Sai Durga Tej: పెళ్లి పీటలెక్కనున్న సాయి దుర్గా తేజ్.. వధువు ఎవరంటే..?

Sai Durga Tej.. మెగా మేనల్లుడు సాయి ధరంతేజ్ అలియాస్ సాయి దుర్గా తేజ్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు వార్తలు మళ్లీ వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ గా గుర్తింపు తెచ్చుకున్న వారిలో సాయి దుర్గా తేజ్ కూడా ఒకరు. యాక్సిడెంట్ తర్వాత వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారుతారని అందరూ అనుకున్నారు. కానీ అడపాదడపా సినిమాలు మాత్రమే చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు… ఇదిలా ఉండగా గతంలో పలువురు హీరోయిన్స్ తో ఎఫైర్ వార్తలు వినిపించాయి అందులో ఒక హీరోయిన్ తో పీకల్లోతు వరకు ప్రేమలో ఉన్నాడని వార్తలు వినిపించాయి.. కానీ అవన్నీ రూమర్స్ గానే మిగిలిపోయాయి..

Sai Durga Tej: Get ready to marry..
Sai Durga Tej: Get ready to marry..

బైక్ యాక్సిడెంట్ తర్వాత
ఇక రెండు సంవత్సరాల క్రితం సాయి ధరంతేజ్ బైక్ యాక్సిడెంట్ తో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.. యాక్సిడెంట్ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన ఈయన అంతకు ముందే రిపబ్లిక్ సినిమాతో డిజాస్టర్ గా నిలిచి.. ఆ తర్వాత తన మేనమామ పవన్ కళ్యాణ్ తో తీసిన బ్రో సినిమా కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు.. కానీ ఆ తర్వాత నటించిన విరూపాక్ష సినిమా మాత్రం భారీ విజయాన్ని అందించింది. మరొకవైపు సత్య అనే షార్ట్ ఫిలిం ని కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ షార్ట్ ఫిలిం ఏకంగా పలు అవార్డులను సైతం సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా సాయి దుర్గా తేజ్ గంజా శంకర్ సినిమా టైటిల్ ను ప్రకటించగా ఈ టైటిల్ కూడా వివాదంలో చిక్కుకుంది…

పెళ్లి పీటలెక్కనున్న సాయి దుర్గా తేజ్ ..
ఇక మరొకవైపు ఈయన పెళ్లి అంటూ వార్తలు మళ్లీ తెరపైకి వచ్చాయి. గతంలో ప్రముఖ హీరోయిన్ రెజీనా కసాండ్రా తో ఎఫైర్ వార్తలు తెరపైకి రాగా కొట్టి పారేశారు.. కానీ మళ్లీ ఈమెతోనే ఆయన పెళ్లికి సిద్ధమవుతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజమందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త మళ్లీ వైరల్ గా మారింది. ఒకవేళ వరుణ్ తేజ్ మాదిరే ఈయన కూడా రహస్యంగా తమ ప్రేమను మెయింటైన్ చేసి చివర్లో ట్విస్ట్ ఇస్తారేమో చూడాలి. వరుణ్ తేజ్ దాదాపు నాలుగు సంవత్సరాలు లావణ్య త్రిపాఠి తో రహస్యంగా ప్రేమాయణం కొనసాగించి గత ఏడాది జూన్లో నిశ్చితార్థం చేసుకొని అందరిని ఆశ్చర్యపరిచారు. మరి వీరు కూడా రహస్యంగా ప్రేమాయణం కొనసాగించి చివరిలో ట్విస్ట్ ఇస్తారేమో చూడాలి.

- Advertisement -

సాయి ధరంతేజ్ సినిమాలు..
పిల్ల నువ్వు లేని జీవితం సినిమాతో భారీ విజయాన్ని అందుకొని బెస్ట్ మేల్ డెబ్యూ కేటగిరీలో సైమా అవార్డు సొంతం చేసుకున్న ఈయన ఆ తర్వాత సినిమా అవార్డ్స్ కూడా సొంతం చేసుకున్నారు.. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ , సుప్రీం వంటి చిత్రాలతో మరొకసారి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు .. చిత్రలహరి, ప్రతిరోజు పండగే, సోలో బ్రతుకే సో బెటర్, రిపబ్లిక్, విరూపాక్ష నటించారు. అయితే కమర్షియల్ హీరో రేంజ్ లో ఒక్క సక్సెస్ కూడా ఈయన ఖాతాలో లేదు మరి ఈసారైనా అద్భుతమైన కథల ఎంపికలతో ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటారో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు