Sleep Divorce : నగరాల్లో పెరుగుతున్న కొత్త ట్రెండ్… స్లీప్ డివోర్స్ అంటే ఏంటో తెలుసా?

Sleep Divorce : ఇంతకుముందు చాలామంది స్లీప్ డివోర్స్ అనే పేరును వినకపోయి ఉండొచ్చు. కానీ ప్రస్తుతం చాలా దేశాల్లో ఈ ట్రెండ్ అత్యంత వేగంగా వ్యాపిస్తుంది. మరి ఇంతకీ ఈ స్లీప్ డివోర్స్ అంటే ఏంటి? ఈ ట్రెండ్ స్టార్ట్ అవ్వడానికి కారణం ఏంటి? ఎవరెవరు స్లీప్ డివోర్స్ తీసుకోవచ్చు? అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

స్లీప్ డివోర్స్ అంటే ఏంటి?

సాధారణంగా భార్యాభర్తలు ఇద్దరు విడిపోవడానికి విడాకులు తీసుకోవడాన్నే డివోర్స్ అంటాము. ఈ డివోర్స్ ప్రాసెస్ కోసం కోర్టు మెట్లు ఎక్కగా తప్పదు. కానీ స్లీప్ డివోర్స్ దీనికి విరుద్ధంగా ఉంటుంది. ఇంట్లోనే భార్య భర్తలు లేదా సహజీవనం చేస్తున్న జంటలు ఈ స్లీప్ డివోర్స్ తీసుకోవచ్చు. భార్య భర్తలు ఇద్దరు ఒకే ఇంట్లో నివసిస్తున్నప్పటికీ కలిసి నిద్రించకుండా ఉండే పద్ధతినే స్లీప్ డివోర్స్ అంటారు.

స్లీప్ డివోర్స్ ఎందుకు?

కొన్నిసార్లు భార్య భర్తలు ఇద్దరికీ ఒకే ఇంట్లో నివసించడం కష్టమవుతుంది. మనస్పర్ధలు, విభేదాల కారణంగా విడిపోవాలని డిసైడ్ అవుతారు. అలా విడాకుల బాట పడతారు. కానీ అందరూ అలా చేయలేరు. ఎందుకంటే డివోర్స్ తో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో అంతకంటే ఎక్కువ కష్టాలు కూడా ఉంటాయి. వాటన్నింటినీ భరించడం కంటే గొడవ పడుతూ అయినా సరే వాటన్నింటినీ భరించడానికే రెడీ అవుతారు కొంతమంది భార్య భర్తలు. అయితే గత కొన్ని ఏళ్ల నుంచి లైఫ్ స్టైల్ అనేది మారుతూ వస్తోంది.

- Advertisement -

భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలకు వెళ్లే కుటుంబాలు నగరాల్లో ఎన్నో ఉన్నాయి. అయితే ఇద్దరూ పని చేయడం అనేది వాళ్ళ పర్సనల్ లైఫ్ పై తీవ్రమైన ఎఫెక్ట్ చూపిస్తోంది. పని వేళలో వచ్చే తేడాల వల్ల శృంగార జీవితానికి దూరం అవుతున్నారు. అంతేకాకుండా ఈ బిజీ లైఫ్ లో ఇరువురు ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నారు. ముఖ్యంగా కొంతమంది అర్ధరాత్రి వరకు లైట్లు వేసి పుస్తకాలు చదువుతూ ఉండడం లేదా గురక పెట్టడం వంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వీటన్నింటికీ పరిష్కారమే ఈ స్లీప్ డివోర్స్.

సాధారణంగానే ఇలాంటి సమస్యలను పరిష్కరించుకోవడానికి భార్యాభర్తలు పరస్పర అవగాహనతో వేర్వేరు గదులలో పడుకోవాలని డిసైడ్ అవుతారు. అంటే భార్యాభర్తలు అయినప్పటికీ కలిసి పడుకోరన్నమాట. ఇక ఇప్పుడు దీనికే స్లీప్ డివోర్స్ అని పేరు పెట్టి కొత్త ట్రెండ్ గా మారుస్తున్నారు.

స్లీప్ డివోర్స్ వల్ల ఉపయోగాలు ఏంటి?

ఈ స్లీప్ డివోర్స్ ను భార్య భర్తలు ఇద్దరూ అవగాహనతో తీసుకుంటారు కాబట్టి ఇద్దరికీ ప్రశాంతత దొరుకుతుంది. ముఖ్యంగా ఒకరి వల్ల ఒకరు ఇబ్బంది పడకుండా ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు ప్రశాంతంగా పడుకోగలుగుతారు. ఒకరి వల్ల ఒకరికి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు.

స్లీప్ డివోర్స్ వల్ల సాన్నిహిత్యం దెబ్బ తింటుందా?

స్లీప్ డివోర్క్ ను లైఫ్ లాంగ్ తీసుకోవాలని డిసైడ్ అవ్వడం తప్పు. కొన్ని రోజుల వరకు ఒక ఆప్షన్ గా పెట్టుకుంటే మాత్రం దానివల్ల భార్యాభర్తల మధ్య రిలేషన్ మరింత బలపడుతుంది. మరి శృంగార జీవితం సంగతేంటి అంటే… వీకెండ్స్ అలాంటి ప్లాన్స్ పెట్టుకోవచ్చు. వారాంతంలో భార్యాభర్తలిద్దరూ కలిసి నిద్రపోవడం, సన్నిహితంగా మెలగడం వంటివి చేస్తే ఇద్దరి మధ్య ఎప్పటికీ దూరం పెరగదు. వారం మొత్తంలో ఇద్దరు ప్రశాంతంగా నిద్రపోగలుగుతారు కాబట్టి వారాంతంలో సంతోషంగా గడపగలుగుతారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు