Mahesh Babu: రాజమౌళి పర్మిషన్ లేకుండానే లుక్ రివీల్ చేశారే..!

Mahesh Babu.. టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ మూవీ గా ఎదురుచూస్తున్న చిత్రం SSMB -29. మహేష్ – రాజమౌళి కాంబినేషన్లో మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు ఈ సినిమా కోసం చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు ఫాన్స్.. ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి చిన్న విషయం అయినా సరే వైరల్ గా మారుతూనే ఉంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయితే జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మహేష్ , రాజమౌళి ఇద్దరూ కూడా లొకేషన్స్ చుట్టేయడమే కాకుండా మహేష్ ఈ సినిమా కోసం తీవ్రమైన కసరత్తులు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది.

Mahesh Babu:The look was revealed without Rajamouli's permission..!
Mahesh Babu:The look was revealed without Rajamouli’s permission..!

హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్..

మొన్నటి వరకు వెకేషన్ లో ఉన్న మహేష్ బాబు ఇటీవలే హైదరాబాద్ కి వచ్చేశారు.. తాజాగా మహేష్ బాబు సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ను కలిసినట్టుగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారుతోంది. రాజమౌళి సినిమా అనౌన్స్మెంట్ చేసినప్పటి నుంచి మహేష్ బాబు ఎక్కడ కూడా పెద్దగా కనిపించడం లేదు. కనిపించినా కూడా తలకి ఎప్పుడు క్యాప్ పెట్టుకుని.. ఆ లుక్ లోనే కనిపిస్తూ ఉండడం గమనార్హం.

మహేష్ స్పందన..

ఇప్పుడు తాజాగా మహేష్ బాబు లుక్ రాజమౌళి పర్మిషన్ లేకుండానే SRH టీం కెప్టెన్ పాట్ కమ్మిన్స్ లీక్ చేశారు. ఇటీవలే ఏదో ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ టీం ని కలిసినట్లుగా తెలుస్తోంది.. ఆ సమయంలోనే మహేష్ బాబుతో కలిసి హైదరాబాద్ టీం కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ఒక ఫోటోని తీసుకున్నట్లుగా సమాచారం.. ఈ ఫోటోనే ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. ఈ ఫోటోకి క్యాప్షన్ గా టాలీవుడ్ ఫ్రెండ్స్ ని కలుసుకోవడం తనకు చాలా ఆనందంగా ఉంది అంటూ క్యాప్షన్ గా రాసుకొచ్చారు.

- Advertisement -

రాజమౌళి పర్మిషన్ లేకుండానే లుక్ రివీల్..

పాట్ కమ్మిన్స్ షేర్ చేసిన ఫోటోకి మహేష్ బాబు రియాక్ట్ అవుతూ నేను మీకు పెద్ద ఫ్యాన్.. నాకు కూడా ఇది దక్కిన గౌరవం అంటూ కూడా తెలియజేశారు. ఈ ఫోటోలు చూసిన అభిమానులు సైతం మహేష్ లుక్కుకి ఫిదా అవుతున్నారు. SSMB -29 సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ చిత్రంగా తెరకెక్కించబోతున్నట్లు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికి ఎన్నోసార్లు తెలియజేశారు. ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ ని కూడా తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అయితే హీరోయిన్ పైన చాలా కసరత్తులు జరుగుతున్నాయని వార్తలైతే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా హాలీవుడ్ హీరోయిన్ ని తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు అధికారికంగా ప్రకటించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.. ఏకంగా ఈ సినిమా కోసం నాలుగు సంవత్సరాలు సమయం కేటాయించినట్లు తెలుస్తోంది మహేష్ బాబు.. మరి ఈ సినిమా కోసం భారీ కసరత్తులు చేస్తున్న రాజమౌళి ఏకంగా పాన్ వరల్డ్ రేంజ్ లో విజయం సొంతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు .మరి ఇవన్నీ రాజమౌళికి ఏ విధంగా పనికొస్తాయో చూడాలి. ఏది ఏమైనా రాజమౌళి ప్లాన్ పక్క వర్క్ అవుట్ అవుతుందని కామెంట్స్ వినిపిస్తూ ఉండడం గమనారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు