Ramayanam Movie : రామాయణం కోసం హాలీవుడ్ నిర్మాతలు… ఇండియన్ సినిమా హిస్టరీలో ఇదే ఫస్ట్ టైం

Ramayanam Movie : ప్రస్తుతం ఇండస్ట్రీలో అత్యంత భారీ బడ్జెట్ మూవీ ఏది అంటే కల్కి అని టక్కున చెప్తారు ఎవరైనా. కానీ దాన్ని మించి అనేలా రూపొందుతోంది రామాయణం. నితీష్ తివారి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ప్రాజెక్టుకు కన్నడ రాకింగ్ స్టార్ యష్, నమిత్ మల్హోత్రా నిర్మాతలుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఫస్ట్ టైం హాలీవుడ్ నిర్మాణ సంస్థ రామాయణం మూవీ నిర్మాణంలో భాగం కాబోతుందనే విషయం సంచలనగా మారింది.

తెరపైకి వార్నర్ బ్రదర్స్…

బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారి డ్రీమ్ ప్రాజెక్ట్ రామాయణం మూడు భాగాలుగా తెరకెక్కుతోంది. ఇందులో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటించబోతున్నారు. మూవీ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంకా రాలేదు కానీ ఇప్పటికే షూటింగ్ మొదలైపోయింది. ముంబైలో వేసిన భారీ సెట్స్ లో షూటింగ్ జరుగుతుండగా, ఇప్పటికే అందులో కైకేయిగా నటిస్తున్న లారా దత్తా, దశరథుడిగా కనిపించబోతున్న అరుణ్ గోవిల్ లుక్స్ లీక్ అయ్యాయి. ఇక ఇప్పుడు తెరపైకి వార్నర్ బ్రదర్స్ పేరు వచ్చింది. ఇప్పటికే కో ప్రొడ్యూసర్ యష్ ఈ మూవీని గ్లోబల్ స్టేజ్ పై ప్రదర్శించడానికి రెడీ అవుతున్నట్టుగా వెల్లడించారు. రామాయణం మూవీని నమిత్ మల్హోత్రా, యష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారన్న విషయం తెలిసిందే.

అయితే తాజా సమాచారం ప్రకారం రామాయణం మూవీనీ మరింత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించడానికి వార్నర్ బ్రదర్ తో ఒప్పందం కుదుర్చుకోవడానికి నిర్మాత నమిత్ మల్హోత్రా ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ఈ మూవీతో ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్ ని అందించాలని భావిస్తున్న మేకర్స్, దీన్నొక గ్లోబల్ మూవీగా మార్చి ఇంటర్నేషనల్ సినిమా తెరపై భారతీయ ఇతిహాసాన్ని అత్యద్భుతంగా ప్రెజెంట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే అంతర్జాతీయ స్థాయిలో కథను అందించడానికి రెడీ అవుతున్నారు. అలాగే ఈ సినిమా కోసం వందల కోట్లను నీళ్లలా ఖర్చు పెట్టడానికి రెడీ అవుతున్నారు.

- Advertisement -

ఈ క్రమంలోనే నమిత్ మల్హోత్రా రామాయణం మూవీనీ అత్యుత్తమ అంతర్జాతీయ పంపిణీదారుల చేతుల్లో పెట్టాలని, బెస్ట్ మార్కెటింగ్ ఛానల్ కు మూవీని ఇవ్వాలని భావిస్తున్నారట. ఇక ఈ నేపథ్యంలోనే వార్నర్ బ్రదర్స్ అయితే ఈ మూవీకి అన్ని విధాలుగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో బాలీవుడ్ నిర్మాణ సంస్థను రంగంలోకి దింపే ప్రయత్నం మొదలు పెట్టారట. వీళ్లయితే అటు భారీ బడ్జెట్ పెడతారు. అలాగే హాలీవుడ్ మూవీ రేంజ్ లో ప్రపంచవ్యాప్తంగా మూవీకి మార్కెట్ క్రియేట్ అవుతుంది.

మరి వీళ్ళ ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి. ప్రస్తుతం ముంబైకి దగ్గరలోని ఓ గ్రామీణ ప్రాంతంలో రణబీర్ కపూర్ ఈ మూవీ కోసం కసరత్తులు చేస్తున్నారు. శ్రీరామనవమి రోజున రామాయణంకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతోందని సమాచారం. ఇక ఈ మూవీకి ఏఆర్ రెహమాన్, హ్యాన్స్ జిమ్మర్ సంగీతం అందించబోతున్నట్టు తెలుస్తోంది. ఇక రామాయణం మూవీకి యష్ ఏకంగా 80 కోట్ల బడ్జెట్ పెట్టబోతున్నట్టు టాక్ నడుస్తోంది. అఫిషియల్ అనౌన్స్మెంట్ వస్తే మూవీలో ఎవరెవరు నటిస్తున్నారు అనే విషయంపై ఓ క్లారిటీ వస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు