Kajal Aggarwal: వేసవిలో అందాల డోస్ పెంచిన కాజల్

Kajal Aggarwal: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది సీనియర్ హీరోయిన్లు ఉంటే మరి కొంత మంది జూనియర్ హీరోయిన్లు ఉన్నారు. కానీ కొంతమంది పెళ్లిళ్లు పిల్లలు పుట్టిన తర్వాత కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో రాణిస్తూ ఉంటారు. ఇప్పటికి వారికి చాన్సులు వస్తూనే ఉంటాయి. అలాంటి హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ ఒకరు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఈ బ్యూటీ కి టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉంది. మొన్న కరోనా సమయంలోనే పెళ్లి చేసుకున్న కాజల్ అగర్వాల్ తల్లి కూడా అయింది. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది ఈ బ్యూటీ. అలాగే కాజల్ అగర్వాల్ కు వరుసగా చాన్సులు వస్తూనే ఉన్నాయి. వాసవానికి లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్. ఆ తర్వాత కాజల్ అగర్వాల్ కెరీర్ పూర్తిగా మారిపోయిందని చెప్పవచ్చు.

కాజల్ అగర్వాల్ ముంబై నగరానికి చెందిన సంగతి మనందరికీ తెలిసిందే. ముంబై కి చెందిన ఈ బ్యూటీ టాలీవుడ్ లో మాత్రం మంచిగా రానించింది. లక్ష్మీ కళ్యాణం సినిమా చేసిన తర్వాత చందమామ సినిమాతో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ చందమామ సినిమా 2007 సంవత్సరంలో వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమా బంపర్ హిట్ కావడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో కాజల్ అగర్వాల్ తిరుగులేకుండా పోయింది.

- Advertisement -

ఇందులో మెయిన్ హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటించారు. ఆమె కామెడీ అలాగే సెంటిమెంట్ సీన్లు బాగా చేశారు. దీంతో ఈ సినిమా అయినప్పటి నుంచి చందమామగా కాజల్ పేరు మారిపోయింది. ఆమెకు చందమామ అనే బిరుదు ఇండస్ట్రీ ఇచ్చేసింది అని చెప్పవచ్చు. ఇక ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలో కూడా బంపర్ ఆఫర్ కొట్టేసింది కాజల్ అగర్వాల్. జక్కన్న మరియు రామ్ చరణ్ కాంబినేషన్లో మగధీర సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.

దాదాపు 400 సంవత్సరాల కిందటి ప్రేమ కథను రాజమౌళి చాలా చక్కగా తీశాడు.ఈ సినిమా అప్పట్లోనే కోట్లకు కోట్లు కలెక్షన్లు రాబట్టింది. అలాంటి సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించి అందరిని మెప్పించింది. ఇక ఈ సినిమా తర్వాత కాజల్ అగర్వాల్ టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్గా మారిపోయింది. అసలు తన కెరీర్లో వెనక్కి చూసుకోలేదు ఈ బ్యూటీ.

ఇక ఒకసారి హీరోయిన్ కాజల్ అగర్వాల్ పర్సనల్ విషయానికి వస్తే…. 2020 కరోనా సమయంలో తన చిన్ననాటి స్నేహితుడైన గౌతమ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది హీరోయిన్ కాజల్ అగర్వాల్. వీరి వివాహం ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలోనే జరిగింది. అయితే పెళ్లి అయిన తర్వాత ఎక్కువగా సినిమాలు చేయకుండా… కుటుంబం పైన దృష్టి పెట్టింది ఈ బ్యూటీ. అలాగే వీరికి ఓ పండంటీ కొడుకు కూడా పుట్టాడు. ఇది ఇలా ఉండగా తాజాగా తన హాట్ అందాలను ఆరబోసి రచ్చ చేసింది హీరోయిన్ కాజల్ అగర్వాల్.

వైట్ డ్రెస్ వేసుకొని తన ఏద అందాలను చూపిస్తూ దుమ్ము లేపింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను చూసిన నెటిజెన్స్… ఆంటీ వయసు వచ్చినా కూడా కాజల్ అగర్వాల్ అందంలో ఏమాత్రం తగ్గలేదని అంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు