Puri jagannath: నెక్స్ట్ టార్గెట్ అతడే.. వర్కౌట్ అయ్యేనా..?

Puri jagannath.. ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఎంతోమంది సీనియర్ స్టార్ హీరోలకు మంచి జీవితాన్ని ప్రసాదించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కి బద్రి, మహేష్ బాబుకి పోకిరి వంటి చిత్రాలతో వారి కెరియర్ నే మలుపుతిప్పిన పూరీ జగన్నాథ్ మరెంతో మంది హీరోయిన్లను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. మొన్నటి వరకు డిజాస్టర్ చూడని డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండ తో కలిసి లైగర్ అనే పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కించారు. కానీ ఈ సినిమా పూర్తిస్థాయిలో డిజాస్టర్ గా నిలిచింది. అంతేకాదు ఈ సినిమాకి నిర్మాతగా పనిచేసిన ప్రముఖ హీరోయిన్ ఛార్మి కూడా ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంది.. డిస్ట్రిబ్యూటర్లు కూడా పూర్తిస్థాయిలో నష్టపోయారు.. ఇక దీంతో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కి కుర్ర హీరోలు కూడా అవకాశం ఇవ్వాలంటే భయపడే అంత స్థాయికి వచ్చారు. అయితే ఇప్పుడు డైరెక్టర్ పూరీ జగన్నాథ్ మళ్లీ తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి డబుల్ ఇస్మార్ట్ అనే పేరుతో ఒక సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇందులో రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే మరో హీరోకి దర్శకత్వం వహించబోతున్నారు పూరీ జగన్నాథ్.

Puri jagannath: He is the Puri jagannath next Target.. is it workout..!
Puri jagannath: He is the Puri jagannath next Target.. is it workout..!

పూరీ జగన్నాథ్ నెక్స్ట్ టార్గెట్ అతడే..
విజయ్ దేవరకొండ లైగర్ సినిమా ఎఫెక్ట్ పూరీ జగన్నాథ్ కెరీర్ పై బాగా పడిందనే చెప్పాలి.. ఈ నేపథ్యంలోనే ఈయన సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు.. డబుల్ ఇస్మార్ట్ సినిమాతో సూపర్ డూపర్ సక్సెస్ సాధిస్తే పూరీ కెరియర్ మళ్ళీ గాడిలో పడుతుంది.. ఇదిలా ఉండగా ఆయన తర్వాత మరొక సినిమా చేయబోతున్నట్లు సమాచారం.. ఇప్పటికే వరుణ్ ధావన్ వరుస సినిమాలు చేస్తూ బాలీవుడ్లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు.. ఇక ఈ సినిమాతో వరుణ్ ధావన్ తనను తాను ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నారు. అందుకే పూరీ జగన్నాథ్ తో సినిమా చేస్తే తనకు యువతలో కూడా మంచి క్రేజ్ వస్తుందని..తెలుగులో కూడా గుర్తింపు లభిస్తుందనే ఉద్దేశంతో పూరి జగన్నాథ్ తో సినిమా చేయడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది.. ప్రస్తుతం వరుణ్ ధావన్ కోసం ఒక ప్రత్యేకమైన కథను పూరి జగన్నాథ్ తయారు చేసి వినిపించగా.. వరుణ్ ధావన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. మరి వీళ్ళ కాంబినేషన్లో సినిమా ఉంటుందా లేదా అనే పూర్తి వివరాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే
.
వరుణ్ ధావన్..
బాలీవుడ్ లో యంగ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న వరుణ్ ధావన్ ఇటీవలే సమంతతో కలిసి సిటాడెల్ వెబ్ సిరీస్ లో నటించారు.. ఈ వెబ్ సిరీస్ త్వరలోనే స్ట్రీమింగ్ కి సిద్ధం కానుంది . ఇంగ్లీష్ వర్షన్ అయిన ఈ సిటాడెల్ వెబ్ సిరీస్ కి హనీ బన్నీ అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు సమాచారం.. మరి ఈ వెబ్ సిరీస్ తో విజయాన్ని అందుకున్న తర్వాత ఆయన పూరీ జగన్నాథ్ తో సినిమా చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ కాంబినేషన్ ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు