Rashmika Mandanna : రష్మికను బాలీవుడ్ పట్టించుకోవట్లేదా?

Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్న కెరీర్ ఇప్పుడు పీక్స్ దశలో ఉంది. ఒక్కో ఇండస్ట్రీలో తన టాలెంట్ ను నిరూపించుకొని ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్ గా ఫుల్ జోష్ లో ఉంది రష్మిక. కానీ తాజాగా ఆమె లైనప్ చూస్తే బాలీవుడ్ ఈ బ్యూటీని పట్టించుకోవట్లేదా? అనే అనుమానాలు మొదలయ్యాయి. మరి ఇంతకీ రష్మిక విషయంలో హిందీ చిత్ర పరిశ్రమ వ్యవహరిస్తున్న తీరు ఏంటి? అనే ఇంట్రెస్టింగ్ టాపిక్ లోకి వెళ్తే…

అనుకున్నదొకటి అయినదొకటి

కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ముందుగా శాండల్ వుడ్ లో మూవీ చేసి అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఆ తర్వాత టాలీవుడ్ నుంచి పిలుపు రావడంతో ఛలో మూవీతో ఇక్కడ తన కెరీర్ ను మొదలు పెట్టి పుష్పరాజ్ తో రొమాన్స్ చేసేదాకా ఎదిగింది. ఇక ఈ ప్రయాణంలోనే ఇక్కడితోనే ఆగిపోకుండా బాలీవుడ్ పై కూడా కన్నేసింది. అక్కడ అడపా దడపా సినిమాలు చేస్తూ మరోవైపు సౌత్ లోని స్టార్ హీరోలతో జతకట్టింది. అయితే బాలీవుడ్ కు వెళ్లినప్పటికీ ఈ అమ్మడికి పెద్దగా హిట్స్ లేవు అనుకుంటున్న తరుణంలోనే యానిమల్ మూవీతో ఊహించని రేంజ్ లో బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది రష్మిక మందన్న. సందీప్ రెడ్డి వంగా ఇచ్చిన హిట్ తో బాలీవుడ్ లో కూడా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది ఈ బ్యూటీ. ఇంకేముంది 900 కోట్లు కొల్లగొట్టిన ఈ మూవీతో ఇక రష్మిక ఫేట్ మారిపోయినట్టేనని, బాలీవుడ్ అవకాశాలు ఆమె ఇంటి ముందు క్యూ కడతాయని అందరూ అనుకున్నారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా ఈ బ్యూటీకి బాలీవుడ్ నుంచి పెద్దగా ఆఫర్లు ఏమి రావట్లేదు.

హిందీ మేకర్స్ రష్మికను పట్టించుకోట్లేదా?

ప్రస్తుతం రష్మిక మందన్న రెయిన్ బో అనే ఒక బైలింగ్వల్ మూవీ, ది గర్ల్ ఫ్రెండ్ అనే ఒక తెలుగు మూవీ, పుష్ప 2 అనే పాన్ ఇండియా మూవీ చేస్తోంది. అలాగే ఈ బ్యూటీ చేతిలో మరో రెండు సినిమాలు ఉన్నాయి. ఒకటి యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ కాగా, మరొకటి హిందీ మూవీ చావా. ఇదొక పీరియాడికల్ యాక్షన్ డ్రామా. ఇంతకు మించి ప్రస్తుతానికి రష్మిక చేతిలో హిందీ సినిమాలేవీ లేవు. మరి ఇంతకీ రష్మికకు బాలీవుడ్ నుంచి పెద్దగా ఆఫర్లు రాకపోవడానికి కారణం ఏంటి? ఆమెను హిందీ మేకర్స్ పక్కన పెట్టేసారా? అంటే…

- Advertisement -

ప్రస్తుతానికి రష్మిక మందన్న షెడ్యూల్ బిజీబిజీగా ఉంది. చేతిలో అరడజను సినిమాలతో ఆమె క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. అందుకే ప్రస్తుతం ఇతర సినిమాలకు సైన్ చేసే ఆలోచనలో ఈ బ్యూటీ లేకపోవచ్చు. పుష్ప 2తో పాటు ఆమె చేతిలో ఉన్న మరికొన్ని సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. అవి పూర్తి అయితే అప్పుడు రష్మిక మందన్న నెక్స్ట్ ఆఫర్ల గురించి మాట్లాడుకోవాల్సిన సమయం వచ్చినట్టు. మరి అప్పటిదాకా రష్మిక ఈ సినిమాలనే మెయింటైన్ చేస్తుందా? లేదంటే స్టార్ హీరోలలాగా రాబోయే నాలుగైదు ఏళ్ల వరకు భారీ సినిమాలకు డేట్స్ ఇచ్చి డైరీని నింపేస్తుందా? అనేది చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు