Jersey Re Release Date : జెర్సీ @5 Years… మళ్లీ థియేటర్‌లోకి వస్తున్న బ్లాక్ బస్టర్ మూవీ

Jersey Re Release Date : నేచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన ఈ స్పోర్స్ డ్రామా నాని కెరీర్ లో మంచి హిట్ గా నిలిచింది. నాని సాధారణంగానే నేచులర్ గా నటిస్తాడు. అలాంటిది ఈ మూవీలో నానికి యాక్టింగ్ కు మంచి స్కోప్ దోరికింది. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో నాని యాక్టింగ్ కు ఆడియన్స్ ఫిదా అయిపోయారు.

తెలుగులో మంచి విజయం దక్కడంతో హిందీలో కూడా రీమేక్ చేశారు. తెలుగులో 2019లో రిలీజ్ అయితే, హిందీలో 2022లో రిలీజ్ అయింది. తెలుగులో డైరెక్ట్ చేసిన గౌతమ్ తిన్ననూరినే హిందీలో కూడా దర్శకత్వం వహించారు. హిందీ వెర్షన్ కు మాత్రం నాగ వంశీతో పాటు దిల్ రాజు, అల్లు అరవింద్ కూడా నిర్మాతలు ఉన్నారు. అయితే తెలుగులో ఈ ఎపిక్ స్పోర్స్ డ్రామా రిలీజ్ అయి ఐదు ఏళ్లు కావొస్తుంది. ఈ నెల 19కి జెర్సీ మూవీ తెలుగులో రిలీజ్ అయి 5 సంవత్సరాలు గడిచినట్టు.

దీంతో ఈ మూవీని మళ్లీ రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 5 సంవత్సరాలు కావొస్తున్న సందర్భంగా ఏప్రిల్ 20వ తేదీన జెర్సీని రీ రిలీజ్ చేయ్యడానికి నిర్మాతలు సితారా ఎంటర్టైన్మెంట్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారిక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.

- Advertisement -

అయితే గత కొన్ని రోజుల నుంచి రీ రిలీజ్ ట్రేండ్ బాగా నడుస్తున్న సంగతి తెలిసిందే. గతంలో సూపర్ హిట్ అయిన సినిమాలను నిర్మాతలు మళ్లీ థియేటర్ లోకి తీసుకొచ్చి క్యాష్ చేసుకుంటున్నారు. అభిమానులు కూడా ఈ రీ రిలీజ్ లను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ రీ రిలీజ్ లిస్ట్ లో జెర్సీ కూడా చెరిపోతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు