Tollywood : ఓటు హక్కు వినియోగించుకోనున్న టాలీవుడ్ ప్రముఖులు.. ఏ ఏరియాలో ఎవరెవరంటే..!

Tollywood : తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా ఎన్నికల ప్రచారం జోరుగా జరిగిన విషయం తెలిసిందే. ఆంధ్ర ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఎంపీ ఎలెక్షన్లు ఒకేసారి జరగనుండగా, తెలంగాణ లో ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికలు అయిపోగా, ఎంపీ ఎన్నికలు ఇప్పుడు జరుగనున్నాయి. రేపు ఫైనల్ గా అనగా మే 13న తెలుగు రాష్ట్రాలతో పాటు, నార్త్ లో కూడా పలు రాష్ట్రాలలో ఎన్నికల ఓటింగ్ జరుగుతుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సారి లాస్ట్ ఇయర్ కన్నా ఎక్కువ హడావిడే జరిగినట్లు తెలుగిస్తుంది. అలాగే సినీ ప్రముఖులు కూడా కొందరు ఎన్నికల బరిలో నిల్చోగా, పవన్ కళ్యాణ్ జనసేన తరపున, బాలకృష్ణ టిడిపి తరపున అలాగే మరికొందరు నటీనటులు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇక ఈసారి పవన్ కళ్యాణ్ కోసం టాప్ హీరోలలో రామ్ చరణ్ మొదలుకొని మీడియం రేంజ్ చిన్న హీరోల దాకా అందరూ మద్దతు పలికారు. ఇదిలా ఉండగా హైదరాబాద్ లో ఎన్నికల నేపథ్యంలో పలువురు (Tollywood) సినీ సెలెబ్రిటీలు రేపు ఓటు హక్కు వినియోగించుకోనునున్నారు. అయితే వారిలో ఎవరెవరు ఏయే ఏరియాల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారో ఒక్కసారి గమనిస్తే..

ఓటు హక్కు వినియోగించుకోనున్న టాలీవుడ్ ప్రముఖులు ఏ ఏరియా లో ఎవరెరంటే…

* జూబ్లీహిల్స్‌ క్లబ్‌ లో మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్, ఉపాసన. అలాగే నితిన్‌ కూడా ఇక్కడికే రానున్నారు.

* జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌ లో మహేశ్‌బాబు, నమ్రత శిరోద్కర్, మంచు మోహన్‌బాబు, మంచు విష్ణు, మంచు లక్ష్మి, మంచు మనోజ్, అలాగే విజయ దేవరకొండ, ఆనంద్‌ దేవరకొండ, శ్రీకాంత్‌ ఫ్యామిలీ.

- Advertisement -

* హైదరాబాద్ ఓబుల్‌రెడ్డి స్కూల్‌ లో జూనియర్‌ ఎన్టీఆర్‌, లక్ష్మి ప్రణతి.

* జూబ్లీహిల్స్ బీఎస్‌ఎన్‌ఎల్‌ సెంటర్‌ లో అల్లు అర్జున్, స్నేహారెడ్డి, అల్లు
అరవింద్, అల్లు శిరీష్‌.

* ఎఫ్‌ఎన్‌సీసీలో రాఘవేంద్రరావు, జీవిత,రాజశేఖర్‌, విశ్వక్‌సేన్‌, దగ్గుబాటి రానా, సురేశ్‌ బాబు.

* జూబ్లీ హిల్స్ న్యూ ఎంపీ, ఎమ్మెల్యే కాలనీలో రవితేజ.

* వర్కింగ్‌ ఉమెన్స్‌ హాస్టల్‌ లో నాగార్జున, అమల, నాగచైతన్య, అఖిల్‌.

* మణికొండ హైస్కూల్ లో వెంకటేశ్, బ్రహ్మానందం.

* షేక్ పేట్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో రాజమౌళి, రమా రాజమౌళి.

* బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో రామ్ పోతినేని.

* గచ్చిబౌలి జిల్లా పరిషత్ పాఠశాలలో నాని.

* దర్గా గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ లో సుధీర్ బాబు.

* జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.45 ఆర్థిక సహకార సంస్థలో అల్లరి నరేశ్‌.

* యూసుఫ్‌గూడ చెక్‌పోస్టు ప్రభుత్వ పాఠశాలలో తనికెళ్ల భరణి.

Tollywood celebrities will exercise their right to vote in the elections

వీరితో పాటు పలువురు నటీనటులు, దర్శక నిర్మాతలు టెక్నిషియన్స్ వారి వారి నియోజకవర్గాల్లో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక ఆంధ్ర ప్రదేశ్ లో ఈసారి ఎక్కువ వోటింగ్ జరిగే అవకాశం కనిపిస్తూ ఉండగా, హైదరాబాద్ నుండి చాలా వరకు జనాలు మూకుమ్మడిగా ఎలెక్షన్ కోసమే బయలు దేరగా, భాగ్యనగరం సగం ఖాళీ అయిందని అంటున్నారు నెటిజన్లు. ఇదిలా ఉండగా టాలీవుడ్ నుండి పవన్ కళ్యాణ్, బాలకృష్ణ తో పాటు, రోజా, ఇక ఇతర ఇండస్ట్రీ లలో కంగనా రనౌత్, హేమ మాలిని, గోవిందా, రవి కిషన్, అరుణ్ గోవిల్, సురేష్ గోపి లాంటి నటులు కూడా ఎన్నికల బరిలో నిల్చున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు