Deadpool&Wolverine Trailer : మార్వెల్ మూవీస్ లో సాలిడ్ సీక్వెల్.. పక్కా తెలుగు నేటివిటితో కల్ట్ సీక్వెల్..

Deadpool&Wolverine Trailer : హాలీవుడ్ లో మార్వెల్ మూవీస్ కి ఎంత ప్రత్యేకమైన స్థానం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత పదేళ్లలో ఈ మర్వెల్ యూనివర్స్ లో వచ్చిన ప్రతి సినిమా కూడా ఓ రేంజ్ హిట్టయ్యాయి. అయితే అవెంజర్స్ ఎండ్ గేమ్ తర్వాత ఈ సూపర్ హీరోస్ పై ఇంట్రెస్ట్ కాస్త తగ్గింది. మొన్నామధ్య వచ్చిన బ్లాక్ పాంథర్ 2 ఒక్కటే బాగా ఆకట్టుకుంది. అయితే మార్వెల్ మూవీస్ లో అవెంజర్స్ కన్నా ముందు ఫస్ట్ బ్లాక్ బస్టర్ క్లాసిక్ హిట్స్ గా నిలిచినా డెడ్ పూల్ సూపర్ హీరో నుండి ఇప్పుడు సీక్వెల్ వచేస్తుందన్న విషయం తెలిసిందే. 2024లో వెండితెరపై సందడి చేయబోతున్న మార్వెల్ మూవీ ‘డెడ్‌పూల్ 3’. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU)నుంచి ఈ ఏడాది ఒకే ఒక్క సినిమా రానుండడంతో ప్రేక్షకులలో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇంతకు ముందు టీజర్ రిలీజ్ అయి మెప్పించగా, తాజాగా ట్రైలర్ కూడా రిలీజ్ అయి ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటుంది.

పక్కా యాక్షన్ తో, తెలుగు నేటివిటీ డైలాగ్స్ తో..

తాజాగా మార్వెల్ ‘డెడ్‌పూల్ & వొల్వరైన్’ ట్రైలర్‌ను విడుదల చేయగా, తెలుగు ట్రైలర్ అయితే సాలిడ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది. సూపర్ హీరో ఫ్రాంచైజీకి సరికొత్త జోడింపుతో వస్తున్న ఈ సినిమాలో ర్యాన్ రేనాల్డ్స్ వేడ్ విల్సన్/డెడ్‌పూల్‌ గా, హ్యూ జాక్‌మన్ లోగాన్/వొల్వరైన్‌ గా చేసాడు. ఇక ట్రైలర్‌లో సినిమా కథాంశంపై ఎక్కువ దృష్టి పెట్టకుండా సరదా సన్నివేశాల తో ఎక్కువగా ఉంది. వొల్వరైన్ చాలా సంవత్సరాల తర్వాత పెద్ద తెరపై కి రావడం ఫ్యాన్స్ కి మంచి ఫీలింగ్ వస్తుంది. ఇక ట్రైలర్ లో డెడ్ పూల్ వుల్వరైన్ కు సాయం అడుగుతాడు. అక్కడి నుండి కథ మొదలవుద్ది. ట్రైలర్ లో అక్కడక్కడా డాక్టర్ స్ట్రేంజ్ మాదిరిగానే వాళ్ళ ప్లానింగ్స్ ఉంటాయి. ట్రైలర్ లో ఇద్దరూ వాళ్ళ ప్రపంచాన్ని కోల్పోతారు. అలాంటి వాళ్ళు తమ కష్ట సమయాల్లో ఒకరికొకరు హెల్ప్ చేసుకుని ఎలా అనుకున్నది సాధించారో కథ. అయితే తెలుగు ట్రైలర్ మాత్రం ఫుల్ కిక్కిస్తుంది. తెలుగు నేటివిటితో డైలాగ్స్ మొత్తం నింపేయగా, అక్కడక్కడా బూతు డైలాగ్స్ కూడా పెట్టారు. యూత్ కోసమే ఈ డైలాగ్స్ పెట్టారని తెలుస్తుంది.

జులై 26న రాబోతున్నాడు..

ఇక ట్రైలర్ (Deadpool & Wolverine Trailer) అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులలో గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ర్యాన్ రేనాల్డ్స్, హ్యూ జాక్‌మన్ తమ మార్క్ నటనతో ఆకట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు ప్రపంచ వ్యాప్తంగా మొదలయ్యాయి. ఇక డెడ్‌పూల్ &వుల్వరైన్‌ మూవీని షాన్ లెవీ దర్శకత్వం వహించారు. ర్యాన్ రేనాల్డ్స్, హ్యూ జాక్‌మన్ ఈ చిత్రంలో నటించగా, వేడ్ విల్సన్‌గా ర్యాన్ రేనాల్డ్స్, వుల్వరైన్ పాత్రలో హ్యూ జాక్‌మన్ గా నటించారు. ఇక ఈ చిత్రం 2024 జూలై 26న థియేటర్లలో విడుదల కానుంది. మార్వెల్ మూవీస్ లో చాలా రోజుల తర్వాత సినిమా వస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలుండగా, మినిమం గ్యారెంటీ గా ప్రేక్షకులని అలరిస్తుందని చెప్పొచ్చు.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు