Jersey2 : ఫ్యాన్స్ నోట సీక్వెల్ మాట.. నాని సమాధానమిదే!

Jersey2 : టాలీవుడ్ లో న్యాచురల్ స్టార్ నాని సినిమాల శైలి ప్రత్యేకంగా ఉంటుంది. ఒక్కో సినిమాలు డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ, చిన్న హీరో నుండి, మీడియం రేంజ్ హీరోకి, ఇప్పుడు ఏకంగా స్టార్ హీరో రేంజ్ కి ఎదిగాడు. అయితే నాని కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. కెరీర్ బిగినింగ్ నుండి చూసుకుంటే పిల్ల జమిందార్, ఈగ, భలే భలే మగాడివోయ్, నేను లోకల్, MCA ఇలా ఇలా చాలా ఉన్నాయి. అయితే నాని కెరీర్ లో ఎన్ని బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు ఉన్నా, అందులో అన్ని వర్గాల ప్రేక్షకులకు బాగా ఎక్కువగా నచ్చే ఫీల్ గుడ్ ఎమోషనల్ మూవీ జెర్సీ అని చెప్పవచ్చు. ఈ సినిమాకు టాలీవుడ్ లో ఒక సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉంది. ముఖ్యంగా నాని ఫ్యాన్స్ కి క్రికెట్ అభిమానులకు కూడా ఎంతో ప్రత్యేకం ఈ సినిమా. నానిలోని సరికొత్త అద్భుతమైన నటుడిని ఈ సినిమా తెరపైకి ఆవిష్కరించింది.

నాని కెరీర్ లో కల్ట్ మూవీ..

ఇక వరుస ప్లాపుల్లో ఉన్న నాని కెరీర్ కి కూడా జెర్సీ మంచి బూస్టప్ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఈ మధ్యనే ఐదేళ్లు పూర్తి చేసుకుంది. తొంభై తొమ్మిది సార్లు ప్రయత్నించి ఓడిపోయే ఓ సగటు స్పోర్ట్స్ ఆటగాడి కథలా ఈ సినిమా ఉంటుంది. చాలా మంది నాని అర్జున్ పాత్రలో తమని తాము ఊహించుకుంటారు. ఇక ఈ స్పోర్ట్స్ డ్రామా హిందీలో కూడా రీమేక్ అయిన విషయం తెలిసిందే. అయితే బాక్సాఫీస్ వద్ద మాత్రం అనుకున్నంత స్థాయిలో ఈ సినిమా సక్సెస్ కాలేకపోయింది. అని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటైన ఈ సినిమాకు సీక్వెల్ రావాలని చాలా మంది ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

సీక్వెల్ నాని రియాక్షన్..

అయితే జెర్సీ మూవీ సీక్వెల్ కోసం నాని ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కూడా చాలా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఆ విషయంపై ఫ్యాన్స్ డైరెక్ట్ గా నానినే అడిగేసారు లేటెస్ట్ గా అల్లరి నరేష్ నటించిన ‘ఆ ఒక్కటి అడక్కు’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నాని పాల్గొన్న విషయం తెలిసిందే. అక్కడ నాని మాట్లాడుతూ ఉండగా ఫ్యాన్స్ అందరూ కూడా జెర్సీ2 (Jersey2) ఎప్పుడు? అంటూ గట్టిగా అరిచారు. అయితే నాని మాత్రం ఊహించని సమాధానం ఇచ్చాడు. “అందులో నేను లేనుగా.. వాడు పోయాడు.. అయిపోయింది” ! ఇప్పుడు ఎవరితో చేసుకుంటారో చేసుకోండి”.. అని సరదాగా నవ్వుతూ సమాధానం ఇచ్చాడు. నిజంగా నాని చెప్పిన పాయింట్ కూడా కరెక్టే. అందులో అర్జున్ పాత్రలో నాని కనిపించగా, ఆ క్యారెక్టర్ క్లైమాక్స్ లో చనిపోతుంది.

- Advertisement -

సినిమాలో క్రికెట్ ఆడితే చనిపోతావు అని తెలిసిన కూడా కొడుకు దృష్టిలో హీరో అవ్వడం కోసం మళ్ళీ క్రికెట్ బాట పడతాడు. క్లైమాక్స్ లో కొడుకు తండ్రి జీవితం గురించి చెబుతుండగా సినిమా ఎండ్ అవుతుంది. కాబట్టి మళ్ళీ సీక్వెల్ అంటే కథలో నాని ఏ విధంగా కనిపిస్తాడు అనేది అసలు ప్రశ్న. దర్శకుడు కూడా జెర్సీ సీక్వెల్ అనే అంశంపై పెద్దగా క్లారిటీ ఇచ్చింది లేదు. బహుశా వేరే స్పోర్ట్స్ డ్రామాలో కొత్త తరహా కథతో ఏమైనా సర్ ప్రైజ్ చేస్తారో లేదో చూడాలి. ఇక నాని ‘సరిపోదా శనివారం’ సినిమాతో ఆగస్ట్ లో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు