Renu Desai: 3500/- అడగడం వెనుక కారణం బయట పెట్టిన రేణు దేశాయ్

Renu Desai: రేణు దేశాయ్ అనగానే తెలియని వారు ఉండరు. బద్రి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత స్టార్ హీరో పవన్ కళ్యాణ్ కి భార్యగా మారారు. అప్పటినుంచి చాలామంది తెలుగు ప్రేక్షకులంతా కూడా రేణు దేశాయ్ ను వదిన గా భావిస్తారు. ప్రస్తుతం సినిమాల్లో యాక్టివ్ గా లేకపోయినా కూడా సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ లో చాలా యాక్టివ్ గా ఉంటారు రేణు దేశాయ్. కేవలం నటి గానే కాకుండా దర్శకురాలుగా కూడా తను ప్రూవ్ చేసుకున్నారు.

రేణు దేశాయ్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఫాలోవర్లతో తన పిల్లల అప్‌డేట్‌లు, వీడియోలు మరియు ఫోటోలను షేర్ చేస్తుంటారు. సోషల్ మీడియాలో కొన్ని విషయాలపై ఆమె తన అభిప్రాయాలను కూడా తెలియజేస్తారు. రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాతో రేణు సెకండ్ ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేసి రీ ఎంట్రీ ఇచ్చారు. అయితే ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించిన ఫలితాన్ని సాధించలేదు.

Renu Desai revealed the reason behind asking 3500/-
Renu Desai revealed the reason behind asking 3500/-

అకౌంట్ హ్యాక్ అయిందా.?
రేణు దేశాయ్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నారు. క్యూఆర్ కోడ్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టి ఆమె 3500 రూపాయలు అడిగారు. కొంతమంది నిమిషాల వ్యవధిలో డబ్బు పంపగా, కొంతమంది నెటిజన్లు ఏదో తప్పుగా భావించారు మరియు రేణు దేశాయ్ అకౌంట్ హ్యాక్ అయింది అని అనుకున్నారు.

- Advertisement -

వీడియో తో క్లారిటీ
ఇప్పుడు, రేణు దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పోస్ట్ చేసి చాలా అనుమానాలు క్లియర్ చేసారు. తాను అస్వస్థతకు గురయ్యానని, అందుకే సోషల్ మీడియాలో కనిపించకపోవడానికి కారణమని ఆమె చెప్పుకొచ్చారు. తన అకౌంట్ హ్యాక్ కాలేదని, ఆ మొత్తాన్ని పంపమని కోరింది తానేనని ఆమె స్పష్టం చేసింది. విరాళంగా అందించిన ప్రతి ఒక్కరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

ఆమె సాధారణంగా పిల్లలు, పశువులు, జంతువులు మొదలైన వాటి సంక్షేమానికి కొంత మొత్తాన్ని విరాళంగా ఇస్తున్నట్లు చెప్పుకొచ్చారు. రేణు దేశాయ్, “నా పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉన్నందున నేను నా సంపాదన మొత్తాన్ని విరాళంగా ఇవ్వలేను. నేను విరాళం ఇస్తూనే ఉంటాను మరియు నా దగ్గర మనీ లేనప్పుడు నా ఫాలోవర్స్ అడగాలని నిర్ణయించుకున్నాను.” రేణు దేశాయ్ కూడా తాను జంతు సంరక్షణ కేంద్రాన్ని నిర్మిస్తున్నానని, దాని కోసం విరాళాలను ఆహ్వానిస్తానని చెప్పుకొచ్చారు. మానవతా దృక్పథంతో తనకు సహకరించిన నెటిజన్లకు నటి కమ్ డైరెక్టర్ మరోసారి కృతజ్ఞతలు తెలిపారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు