Jabardasth Adhi: ఆ టార్చర్ భరించలేకే దూరమయ్యా..?

Jabardasth Adhi.. ప్రముఖ కమెడియన్ హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమం ద్వారా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఆది అక్కడ పంచ్ డైలాగ్ లతో అందరిని అలరించారు. షో కి వచ్చిన అనతి కాలంలోనే టీమ్ లీడర్ గా ఎదిగి.. జడ్జ్ లకే పంచులు వేసి అంత స్థాయికి ఎదిగిపోయారు.. అంతేకాదు జబర్దస్త్ లో ఉన్న కమెడియన్స్ లో ఎక్కువ పారితోషకం తీసుకున్న కమెడియన్ గా కూడా పేరు సంపాదించారు.. ఒక జబర్దస్త్ షో మాత్రమే కాదు శ్రీదేవి డ్రామా కంపెనీ , ఢీ వంటి పలు ఈటీవీ షో లలో సందడి చేస్తూ అందరిని అలరిస్తూ ఉంటారు.. ఇదిలా ఉండగా జబర్దస్త్ లో ఆది కనిపించడం లేదనే చెప్పాలి . ఇక దీనికి గల కారణాన్ని చెప్పకపోవడంతో అభిమానులు కూడా రకరకాలుగా ఊహించేసుకున్నారు.. కానీ తాజాగా ఈ విషయంపై ఆది స్పందించి తాను జబర్దస్త్ కు దూరం కావడానికి గల కారణాన్ని వెల్లడించారు.

Jabardasth Adhi..Can't bear the torture and went away..?
Jabardasth Adhi..Can’t bear the torture and went away..?

జబర్దస్త్ వీడడానికి కారణం అదే..

తాజాగా హైపర్ ఆది ఈ విషయంపై మాట్లాడుతూ.. నాకు సినిమా ఆఫర్లు ఎక్కువగా వస్తున్నాయి.. దీంతో అక్కడ బిజీ అవుతున్నారు.. దీని కారణంగానే జబర్దస్త్ చేయడం కష్టంగా మారింది. పైగా నా స్కిట్లు నేనే రాస్తాను.. షూటింగ్ వల్ల నాకు టైం కుదరడం లేదు.. అందుకే మానేశాను.. ఇంకా జబర్దస్త్ లో ఉంటే మరే ఇతర పని చేయలేము .. దానికి పూర్తి సమయాన్ని కేటాయించాలి..అందుకే ప్రస్తుతం నేను జబర్దస్త్ కి దూరంగా ఉన్నానంటూ చెప్పుకొచ్చారు ఆది.మరోవైపు జనసేన పార్టీలో కీలకంగా పనిచేస్తున్న విషయం తెలిసిందే.. అసలే ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆది అక్కడ కూడా ఫోకస్ చేశారు. అందులో భాగంగానే అటు సినిమాలు ఇటు రాజకీయంగా బిజీగా ఉన్న కారణంగా జబర్దస్త్ కి కాస్త బ్రేక్ ఇచ్చినట్లు సమాచారం.

మరో కారణము కూడా..

అంతేకాదు దీనికి తోడు మరో కారణం కూడా ఉందట.. అదేమిటంటే స్కిట్లు రాయడం చాలా కష్టమని.. మొత్తం అందులోనే మునిగి పోవాల్సి ఉంటుందని.. మరో ప్రపంచాన్ని చూడలేకపోతున్నానని.. అందుకే గ్యాప్ తీసుకున్నాను అంటూ వెల్లడించారు. మరి హైపర్ ఆది తీసుకునే ఈ నిర్ణయం వెనుక ఆయన అభిమానులు ఎటువంటి కామెంట్స్ చేస్తారు అన్నది హాట్ టాపిక్ గా మారింది.. స్కిట్స్ రాయడం కోసం ఎప్పటికప్పుడు థాట్స్ మారుతూ ఉండాలి. అయితే వెంటవెంటనే ఆలోచనలు రావడం చాలా కష్టం.. ఒక 6 నెలలు విరామం తీసుకుంటే మళ్ళీ కొత్త ఆలోచనలతో కొత్త స్కిట్ రాయగలమని చెప్పారు..ఈ నేపథ్యంలోని సరికొత్త కథలతో ప్రేక్షకుల ముందుకి వచ్చి మళ్లీ మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి అంటూ ఆయన అభిమానులు కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్ధం. ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీలో కమెడియన్ గా పనిచేస్తున్న విషయం తెలిసిందే.. మరి అభిమానులు కోరుకుంటున్న మేరకు ఆది మళ్లీ సినిమాలలో అవకాశాలు తగ్గినప్పుడు జబర్దస్త్ లోకి వస్తారా? లేక ఆరు నెలల తర్వాత జబర్దస్త్ లో కమెడియన్ గా కనిపిస్తారా ?అన్నది చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు