ప్లాట్ లో కనిపించింది.. అయితే ఇప్పుడు బయటికి వచ్చిన సమాచారం మేరకు ఆ పార్టీలో అమృత తన భర్తతో కలిసి డాన్స్ చేసిందని.. భోజనం చేసిన తర్వాత కూడా ఎలాంటి విభేదాలు కూడా కనిపించలేదు.. గడచిన కొద్ది రోజుల క్రితం నుంచి వీరి యొక్క ప్రైవేట్ ఫోటోలు మాత్రమే ఎక్కువగా కనిపించాయి.. కానీ అమృత తన ఇద్దరి సోదరీమణులు, ఆమె దత్తకు తీసుకున్న ఒక సోదరుడితో చాలా సమస్యలు ఉన్నాయనే విషయం వెలుగులోకి వచ్చింది. అయితే అందుకు సంబంధించి పూర్తి వివరాలు మాత్రం ఇంకా బయటపడలేదు. మొత్తానికైతే అతి చిన్న వయసులోనే అమృత పాండే మరణించడం అటు ఇండస్ట్రీని ఇటు అభిమానులను కలవరపాటుకు గురిచేస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు