Rowdy Boys Re -release: అప్పుడే దిక్కులేదు .. ఇప్పుడెవరు చూస్తారో..?

Rowdy Boys Re -release.. ప్రస్తుత కాలంలో రీ రిలీజ్ సినిమాల హవా ఎక్కువగా కొనసాగుతోంది.. ముఖ్యంగా దీనికి కారణం మహేష్ బాబు పోకిరి సినిమా అని చెప్పాలి.. గత రెండు సంవత్సరాల క్రితం మహేష్ బాబు సినిమాలు ఏవి విడుదల కాకపోవడంతో మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు పోకిరి సినిమాను మళ్ళీ థియేటర్లలో వేసుకొని భారీ కలెక్షన్లను సాధించారు.. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు కూడా సూపర్ స్టార్ హీరోలు స్టార్ హీరోలు అలాగే యంగ్ హీరోలు తమ కెరీర్లు మంచి విజయం సాధించిన సినిమాలను మళ్లీమళ్లీ రిలీజ్ చేస్తూ క్యాష్ చేసుకుంటున్నారు.. అయితే ఇప్పుడు కూడా ఒక సినిమా రీ రిలీజ్ కి సిద్ధమైంది.. కానీ ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే సినిమా నేరుగా థియేటర్లలో విడుదలైనప్పుడే ఎవరు చూడలేదు..రీ రిలీజ్ లో ఎవరు చూస్తారు అనే ప్రశ్న అభిమానులలో కూడా మొదలైందని చెప్పవచ్చు..

Rowdy Boys Re -release:I didn't see it just then.. who will see it now..?
Rowdy Boys Re -release:I didn’t see it just then.. who will see it now..?

రీ రిలీజ్ లోనైనా చూస్తారా.

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడా నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న దిల్ రాజు ఇప్పటివరకు ఎంతోమంది హీరోలకు గుర్తుండిపోయే విజయాలను అందించారు..ఈయన నిర్మాణంలో వచ్చిన సినిమాలు చాలామంది హీరోలకి జీవితాన్ని కూడా ప్రసాదించాయి.. ఈ క్రమంలోనే తన ఇంటి నుంచి కూడా వారసుడిని తీసుకొచ్చాడు. తన తమ్ముడు కొడుకు ఆషిస్ రెడ్డి ని హీరోగా లాంచ్ చేస్తూ.. రౌడీ బాయ్స్ అనే చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది.. ఇక ఇందులో ఈమె లిప్ లాక్ సన్నివేశాలు కారణంగా వివాదాల్లో కూడా చిక్కుకున్న విషయం తెలిసిందే. ఇకపోతే జనవరి 14 2022లో విడుదలైన ఈ సినిమా భారీ డిజాస్టర్ ను చవిచూసింది. ఇకపోతే ఈ సినిమాను పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లలో కూడా ప్రమోట్ చేశారు.. అయితే కరోనా కారణంగా సినిమా వాయిదా పడింది .. ఆ తర్వాత చిన్న సినిమాని ఆయన పెద్ద ప్రమోషన్ చేస్తూ ఎలాగైనా సరే సినిమాను విజయవంతం చేసే ప్రయత్నం చేశారు దిల్ రాజు.. కానీ ఈ సినిమా సక్సెస్ ను అందుకోలేదు.. ముఖ్యంగా ఈ రౌడీ బాయ్స్ సినిమాకి చాలామంది స్టార్ సెలబ్రిటీలు ప్రమోట్ కూడా చేశారు.. అవేవీ కూడా సినిమాను గెలిపించలేకపోయాయి.. థియేటర్లలో కూడా ఎవరు చూడని ఈ సినిమాను ఇప్పుడు ఏప్రిల్ 25వ తేదీన రీ – రిలీస్ చేయబోతున్నారు.. ఇలాంటి సమయంలో అప్పుడే ఎవరు చూడలేదు ఇప్పుడు ఎవరు చూస్తారు అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు..

రౌడీ బాయ్స్ కోసం నిలబడ్డ దిల్ రాజు..

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడనిర్మాణ సంస్థగా, డిస్ట్రిబ్యూటర్ గా మంచి గుర్తింపు దక్కించుకున్న దిల్ రాజు తన వారసుడిని ఇండస్ట్రీలో నిలబెట్టుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు .. ఎంతో మంది సెలబ్రిటీలను కలిశారు.. అయినా ఏ ఒక్కటి కూడా ఈయనను హీరోగా స్వీకరించలేకపోయారు .కథపరంగా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేదు.. నిజానికి ఎంతోమంది యంగ్ హీరోలు ఇండస్ట్రీలో అడుగుపెట్టి సక్సెస్ అవుతుంటే ఈయనకు ఎంత సినీ బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా డిజాస్టర్ గా మిగలడం బాధాకరమైన చెప్పాలి.. మరి రీ రిలీజ్ లో ఏదైనా మ్యాజిక్ జరిగి రౌడీ హీరోస్ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందేమో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు