Hanuman Jayanthi Special : ఆంజనేయుడి కథతో వచ్చిన అత్యుత్తమ చిత్రాలు..

Hanuman Jayanthi Special : హిందూ పురాణాల ప్రకారం, శ్రీరాముని భక్తుడు హనుమంతుడు. అలాగే హిందువులు ఆరాధించే దేవుళ్లలో ఆంజనేయుడికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఏ దేవుడ్ని తలచుకున్నా, తలచుకోకపోయినా, ప్రతిరోజూ ఆంజనేయుడిని తలచే వారే ఎక్కువ. ఇప్పటికి శనివారం నాడు ఎంతో మంది ఉపవాసాలు ఉండడం, చూస్తూనే ఉంటాం. ఎలాంటి కష్టాల్లో ఉన్నా, భయంతో ఉన్నా హనుమాన్ ని ప్రార్థించిన వారికి, భయం తొలగిపోయి బలం, ధైర్యం పెరుగుతుందని చాలా మంది నమ్ముతారు. ఇక నేడు ఏప్రిల్ 23వ తేదీన మంగళవారం నాడు దేశవ్యాప్తంగా “హనుమాన్ జయంతి” వేడుకలను భక్తులు జరుపుకోనున్నారు. ఈ పర్వదినాన రోజున దేశవ్యాప్తంగా “హనుమాన్” విగ్రహాలతో భారీగా ఊరేగింపు కార్యక్రమాలను నిర్వహిస్తారు. పురాణాల ప్రకారం, ఛైత్ర మాసంలో శుద్ధ పౌర్ణమి రోజున హనుమంతుడు జన్మించాడని చెబుతారు. అయితే ఈసారి హనుమాన్ జయంతి మంగళవారం నాడు రావడంతో మరింత ప్రత్యేకత సంతరించుకుంది. ఇక ఈరోజుల్లో ఆంజనేయ స్వామి ని రకరకాలుగా ఆరాధిస్తుండగా, సినిమాలు చూసే ప్రేక్షకులు కూడా ఆంజనేయస్వామి చిత్రాల కోసం టెలివిజన్ లో ఎదురుచూస్తుంటారు. అలాంటి వారికోసం ఆంజనేయ స్వామి (Hanuman Jayanthi Special) కథతో, అలాగే ఆయన చరిత్ర ఆధారంగా తెరకెక్కిన బెస్ట్ మూవీస్ ని ప్రేక్షకులకి అందిస్తున్నాము.

ఆంజనేయ చరిత్ర :

గంగ దర్శకత్వంలో 1980 లో వచ్చిన ఆంజనేయ చరిత్ర సినిమా లో హనుమాన్ జీవితం గురించి ఉంటుంది. ఆయన పుట్టుక నుండి రామాయణం కథ నడిపించే దాకా ఈ చిత్రం ఉంటుంది. తెలుగు, తమిళ, మలయాళంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఆంజనేయుడిగా ఆర్. జనార్ధన రావు గా నటించగా, రవికుమార్, రోజారమని సీతారాములు గా నటించారు.

భీమాంజనేయ యుద్ధం :

1966 లో SD లాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం భారతంలో భీమాంజనేయుల యుద్ధంగా తెరకెక్కిన ఫిక్షనల్ డ్రామా. ఇందులో ఆంజనేయుడిగా కె. ఈశ్వరరావు నటించగా, భీముడిగా దండమూడి రాజగోపాల్ నటించారు.

- Advertisement -

రామాంజనేయ యుద్ధం :

బాపు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం 1975 లో రాగా ఎన్టీఆర్ రాముడిగా, ఆర్ జనార్ధన రావు హనుమాన్ గా నటించారు. భక్తికి దైవానికి జరిగిన సంఘర్షణల నేపథ్యంలో తెరకెక్కగా, రామబాణం కన్నా రామనామం గొప్పది అన్న నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది.

సంపూర్ణ రామాయణం :

ఈ చిత్రం రామాయణ గాథ తో వచ్చినప్పటికీ ఈ సినిమాలో ఆంజనేయ స్వామి పాత్ర ఎంతో కీలకంగా ఉంటుంది. సీతారాముల్ని కలిపే వరకు కథ నడిపించేది ఆంజనేయుడే కనుక ఈ చిత్రాన్ని కూడా ఎంతో మంది చూస్తారు. ఇక ఈ సినిమాలో ఆంజనేయ స్వామి పంచముఖుడిగా కనిపించే సీన్ సినిమాకే హైలెట్.

అయితే ఆంజనేయ స్వామి చరిత్ర నేపథ్యంలో చాలా తక్కువ చిత్రాలే వచ్చినా, ఆయన స్ఫూర్తి నేపథ్యంలో ఎన్నో చిత్రాలు వచ్చాయి. రామాయణ గాథ తో వచ్చిన అన్ని చిత్రాల్లోనూ హనుమాన్ పాత్ర ఉంటుంది కనుక, రామాయణ నేపథ్యంలో వచ్చిన చిత్రాల్ని కూడా ఎంతో చూస్తారు. ఇక కొన్ని వందల చిత్రాల్లో ఆంజనేయుడి పై పాటలు రావడం ఇప్పటికీ చూస్తూనే ఉంటాం. రీసెంట్ గా వచ్చిన హనుమాన్ ఫిక్షనల్ ఫాంటసీ చిత్రం దేశ వ్యాప్తంగా ఎంత ఘన విజయం సాధించిందో చూసాం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు