Salaar : అక్కడ వరల్డ్ ప్రీమియర్స్ డేట్ ఫిక్స్..! సైరా భారీ రికార్డ్ బ్రేక్ అవుతుందా?

Salaar : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన పాన్ ఇండియా చిత్రం “సలార్” లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో విడుదలై సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా, హోంబేలె ఫిలిమ్స్ వారు నిర్మించడం జరిగింది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాపై రిలీజ్ సమయంలో ఎంత భారీ అంచనాలుండేవో తెలిసిందే. పృత్వి రాజ్ సుకుమారన్ ప్రత్యేక పాత్రలో నటించిన ఈ చిత్రం ప్రభాస్ కెరీర్ లోనే భారీ హిట్ కాగా,
కెరీర్ లో రెండో హైయెస్ట్ గ్రాసర్ గా ఇది వచ్చింది. ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్ గా దాదాపు 700 కోట్ల వరకు వసూలు చేయడం జరిగింది. ఇక ఈ సినిమా రెండో పార్ట్ గా త్వరలోనే సలార్ పార్ట్ 2 గా “శౌర్యంగ పర్వం” తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా సలార్ సినిమా రీసెంట్ గా మన తెలుగులో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా రాగా యావరేజ్ టీఆర్పీ రేటింగ్ వచ్చింది. 5 నుండి 6 మధ్యలోనే రేటింగ్ తెచ్చుకుని నిరాశ పరిచింది. అయితే ఇప్పుడు తమిళ్ లో కూడా టెలివిజన్ ప్రీమియర్ కి రెడీ అవుతుంది.

తమిళ్ లో “సైరా” భారీ రికార్డ్ ని బ్రేక్ చేస్తుందా?

ఇక సలార్ (Salaar) సీస్ ఫైర్ తెలుగులో కొన్ని రోజుల కింద మాటీవీ లో టెలికాస్ట్ కాగా, తెలుగులో యావరేజ్ రేటింగ్ తెచ్చుకుంది. అయితే ఇప్పుడు తమిళ్ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా రావడానికి సలార్ సిద్ధం అవుతుంది. తమిళ్ లో విజయ టివి ఛానెల్లో ఈ నెల మే 19 మధ్యాహ్నం 3 గంటలకి రాబోతున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. అయితే తమిళ్ లో మన సినిమా థియేటర్స్ లో ఎక్కువగా చూడకపోయినా డబ్బింగ్ వెర్షన్ లు టీవీ స్క్రీన్స్ పై బాగానే చూస్తారు. అలా మన తెలుగు నుంచి మెగాస్టార్ చిరంజీవి నటించిన “సైరా నరసింహా రెడ్డి” సినిమాకు అల్ టైం హైయెస్ట్ రేటింగ్ సాధించింది. దీనికి 15. 21 కి పైగా రేటింగ్ రాగా, ఇప్పుడు సలార్ దీనిని బ్రేక్ చేసి నయా రికార్డు సెట్ చేసే ఛాన్స్ ఉందా అని నెటిజన్లు ఎదురుచుస్తున్నారు. మరి తెలుగులో యావరేజ్ రెస్పాన్స్ అందుకున్న సలార్ తమిళ్ లో ఏ మేరకు రెస్పాన్స్ తెచుకుంటుందో, సైరా రికార్డ్ బ్రేక్ అవుతుందో లేదో చూడాలి.

Will Saalar break the record of 'Syeraa' in Tamil television premieres?

- Advertisement -

శౌర్యంగ పర్వానికి రెడీ..

ఇక సలార్ పార్ట్ వన్ లో ప్రభాస్ ఎవరో రివీల్ కాగా, రెండో పార్ట్ శౌర్యంగ పర్వం త్వరలోనే ప్రారంభం కానుందని తెలుస్తుంది. సలార్ పూర్తవగానే, ప్రభాస్ కల్కి 2898AD, రాజా సాబ్ సినిమాల షూటింగ్ లో బిజీ అయ్యాడు. ఇక ఇందులో కల్కి రిలీజ్ అయిన వెంటనే ప్రశాంత్ నీల్ తో శౌర్యంగ పర్వం (సలార్ పార్ట్ 2) మొదలు పెట్టేస్తాడు ప్రభాస్. ఇక ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్31 ఈ లోపు చేద్దామనుకున్నా, ఎన్టీఆర్ దేవర, వార్ 2 లతో బిజీగా ఉన్నాడు. పైగా సలార్ లో చైల్డ్ ఆర్టిస్ట్ లుగా చేసిన పిల్లలు పెద్దవారు అవుతుండడంతో త్వరలోనే సలార్ 2 మొదలుపెట్టి ముందు వారిపై సీన్లు షూట్ చేస్తారని సమాచారం.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు