Deepthi Sunaina : బిగ్ బాస్ బ్యూటీ కొత్త కారు.. అలాంటి కారు కొనడంపై అనుమానాలు?

Deepthi Sunaina : తెలుగు ప్రేక్ష‌కుల‌కు దీప్తి సునయన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ముఖ్యంగా బుల్లితెర‌, అలాగే సోష‌ల్ మీడియా లో జ‌నాల‌కు ఈమె బాగా ప‌రిచ‌యం. ఈరోజుల్లో సోషల్ మీడియా లో హీరోయిన్ల రేంజ్ లో వెలిగిపోతుంది ఈ అమ్మడు. ఇక అయితే తెలుగులో ఎక్కువ‌గా ప్రైవేట్ వీడియో సాంగ్‌ ల‌లో క‌నిపించే ఈ చిన్న‌ది, సామాజిక మాధ్య‌మాల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న అతి కొద్దిమందిలో ఆగ్ర స్థానం ద‌క్కించుకుంది. టాలీవుడ్ సినిమా హీరోయిన్ల రేంజ్ లో సుమారు 4.2 మిలియ‌న్స్ పైనే ఫాలోవ‌ర్స్ దీప్తి కి ఉన్నారంటే అమ్మ‌డి రేంజ్ ఏంటో ఆర్థం చేసుకోండి. అయితే పెద్దగా సినిమాలు చేయకుండా ఇంత ఫాలోయింగ్ ను సంపాదించుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఇక ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ హాట్ పోజుల ఫోటోషూట్లతో రచ్చ చేస్తూ ఉంటుంది.

బిగ్ బాస్ తో మరింత ఫేమస్..

అయితే సోషల్ మీడియాలో ముందుగా మొద‌ట‌ సినిమాలలో ఫేమ‌స్ అయిన పాట‌ల‌తో క‌వ‌ర్ సాంగ్స్ చేస్తూ, రీల్స్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న దీప్తి ‘కిరాక్‌పార్టీ’ వంటి ఒక‌టి రెండు సినిమాల‌లోనూ న‌టించింది. ఆపై ప్ర‌ముఖ యూట్యూబ‌ర్ శ‌ణ్ముఖ్ జ‌స్వంత్‌తో చాలా కాలం న‌డిచిన ప్రేమాయ‌ణం, అలాగే బిగ్‌బాస్‌ లో కంటెస్టెంట్‌ గా వెళ్లి చేసిన ర‌చ్చ ఆమెను నిత్యం సోష‌ల్ మీడియాలో ఉండేలా చేశాయి. ఇక ఆ తర్వాత శ‌ణ్ముఖ్ బిగ్‌బాస్‌ లోకి వెళ్ల‌డం త‌ర్వాత, అక్కడ జరిగిన పరిణామాలతో అత‌నితో బ్రేక‌ప్ కూడా చెప్పేసింది దీప్తి సున‌య‌న. ఇలాంటి వార్తలు దీప్తిని సోషల్ మీడియాలో (Deepthi Sunaina) ట్రెండింగ్‌ లో ఉంచాయి. అయితే అవన్నీ పట్టించుకోకుండా సోషల్ మీడియా లో ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ లో దీప్తి ఎప్పటికప్పుడు యాక్టీవ్ గా ఉంటూ రచ్చ చేస్తుంది. అంతేగాక‌, రోజుకో ర‌క‌మైన డ్రైస్సింగ్‌ లతో ఫొటోషూట్లు చేస్తూ కుర్ర‌కారుని మ‌త్తులో దించేస్తుంది. ఇదిలా ఉండగా దీప్తి సునయన తాజాగా ఓ కారును కొన్నట్టు తెలిసింది.

ఆ కొత్త కారుతో పనేంటని అనుమానాలు..

అయితే దీప్తి సునయన ముందునుండి కాస్త ఆర్ధికంగా ఎదిగిన ఫ్యామిలీయే అని తెలిసిందేగా. షణ్ముఖ్ తో బ్రేకప్ కి ఇది కూడా ఒక కారణమని కొందరు నెటిజన్లు అంటుంటారు. ఇదిలా ఉండగా దీప్తి తాజాగా ఓ కొత్త కారు కొనింది. అయితే ఆ కారుపై నెటిజన్లు పలు విధాలుగా చర్చిస్తున్నారు. మామూలుగా కొంటే ఏ బెంజో, ఆడి కార్ నో కొంటారు, గాని దీప్తి సునైనా కొన్న కొత్త కారు టయోటా లో హై లక్స్ అనే పేరుగల కారుని కొనుగోలు చేసింది. ఇక ఈ కార్ వ్యాల్యూ 37 లక్షలుగా పలుకుతుంది. అయితే ఈ కార్ స్పెషలిటీ ఏంటంటే కార్ డ్రైవర్ తో పాటు మరో ముగ్గురు కూడా ఏసీ క్యాబిన్లో ప్రయాణించొచ్చు. అలాగే బ్యాక్ సైడ్ సామాన్ల రవాణాకు ప్రత్యేకంగా క్యాబిన్ ఉంటుంది. అయితే ఇలాంటి వెహికిల్ తో దీప్తికి పనేంటి అని సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు నెటిజన్లు. నిజానికి ఇలాంటి కార్లను ఫారిన్ లో క్యారవ్యాన్ లు గా మార్చుకుని వాడతారట కూడా. బహుశా అలా ఏమైనా ట్రై చేస్తుందేమో అని కూడా అంటున్నారు. అయితే ఈ కారు తన తండ్రి గిఫ్ట్ గా ఇచ్చాడని తెలుస్తుంది.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు