Prabhas and Jr NTR : ప్రభాస్ మిస్… కానీ ఈ గోల్డెన్ ఛాన్స్ ను వదిలేలా లేడు

Prabhas and Jr NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ వేస్తున్న స్కెచ్ లు చూస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తోంది ఒక్కొక్కరికి. అప్పుడు ప్రభాస్ మిస్ చేసుకున్న ఛాన్స్ ను, ఇప్పుడు తారక్ మాత్రం వదిలేలా కనిపించడం లేదు. మరి ఇంతకీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్లాన్ ఏంటి? అనే వివరాల్లోకి వెళ్తే…

కరణ్ ను పక్కన పెట్టేసిన ప్రభాస్

బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తర్వాత ప్రభాస్ రేంజ్ అమాంతంగా పెరిగిపోయింది. ఇక ఆ మూవీ పంపిణీ రైట్స్ ను దక్కించుకున్న కరన్ జోహార్ పాత్ర కూడా అందులో కీలకమే. మామూలుగానే కరణ్ జోహార్ అందరివాడు అనే టాక్ ఉంది బాలీవుడ్లో. ముఖ్యంగా స్టార్ కిడ్స్ ఎంట్రీకి సరైన మేకర్ అనే ట్యాగ్ కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే బాహుబలి ఇచ్చిన జోష్ తో కరణ్ జోహార్ ప్రభాస్ ను బాలీవుడ్ మార్కెట్లోకి దింపుదామని ప్లాన్ చేశారు. అయితే పలు కారణాల వల్ల వీళ్ళిద్దరి కాంబోలో రావాల్సిన ప్రాజెక్టు పట్టాలెక్కలేదు.

దానికి కారణం ప్రభాస్ 30 కోట్లు పారితోషకంగా డిమాండ్ చేశాడని, కానీ కరణ్ అందుకు ఒప్పుకోలేదని టాక్ నడిచింది. ఇదే విషయాన్ని ఒకానొక సందర్భంలో ప్రభాస్ ముందు ప్రస్తావిస్తే అలాంటిదేమీ లేదని కొట్టిపారేసారాయన. ఆ ప్రాజెక్ట్ ఎందుకో సెట్ అవ్వలేదు అన్నారు. ఇక ఆ తర్వాత కూడా కరణ్ జోహార్ ప్రభాస్ తో మరో ప్రాజెక్ట్ పట్టాలెక్కించాలని గట్టి ప్రయత్నాలే చేశారు. కానీ ప్రభాస్ మాత్రం సాహో సినిమా చేస్తున్నాను కాబట్టి దానికి చాలా టైం పడుతుందని, తర్వాత చూద్దాం అంటూ కరణ్ జోహార్ లాంటి మేకర్ ను పక్కన పెట్టేసాడు. ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రభాస్ రేంజ్ మరింతగా ఎదిగిపోయింది. కానీ కరణ్ జోహార్ కల మాత్రం కలగానే మిగిలిపోయింది.

- Advertisement -

గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన తారక్

ఈ నేపథ్యంలోనే తాజాగా దేవర మూవీ థియేట్రికల్ రైట్స్ తో మరోసారి కరణ్ జోహార్ పేరు తెరపైకి వచ్చింది. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా పాన్ ఇండియా మూవీ దేవర పంపిణీ రైట్స్ ను అనిల్ తడానితో కలిసి కరణ్ జోహార్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక కరణ్ చేతిలో సినిమా పడింది అంటే దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. అలాగే ఈ మూవీతో బాలీవుడ్ లో కూడా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని భావిస్తున్నారు యంగ్ టైగర్.

దేవర మూవీతో కరణ్ జోహార్ ను ఉపయోగించుకొని ముందుగా హిందీ మార్కెట్ ను క్రియేట్ చేయబోతున్నాడు ఎన్టీఆర్. ఆ తర్వాత వార్ 2తో డైరెక్ట్ గా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ పై దండయాత్ర చేయబోతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్, కరణ్ జోహార్ కాంబినేషన్లో మూవీ రాబోతుందనే రూమర్ వైరల్ అవుతుంది. అదే గనక జరిగితే అప్పుడు ప్రభాస్ మిస్ చేసుకున్న ఈ గోల్డెన్ ఛాన్స్ ను తారక్ బాగా వాడుకుంటున్నట్టే. కరణ్ జోహార్ లాంటి స్టార్ మేకర్ తో మూవీ అంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం టాలీవుడ్ కే షేర్ అయిన ఎన్టీఆర్ బాలీవుడ్ లో బాక్స్ ఆఫీస్ లు బద్దలు కొట్టడం ఖాయం. ఇదే గనక జరిగితే తారక్ క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అందుకే ఈ రూమర్ నిజమైతే బాగుండునని కోరుకుంటున్నారు తారక్ ఫాన్స్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు