Rajinikanth Coolie Dialogue : రజినీ చెప్పిన డైలాగ్… ఈ డైలాగ్‌ను పూర్తిగా గమనించారా…?

Rajinikanth Coolie Dialogue .. సౌత్ ఇండియా సూపర్ స్టార్ గా పేరు దక్కించుకున్న రజినీకాంత్ ఈ వయసులో కూడా వరుస సినిమాలు చేస్తూ భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు.. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజు దర్శకత్వంలో ప్రస్తుతం ఒక సినిమా చేస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమా తలైవార్ 171 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమాని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ ని ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది.. పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ సినిమాకి కూలి అని ఫిక్స్ చేసి టీజర్ ని కూడా రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఈ టీజర్ లో గోల్డెన్ బిస్కెట్స్,వాచెస్ స్మగ్లింగ్ చేసే ముఠా ఆట కట్టించి పవర్ఫుల్ ఎంట్రీ ఫైట్ తో అదరగొట్టారు రజనీకాంత్.. ఈ టీజర్ మొత్తం ప్రస్తుతం అందరిని ఆకట్టుకుంటోంది. త్వరలో కూలీ సినిమా రెగ్యులర్ షూటింగు ప్రారంభం కానుంది . మరోవైపు ప్రస్తుతం రజనీకాంత్ డీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో వెట్టయాన్ అనే సినిమాలో కూడా నటిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్లో ప్రేక్షకుల ముందుకి రానుంది..

Rajinikanth Coolie Dialogue : Dialogue spoken by Rajinikanth... Did you watch this dialogue completely...?
Rajinikanth Coolie Dialogue : Dialogue spoken by Rajinikanth… Did you watch this dialogue completely…?

రజనీకాంత్ రంగా మూవీ డైలాగ్ వైరల్..

ఇదిలా ఉండగా ప్రస్తుతం రజనీకాంత్ కూలీ సినిమాని ప్రకటించగా.. గతంలో రజినీకాంత్ రంగా సినిమాలోని డైలాగు మరింత వైరల్ గా మారింది. లక్ష్మీకాంత్ అనే ఒక నెటిజన్.. రజినీకాంత్ రంగా సినిమాలోని డైలాగ్ ని ఎక్స్ ద్వారా షేర్ చేశారు.. అందులో “రజినీకాంత్ సిగిరెట్ తాగుతూ ఉంటే మరో నటుడు.. నీవు చేతిలో సిగరెట్టు పట్టుకొని తాగుతూ ఉంటే.. చూడడానికి మనసుకు కష్టంగా అనిపిస్తుంది అంటూ చెబుతాడు.. దానికి రజినీకాంత్ మాట్లాడుతూ.. నేను ఒక విషయం చెబుతాను గుర్తుంచుకో.. మన నాన్న, తాత వచ్చారు , పోయారు.. నువ్వు ఒక రోజు పోతావు.. నేను కూడా ఏదో ఒక రోజు పోతాను.. తప్పైనా ఒప్పైనా ఎప్పుడు ఒకేలాగే ఉండాలి.. బంగ్లా ఉన్నా.. డబ్బు ఉన్నా..తోడు ఉన్నా .. ఏది ఉన్నా ఏదో ఒక రోజు పోవాల్సిందే.. జీవితంలో సంతోషంగా ఉండాలి ..ఉన్న ప్రతిక్షణం ఆనందంగా గడపాలి” అంటూ రజనీకాంత్ చెప్పారు. ఇక రజనీకాంత్ చెప్పిన ఈ డైలాగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.ఇకపోతే రంగా సినిమాలోని ఈ డైలాగు ఇప్పుడు వైరల్ గా మారుతోంది.. రజనీకాంత్ చెప్పే డైలాగులకి అభిమానులు ఎప్పుడు ఫిదా అవుతూ ఉంటారు అనడంలో సందేహం లేదు.. అయితే ఇప్పుడు ఇలాంటి డైలాగ్స్ కి మరింత ఫిదా అవుతున్నారని చెప్పవచ్చు.

రజనీకాంత్ కెరియర్..

సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ వయసులో కూడా వరుస సినిమాలు ప్రకటిస్తూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే.. ఒకవైపు సినిమాలు మరొకవైపు పలు యాడ్స్ లో కూడా నటిస్తూ భారీగా ప్రేక్షక ఆదరణ సొంతం చేసుకుంటున్నారు. ఏదేమైనా రజినీకాంత్ సినిమాలే కాదు ఆ సినిమాలలో ఆయన చెప్పే డైలాగులు కూడా నిజ జీవితానికి అద్దం పట్టేలా ఉంటాయని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు