Aa Okkati Adakku : సెన్సార్ పని కూడా అయిపోయింది.. రన్ టైం ప్లస్సే..!

Aa Okkati Adakku : టాలీవుడ్ కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా “ఆ ఒక్కటి అడక్కు” పేరుతో ఓ సినిమా తెరకెక్కిందన్న విషయం తెలిసిందే. చాలా రోజుల కిందే షూటింగ్ పూర్తయిపోయిన ఈ సినిమా గత రెండు నెలలుగా వాయిదా పడుతూ సరైన రిలీజ్ డేట్ కోసం చూస్తున్నారు. ఇక ఎట్టకేలకు మే 3న రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇక ఆ ఒక్కటి అడక్కు అనగానే చాలా మంది ఆడియన్స్ కి ఈ పేరు వినగానే ముప్పై ఏళ్ళ కింద వచ్చిన రాజేంద్ర ప్రసాద్ మూవీ “ఆ ఒక్కటి అడక్కు” గుర్తొస్తుంది. అప్పట్లో బ్లాక్ బస్టర్ అయిన ఈ సినిమాను అల్లరి నరేష్ తండ్రి ఇవివి సత్యనారాయణ దర్శకత్వం వహించాడు. ఇక ఇప్పుడు అదే టైటిల్ సెంటిమెంట్ తో నరేష్ మళ్ళీ వస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా, పూర్తిగా అల్లరి నరేష్ మార్క్ కామెడీ తో ఈ సినిమా రాబోతుందని తెలుస్తుంది. ఇక చాలా రోజుల తర్వాత అల్లరి నరేష్ నుండి కామెడీ జోనర్ లో సినిమా వస్తుండడంపై ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా కంటెంట్ క్లిక్ అయితే సమ్మర్ లో బి,సి సెంటర్ల ప్రేక్షకులు ఈజీగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది.

అల్లరోడి పెళ్లి కష్టాలు..

ఇక ఆ ఒక్కటి అడక్కు సినిమాలో అల్లరి నరేష్ పెళ్లి కోసం తపిస్తున్న యువకుడిగా కనిపించబోతుండగా, ప్రస్తుతం యువత ఎదుర్కొనే సమస్యనే కామెడీ కోణంలో తీశారు మేకర్స్. ఇక హీరో డబ్బు, కులం లాంటి భావన లేకపోయినా ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని ప్రయత్నంలో, 49 సార్లు రిజెక్ట్ కావడంతో చివరికి మ్యారేజ్ బ్యూరోని సంప్రదిస్తాడు. అనంతరం ఫరియా అబ్దుల్లాతో ప్రేమలో పడగా, కథ ఊహించని మలుపులు తిరుగుతుంది. ఫైనల్ గా హీరోకి పెళ్లయిందా? వారిద్దరూ కలిసారా? అనేదే కథ. ఇక అల్లరి నరేష్ యొక్క ఫ్రస్టేషన్ కూడిన కామెడీ యాక్షన్ ని కూడా హైలెట్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. గోపీ సుందర్ సంగీతం అందించిన ఈ సినిమా మే 3న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. ఇక చాలా రోజుల తరువాత నరేష్ నుంచి వస్తున్న కామెడీ సినిమా కావడంతో తప్పకుండా హిట్ అవుతుంది అని మేకర్స్ నమ్మకంతో ఉన్నారు. ఇక మల్లి అంకం దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను రాజీవ్ చిలక నిర్మించడం జరిగింది.

UA సెన్సార్ కొట్టేసింది..

ఇక ఆ ఒక్కటి అడక్కు (Aa Okkati Adakku) సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకోగా, సెన్సార్ వాళ్ళు యూ/ఏ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. ఇక మూవీ టైం 2 గంటల 14 నిమిషాలుగా డిసైడ్ చేసారు. లిమిటెడ్ రన్ టైం ఉండడం వల్ల ఈ మూవీ బోర్ కొట్టకుండా ఉండే చాన్స్ ఉంది. అది సినిమాకు మంచి ప్లస్ పాయింట్ అవుతుందని నెటిజన్లు అంటున్నారు. మరి చాలా రోజుల తర్వాత పూర్తి స్థాయి కామెడీ ఎంటర్టైనర్ తో వస్తున్న అల్లరోడు ఈ సినిమాతో కం బ్యాక్ ఇస్తాడా లేదా చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు