Renu Desai : ఆద్య కోసమే ఇలా సీక్రెట్ మెయింటైన్ చేస్తున్న రేణు దేశాయ్..! ఇలా ఎన్ని రోజులు?

Renu Desai : టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా రేణు దేశాయ్ తెలుగు వారికీ సుపరిచితమే.రెండు దశాబ్దాల కింద హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి రెండు సినిమాలకే ఆపేసారు. పవన్ కళ్యాణ్ ని పెళ్లి చేసుకుని కొన్నేళ్లు కలిసుండగా, ఆ తర్వాత వ్యక్తిగత కారణాలతో విడిపోయారు. అయితే వీరు విడిపోయినా పిల్లల కోసం అప్పుడప్పుడూ కలుస్తూనే ఉంటారు. అకిరా నందన్, అధ్య భవిష్యత్తు కోసం, వారి చదువుల కోసం పవన్ రేణు అప్పుడప్పుడూ కలవడం చూస్తూనే ఉంటాం. అలాగే రేణు దేశాయ్ రాకపోయినా పిల్లలను మాత్రం మెగా ఫ్యామిలీకి దగ్గరగానే ఉంచుతుంది. ఏదో ఒక పండగకి అకిరా నందన్, ఆధ్య మెగా ఫ్యామిలీతో ఉండడం చూస్తూనే ఉంటాం. ఆ మధ్య సంక్రాంతికి కూడా మెగా ఫ్యామిలీతో ఉన్న ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో సెలెబ్రిటీలు చేసే హంగామా, అలాగే సెలెబ్రిటీల మీమర్స్, ట్రోలర్స్ చేసే నెగెటివ్ కామెంట్లు ఈ విషయాలు అందరికీ తెలిసిందే. మామూలుగా సినిమా హీరో, హీరోయిన్ల మీద ఎంత పాజిటివ్ కామెంట్లు కనిపిస్తాయో అంతే స్థాయిలో నెగెటివ్ కామెంట్లు కూడా వస్తుంటాయి. అయితే సెలెబ్రిటీల ఫ్యామిలీ మీద కూడా అప్పుడప్పుడు ట్రోల్స్, నెగెటివ్ కామెంట్లు వస్తుంటాయి. అందుకే సెలెబ్రిటీల పిల్లల సోషల్ మీడియా ఖాతాలు, యాక్టివిటీస్ కాస్త గుట్టు చప్పుడు కాకుండా చాలా మంది మెయింటైన్ చేస్తుంటారు.

ఆద్యా కోసం సీక్రెట్..!

అయితే కొంత మంది సెలెబ్రిటీలు కొన్ని సపరేట్ ఖాతాలను కూడా మెయింటైన్ చేస్తారు. అఫీషియల్ ఖాతాలలా కాకుండా నార్మల్ అకౌంట్లలో పెట్టుకుని సోషల్ మీడియాలో జరిగేదంతా చూస్తుంటారు. ఇక రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్‌గా ఉంటారు. తన పిల్లలకు సంబంధించిన విషయాలను రెగ్యులర్ గా ఇన్ స్టాలో షేర్ చేస్తుంటారు. ఇక విషయానికి వస్తే.. మదర్స్ డే సందర్భంగా రేణూ దేశాయ్ ఓ పోస్ట్ వేశారు. అందులో ఫస్ట్ టైం ఆద్య కి సంబంధించిన ఇన్ స్టాగ్రాం ఖాతా కనిపించింది. అయితే ఆద్యకు అసలు ఇన్ స్టా ఖాతా ఉందన్న సంగతి ఎవ్వరికీ తెలియదు. ఈ విషయాన్ని ఇన్ని రోజులు సీక్రెట్‌గానే ఉంచారు. ఇప్పుడు కూడా రేణు ఆధ్య అకౌంట్ కనబడకుండా మార్క్ తో రఫ్ చేసి పోస్ట్ చేసారు. అయితే దానికి కారణం ఉంది. ఇంతకు ముందు కూడా పలువురు యాంటీ ఫ్యాన్స్ రేణు దేశాయి అకౌంట్ లో అప్పుడప్పుడూ నెగిటివ్ గా స్పందిస్తారు. ఆ ఇబ్బంది ఆధ్య కు కలగకూడదని ఇలా చేసారని తెలుస్తుంది. లేదంటే మళ్లీ ఫ్యాన్స్ గొడవలు, నెగటివ్ కామెంట్లు వచ్చే అవకాశం ఉందని ఇలా సీక్రెట్‌గా ఉంచినట్టుగా అనిపిస్తోంది.

Renu Desai Instagram post on her daughter Adhya has gone viral

- Advertisement -

ఇలా సీక్రెట్ గా కూల్ గా ఉండడమే బెటర్..

అయితే ఆద్యకు ఇంస్టా అకౌంట్ ఉందని ఎవ్వరికీ తెలియకపోతే.. తన పాటికి తానే ఏదో, తన ఫ్రెండ్స్‌తో హాయిగా ఉంటుంది. ఆద్యకు అకౌంట్ ఉందని తెలిస్తే ఫ్యాన్స్, యాంటీ ఫ్యాన్స్ అంతా కూడా ఫాలో అవుతూ రచ్చ రచ్చ చేస్తుంటారు. అందుకే ఈ గొడవలన్నీ ఎందుకు అన్నట్టుగా ఇప్పుడు కూడా రేణూ దేశాయ్(Renu Desai) ఆ అకౌంట్ వివరాలను బయటకు రానివ్వలేదు. ఇక తన కూతురు మదర్స్ డే సందర్భంగా వేసిన పోస్ట్ చూసి తల్లిగా రేణూ దేశాయ్ మురిసిపోతూ ఈ పోస్ట్ చేశారు. ఇక రేణు దేశాయ్ విషయానికి వస్తే.. ఈ మధ్యనే టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో కీలక పాత్రలో నటించి రీ ఎంట్రీ ఇచ్చారన్న సంగతి తెలిసిందే. మంచి పాత్ర వస్తే చేస్తానని రేణు దేశాయ్ చాలా సందర్భాల్లో చెప్పారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు