Aa Okkati Adakku Trailer : అల్లరోడి పెళ్లికోసం ఆవేదన..

Aa Okkati Adakku Trailer : టాలీవుడ్ కామెడీ స్టార్ అల్లరి నరేష్ హీరోగా “ఆ ఒక్కటి అడక్కు” పేరుతో ఓ సినిమా తెరకెక్కిందన్న విషయం తెలిసిందే. అయితే చాలామంది ఆడియన్స్ కి ఈ పేరు వినగానే ముప్పై ఏళ్ళ కింద వచ్చిన రాజేంద్ర ప్రసాద్ మూవీ “ఆ ఒక్కటి అడక్కు” గుర్తొస్తుంది. అప్పట్లో బ్లాక్ బస్టర్ అయిన ఈ సినిమాను నరేష్ తండ్రి ఇవివియే దర్శకత్వం వహించాడు. ఇక ఇప్పుడు అదే టైటిల్ సెంటిమెంట్ తో నరేష్ వస్తున్నాడు. ఇంతకు ముందు రిలీజ్ అయిన టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా, తాజాగా ట్రైలర్ కూడా రిలీజ్ కావడం జరిగింది. ఇక కాసేపటికిందే రిలీజ్ అయిన ఆ ఒక్కటి అడక్కు ట్రైలర్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.

అల్లరోడి పెళ్లి కష్టాలు..

ఇక అల్లరి నరేష్ ఆ ఒక్కటి అడక్కు చిత్రంలో పెళ్లి కాని యువకుడిగా కనిపించబోతున్నాడు. ప్రస్తుతం యువత ఎదుర్కొనే సమస్యనే కామెడీ కోణంలో తీశారు మేకర్స్. ఇక హీరో డబ్బు, కులం లాంటి భావన లేకపోయినా ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని ప్రయత్నం చేస్తుండగా, 49 సార్లు రిజెక్ట్ కావడంతో చివరికి మ్యారేజ్ బ్యూరోని సంప్రదిస్తాడు. అనంతరం ఫరియా అబ్దుల్లాతో ప్రేమలో పడతాడు. అయితే ఆ అమ్మాయితో హీరో ప్రేమ వ్యవహారం ఊహించని మలుపులు తిరుగుతుంది. ఫైనల్ గా హీరోకి పెళ్లయిందా? వారిద్దరూ కలిసారా? అనేదే కథ. ఇక ఈ తరం యువతకు పెళ్లి పెద్ద సమస్య కావడంతో దర్శకుడు ఈ అంశాన్ని ఎంచుకుని వినోదాత్మకంగా చెప్పాడు. ఇక కామెడీ సీక్వెన్స్‌ లలో అల్లరి నరేష్ ఎప్పటిలాగే బెస్ట్ అనిపించగా, తన కామిక్ టైమింగ్ తో పాటు, ఫరియా అబ్దుల్లా పంచ్ లు కూడా సినిమాలో హైలెట్ కాబోతున్నట్లు చూపించారు. ఇక అల్లరి నరేష్ ఈ సినిమాలో కాస్త ఫ్రస్టేషన్ కూడిన యాక్షన్ ని కూడా హైలెట్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.

మే 3న రిలీజ్ కి సిద్ధం..

ఇక ఈ సినిమా ట్రైలర్ చివర బంధువుల వలన ఇబ్బంది పడే యువకులకు నచ్చే విధంగా అల్లరి నరేష్ చెప్పిన డైలాగ్ హైలెట్ అయ్యింది. ఇక ఈ సినిమాకు గోపీ సుందర్ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌ కు సరైన మ్యూజిక్ ని సెట్ చేసారు. ఇక ఈ చిత్రానికి అబ్బూరి రవి డైలాగ్స్ అందించారు. టాలీవుడ్ బిగ్ డిస్ట్రిబ్యూషన్ హౌస్ ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ & ఎల్‌ఎల్‌పి AP మరియు తెలంగాణ సంయుక్తంగా “ఆ ఒక్కటి అడక్కు” థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకుంది. ఇక మే 3న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. ఇక చాలా రోజుల తరువాత నరేష్ నుంచి వస్తున్న కామెడీ సినిమా కావడంతో తప్పకుండా హిట్ అవుతుంది అని మేకర్స్ నమ్మకంతో ఉన్నారు. ఇక మల్లి అంకం దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను రాజీవ్ చిలక నిర్మించడం జరిగింది. అయితే అల్లరి నరేష్ కి అచ్చోచిన కామెడీ జోనరే అయినా రొటీన్ కామెడీ డ్రామా అయితే మాత్రం జనాలు మొహమాటం లేకుండా తిరస్కరిస్తారు. మరి “ఆ ఒక్కటి అడక్కు” సినిమా ఆ రోజుల్లో సినిమాలా మ్యాజిక్ చేస్తుందా లేదా అనేది తెలియాలంటే మే 3 వరకు వెయిట్ చేయాలి.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు