Karthik Subbaraju: సూర్య 44 అప్డేట్

Karthik Subbaraju: షార్ట్ ఫిలిమ్స్ తో తన కెరీర్ ను మొదలుపెట్టి అప్పట్లోనే సరైన గుర్తింపును సాధించుకున్నాడు కార్తీక్ సుబ్బరాజు. విజయ్ సేతుపతి నటించిన పిజ్జా సినిమాతో తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయం అయ్యాడు. బాక్స్ ఆఫీస్ వద్ద సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. చాలామందికి ఒక కథను ఇలా కూడా చెప్పొచ్చు. ఒక సినిమాను ఇలా కూడా తీయొచ్చు అనేటట్లు ఆ సినిమాను తీసి చూపించాడు కార్తీక్ సుబ్బరాజు. ఈ సినిమా తర్వాత కార్తీక్ దర్శకత్వం వహించిన సినిమా జిగర్తాండ. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదే సినిమాను కొన్ని సంవత్సరాల తర్వాత హరీష్ శంకర్ గద్దల కొండ గణేష్ సినిమాగా రీమిక్ చేశారు. గద్దల కొండ గణేష్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. వరుణ్ తేజ్ కెరియర్ లో ఇది ఒక బెస్ట్ ఫిలింల అనిపించింది.

Karthik Subbaraj

సూపర్ స్టార్ తో సినిమా

- Advertisement -

ఆ తర్వాత కార్తీక్ సుబ్బరాజ్ చేసిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి స్కోర్ ని రన్ చేశాయి. అయితే ప్రతి దర్శకుడికి కూడా తమ అభిమాన హీరో ఒకరు ఉంటారు. అలా కార్తీక్ అభిమాన హీరో సూపర్స్టార్ రజనీకాంత్. సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి మనకు తెలియంది కాదు, కేవలం తమిళ్లో మాత్రమే కాకుండా తెలుగులో కూడా సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో రజనీకాంత్. అయితే రజనీకాంత్ తో తీసిన పెట్ట సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ ను రాబట్టింది. ఈ సినిమా తెలుగులో కూడా మంచి హిట్ అయింది. అయితే ఆ తర్వాత చేసిన జగమే తంత్రం సినిమా నెట్ ఫిక్స్ లో రిలీజ్ అయింది. ఆ తర్వాత చేసిన మహాన్ సినిమా కూడా అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ గా రిలీజ్ అయింది. ఈ సినిమాలు కూడా టెక్నికల్ గా అద్భుతంగా అనిపించి మంచి రెస్పాన్స్ కూడా సాధించాయి.

త్వరలో స్టార్ట్ కానుంది

ఇక ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజ్ సూర్యతో సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా సూర్య కెరీర్ లో వస్తున్న 44వ సినిమా. ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆడిషన్ కాల్ కూడా నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ సినిమాకు సంబంధించి 8 ఏళ్ల వయసు నుంచి 80 ఏళ్ల వయసు వరకు భాష తో సంబంధం లేకుండా ఎవరైనా రావచ్చు అంటూ ఆహ్వానం పలికారు. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ త్వరలో స్టార్ట్ అవ్వనుంది. ఈ సినిమాకు సంతోష్ నారాయణ సంగీతం అందిస్తున్నారు.

సంతోష్ నారాయణ ఎన్ని సినిమాలు చేసినా కూడా రీసెంట్ గా తెలుగులో శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన దసరా సినిమా తర్వాత తెలుగు ప్రేక్షకుల్లో కూడా సంతోష్ నారాయణ పై ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమా కూడా సంతోష్ నారాయణ సంగీతం అందిస్తున్నారు. ఇకపోతే కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన జగన్ తండా డబుల్ ఎక్స్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన రెస్పాన్స్ ను సాధించింది. ఎప్పుడొస్తున్నా సూర్య 44 సినిమాపై అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు