Manisha Koirala : మాతృత్వాన్ని వదులుకోవడానికి కారణం చెప్పిన బాలీవుడ్ సీనియర్ హీరోయిన్..!

Manisha Koirala : బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ మనిషా కొయిరాలా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో నాగార్జున క్రిమినల్ సినిమాతో సుపరిచితమే. అయితే మనీషా పాన్ ఇండియా వైడ్ గా పాపులర్ అయింది మాత్రం మ‌ణిర‌త్నం తెర‌కెక్కించిన‌ `బొంబాయి` సినిమాతో. కోలీవుడ్ స్టార్ అర‌వింద స్వామితో రొమాన్స్ లో అద‌ర‌గొట్టింది. అలాగే యాక్ష‌న్ కింగ్ అర్జున్ తో `ఒకే ఒక్క‌డు`లో ప‌ల్లెటూరి పిల్ల‌గా నెల్లూరి నెరజాణగా న‌టించి మ‌న‌సులు దోచింది. ఒకప్పుడు బాలీవుడ్ ని ఏలిన ఈ స్టార్ హీరోయిన్ తన అనారోగ్య కారణాల వల్ల సినిమాలకి దూరమైన సంగతి తెలిసిందే. ఇక ఆ మధ్య సంజు సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చిన ఈమె రీసెంట్ గా సంజ‌య్ లీలా భ‌న్సాలీ తెర‌కెక్కించిన `హీరామండి`లో అద్భుత‌మైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది మ‌నీషా. హీరామండిలో మల్లికాజాన్ పాత్రలో న‌టించి హృదయాలను గెలుచుకుంది. అయితే ప్రపంచంలో ఏ ఆడదానికైనా, ఏ వృత్తిలో ఉన్న మహిళకైనా తల్లి కావాలని కోరిక ఉంటుంది. ఆ క్షణం కోసమే ఎన్నో పూజలు చేసిన ఆడవాల్లున్నారు. కానీ మనిషా కొయిరాలా కి మాత్రం ఆ అదృష్టం దక్కలేదు. వివరాల్లోకి వెళితే తాజాగ ఓ ఇంట‌ర్వ్యూలో మ‌నీషా కొన్ని వ్య‌క్తిగ‌త విష‌యాలను ప్ర‌స్థావించింది.

క్యాన్సర్ నా జీవితాన్ని కలిచివేసింది – మనీషా

ఇక ఓ ఇంటర్వ్యూ లో మనీషా(Manisha Koirala) తన వ్యక్తిగత జీవితాన్ని, తన కష్టాల గురించి చెప్పుకొచ్చింది. 2012లో క్యాన్సర్‌తో బాధపడుతున్నప్పుడు తాను చాలా కష్టత‌ర‌మైన‌ సమయాన్ని ఎదుర్కొన్నాన‌ని కూడా గుర్తు చేసుకుంది. ఆ క‌ష్టంలో ఉన్న‌ప్పుడు తన కుటుంబ స‌భ్యులు మాత్ర‌మే త‌న‌ పక్కన ఉన్నార‌ని గుర్తుచేసుకుంది. త‌న త‌ల్లి, సోద‌రుడు, సోద‌రుని భార్య మాత్ర‌మే త‌న‌కు అండ‌గా ఉన్నార‌ని తెలిపింది. ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కు చాలా మంది స్నేహితులు ఉన్నా కానీ ఎవ‌రూ త‌న‌ను ప‌ల‌క‌రించ‌లేద‌ని, త‌న‌తో ఆ కష్ట కాలంలో ఎవ‌రూ లేర‌ని మ‌నీషా గుర్తు చేసుకుంది. స్నేహితులు నా క‌ష్టంలో నాతో ఉంటారని అనుకున్నాను. కానీ ఎవ‌రూ లేరని గుర్తు చేసుకుంది మ‌నీషా. తనకు కూడా భారీ కోయిరాలా ఖాన్‌దాన్ (పెద్ద కుటుంబం) ఉందని, కానీ క‌ష్టంలో వాళ్ల‌లో ఎవ‌రూ తనతో లేరని చెప్పుకొచ్చింది.

Manisha Koirala explains why she is not a mother

- Advertisement -

మాతృత్వం వ‌దులుకోవ‌డానికి కార‌ణం?

ఈ క్రమంలో తాను తల్లి కాకపోవడానికి మాతృత్వాన్ని వదులుకోవడానికి కారణం పై షాకింగ్ న్యూస్ చెప్పింది. త‌న‌కు అండాశయ క్యాన్సర్ రావడం తో తల్లిని కావ‌డం చాలా కష్టం. కానీ తాను దానికి చింతించ‌లేదని, శాంతంగానే ఉన్నానని అంది. గ‌తంలో పోయింది వ‌దిలేసి, నాకు ఉన్నదానితో సంతృప్తిగా నా వంతు కృషి చేయనివ్వండి. పిల్ల‌ల‌ను దత్తత తీసుకోవడం గురించి చాలా ఆలోచించాను. నేను చాలా త్వరగా ఒత్తిడికి గురవుతానని గ్రహించాను. నేను చాలా త్వరగా ఆందోళన చెందుతాను. కాబట్టి చాలా చర్చల తర్వాత నేను శాంతించాను. నేను గాడ్ మదర్‌గా ఉండాలనుకుంటున్నాను. కాబట్టి నేను కలిగి ఉన్నదానితోనే నేను ఏదైనా చేయాలి. నా దగ్గర ఉన్నది నేను ప్రేమించే వృద్ధాప్య తల్లిదండ్రులు. నేను వారిని ఆదరిస్తాను. నిజానికి నేను ఇప్పుడు తరచుగా ఖాట్మండు (నేపాల్, స్వస్థలం)కి వెళుతున్నాను. వారితో విలువైన‌ సమయం గడుపుతాను. నేను ఇలా ఉండ‌టాన్ని ప్రేమిస్తున్నాను.. అని మ‌నీషా కొయిరాలా తెలిపారు. ఇక హీరమండి లో మ‌నీషా కొయిలారా పాత్ర‌కు మంచి స్పంద‌న దక్కుతుంది. త్వరలో మరిన్ని సినిమాలతో బిజీ అవుతుంది.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు