Kajal Aggarwal : ‘సత్యభామ’ వచ్చేది ఆరోజే?

Kajal Aggarwal : టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా నెంబర్ వన్ రేంజ్ లో చక్రం తిప్పిన హీరోయిన్ కాజల్ అగర్వాల్. టాలీవుడ్లో ఉన్న స్టార్ హీరోస్ అందరితోనూ నటించిన ఈ చందమామ సీనియర్ స్టార్స్ తో కూడా నటించడానికి రెడీ అయింది. ఇప్పటికే చిరంజీవి, బాలకృష్ణ వంటి హీరోలతో నటించగా, త్వరలో వెంకటేష్, నాగార్జున లతో కూడా స్క్రీన్ షేర్ చేసుకోవడానికి రెడీ అంటుంది. ఇదిలా ఉండగా కాజల్ పెళ్ళై బిడ్డ పుట్టిన తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయగా, రీసెంట్ గా భగవంత్ కేసరి తో మంచి సక్సెస్ అందుకోగా, త్వరలో “సత్యభామ” అనే ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తుందని తెలిసిందే. ఈ సినిమాలో కాజల్ సత్యభామ గా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌ గా నటిస్తుంది. ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ గా రూపొందుతున్న ఈ సినిమాలో కాజల్ కు జోడీగా నవీన్ చంద్ర నటిస్తున్నారు. ఈ మూవీకి సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తున్నారు.

ఆ రోజే సత్యభామ దర్శనం..

ఇక సత్యభామ సినిమాలో కాజల్ అగర్వాల్ కెరీర్ లో తొలిసారి యాక్షన్ మోడ్‍ లో సీరియస్ క్యారెక్టర్ చేస్తుండడంతో మంచి ఆసక్తి నెలకొంది. ఇక కొన్ని నెలల కింద ఈ సినిమా టీజర్ రిలీజ్ అవ్వగా, మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్ 90 శాతం సినిమా పూర్తి చేశామని మేకర్స్ తెలిపారు. అలాగే కాజల్ అగర్వాల్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఎంతో శ్రమించి ఈ మూవీ లోని యాక్షన్ సీక్వెన్స్ లు కంప్లీట్ చేశారని అన్నారు. అయితే తాజాగా సత్యభామ మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. ఓ చిన్న వీడియో ద్వారా రిలీజ్ అనౌన్స్ మెంట్ చేస్తూ, మే17వ తేదీన సత్యభామని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇక తాజాగా ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేయగా, అందులో కాజల్ అగర్వాల్ సీరియస్ లుక్ లో కనిపిస్తోంది. బ్యాక్ గ్రౌండ్ లో ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, విజయవాడ మ్యాప్ కనిపిస్తోంది. తెలంగాణ స్టేట్ తో పాటు మహారాష్ట్ర బోర్డర్ కూడా ఉంది.

శశికిరణ్ టిక్కా నిర్మాణం..

ఇక సత్యభామ మూవీతో దర్శకుడు శశికిరణ్ టిక్కా నిర్మాణ రంగంలో అడుగు పెట్టారు. ఇక మేజర్, గూఢచారి వంటి సూపర్ హిట్ చిత్రాలకు దర్శకుడిగా వ్యవహరించిన శశికిరణ్ టిక్కా ఈ సినిమాకు స్క్రీన్‍ప్లే కూడా అందిస్తుండడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. అవురమ్ ఆర్ట్స్ బ్యానర్ పై బాబీ టిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, నాగినీడు, హర్షవర్ధన్, రవివర్మ, అంకిత్ కొయ్య, సంపద ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక పెళ్లయ్యాక కాజల్ రెగ్యులర్ కమర్షియల్ సినిమాల కాకుండా కంటెంట్ డిఫరెంట్ గా ఉండేలా కథలను సెలెక్ట్ చేసుకుంటుంది. ఇక ఇప్పుడు సత్యభామ అంటూ తానే మెయిన్ లీడ్ గా లేడీ ఓరియేంటేడ్ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. మరి సత్యభామ చిత్రంతో మంచి సక్సెస్ అందుకుని కాజల్ సెకండ్ ఇన్నింగ్స్ లో సూపర్ సక్సెస్ అయి మునుపటి వైభవాన్ని పొందుతుందా అనేది చూడాలి.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు