AI used Actors List : సీనియర్ హీరోలకు వరంగా ఏఐ… ఇప్పటిదాకా యంగ్ గా మారిన హీరోలు వీళ్లే

AI used Actors List : ఏఐ అనగానే ఇటీవల కాలంలో బాగా వైరల్ అయిన డీప్ ఫేక్ వీడియోలు గుర్తొస్తాయి. కానీ ఇలా చెడు పనులకే కాకుండా ఎన్నో మంచి పనులకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఉపయోగపడుతుంది. ప్రతి రంగంలోనూ ఏఐ ఊహించని రేంజ్ లో మార్పులు తీసుకొస్తోంది. తాజాగా రిలీజ్ అయిన కల్కి 2898 ఏడి మూవీలోని అమితాబచ్చన్ యంగ్ లుక్ ను చూసి అందరూ అబ్బుర పడుతున్నారు. అయితే ఇప్పటిదాకా కేవలం బిగ్ బి మాత్రమే కాకుండా పలువురు స్టార్ హీరోలు ఏఐతో యువకులుగా మారిపోయారు.

ఏఐతో మాయ చేస్తున్న మేకర్స్…

సినిమా ఇండస్ట్రీలో ఏఐ క్రియేట్ చేస్తున్న మ్యాజిక్ ను చూస్తే మతి పోవడం ఖాయం. గత కొన్ని ఏళ్ల నుంచి హీరోల వయసును డిజిటల్ గా తగ్గిస్తూ వస్తున్నారు మేకర్స్. ఇప్పటిదాకా సినిమాల్లో హీరోల గతం చూపించేటప్పుడు వాళ్ళను యంగ్ ఏజ్ లో ఉన్నట్టుగా తెరపై చూపించటానికి అంటే వేరే నటులను వాడుకునేవారు. కానీ ప్రస్తుతం ఉన్న ఏఐ టెక్నాలజీ వల్ల అప్పట్లో స్టార్ హీరోలు ఎలా ఉండేవారో కూడా ఏఐ ద్వారా ఈజీగా చూపించగలుగుతున్నారు. స్క్రీన్ పై నటుల ఏజ్ ను తగ్గించడంతో పాటు ఈజీగా పెంచగలుగుతున్నారు. మరి ఇప్పటి దాకా ఏఐ టెక్నాలజీని వాడి ఏ స్టార్స్ ఏజ్ తగ్గించుకున్నారో తెలుసుకుందాం.

1. అమితాబ్ బచ్చన్

తాజాగా రిలీజ్ అయిన కల్కి 2898 ఏడీ టీజర్ లో అశ్వద్ధామగా కనిపించారు బిగ్ బి. అయితే ఇందులోని విజువల్స్ లో ఓ ఫ్రేమ్ లో మాత్రం బిగ్ బి యంగ్ ఏజ్ లో మూడవ కన్నుతో కనిపించి అందరికీ షాక్ ఇచ్చారు.

- Advertisement -

2. సల్మాన్ ఖాన్

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ భారత్ అనే మూవీలో యువకుడిగా కనిపించి మెప్పించాడు. ఈ సినిమాలో ఆయన 8 ఏళ్ల నుంచి 70 ఏళ్ల ఏజ్ వరకు స్టోరీ ఉంటుంది. స్టోరీకి తగ్గ ఏజ్ లో సల్మాన్ కన్పించడం కోసం ఏఐని వాడారు మేకర్స్.

3. షారుక్ ఖాన్

షారుక్ డంకి మూవీతో గతేడాది థియేటర్లలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆయన రెండు వేరు వేరు కాలాల్లోని పాత్రల్లో కనిపించాల్సి ఉంటుంది. అయితే యువకుడిగా ఉన్న పాత్ర కోసం ఏఐని వాడి షారుక్ ముఖంలో మార్పులు చేశారు.

4. విజయ్ దళపతి

విజయ్ ప్రస్తుతం ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం అనే మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తుండగా, యువకుడిగా ఆయనను చూపించడానికి ఏఐ హెల్ప్ తీసుకున్నారు మేకర్స్.

5. అమీర్ ఖాన్

బాలీవుడ్ ఖాన్ల త్రయంలో ఒకరైన అమీర్ ఖాన్ రెండు సినిమాలలో ఏఐని ఉపయోగించారు. మొదటి మూవీ పీకే. అందులో డిజిటల్ టచ్ అప్ ఉపయోగించి అమీర్ వయసును తగ్గించి చూపించారు. రీసెంట్ గా ఆయన నటించిన లాల్ సింగ్ చద్దాలో కూడా ఏఐని ఉపయోగించారు. కాగా వీళ్ళతో పాటే హాలీవుడ్ హీరోలు కూడా ఏఐ టెక్నాలజీని వాడుతున్నారు. ఇండియానా జోన్స్, డయల్ ఆఫ్ డెస్టినీ సినిమాలో హారిసన్ ఫోర్డ్, ది క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజమిన్ బటన్ అనే మూవీలో బ్రాడ్ పిట్ ఏఐ ఉపయోగించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు