Jaberdast Karthik: జబర్దస్త్ కమెడియన్ కార్తీక్ ఇంట విషాదం..!

Jaberdast Karthik..దశాబ్ద కాలానికి పైగా బుల్లితెర ఇండస్ట్రీలో తన ప్రభావాన్ని చూపిస్తూ నెంబర్ వన్ కామెడీ షో గా వెలుగొందుతోంది జబర్దస్త్.ఈ షో వల్ల ఎంతోమంది ఆర్టిస్టులు వెలుగులోకి వచ్చారు. అందులో చాలామంది తమ టాలెంట్ నిరూపించుకొని పెద్ద సెలబ్రిటీలుగా మారిపోయారు.. మరికొంతమంది సినిమాలలో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నారు.. మరి అలాంటి వారిలో కమెడియన్ కెవ్వు కార్తీక్ కూడా ఒకరు. చాలా సంవత్సరాలుగా జబర్దస్త్ షోలో యమ హైలెట్ అవుతూ దూసుకుపోతున్న ఈయన ప్రేక్షకులను అలరిస్తూ ఎప్పటికప్పుడు తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో ఆకట్టుకుంటున్నారు.. ఇదిలా ఉండగా తాజాగా కెవ్వు కార్తీక్ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీంతో బుల్లితెర పై కూడా తీవ్ర విషాదం నెలకొంది.

కెవ్వు కార్తీక్ ఇంట్లో విషాదం..

Jaberdast Karthik: Tragedy at Jaberdast comedian Karthik's house..!
Jaberdast Karthik: Tragedy at Jaberdast comedian Karthik’s house..!

అసలు విషయంలోకి వెళ్తే.. కెవ్వు కార్తీక్ తల్లి అనారోగ్యంతో బుధవారం కన్నుమూశారు.. దీంతో కార్తీక్ తో పాటు అతడు చేస్తున్న జబర్దస్త్ ఫ్యామిలీలో విషాదఛాయలు అలుముకున్నాయి ..ఆమె మరణం పై పలువురు బుల్లితెర ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

కెవ్వు కార్తీక్ తల్లి మరణానికి కారణం..

జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ తల్లి గత కొంతకాలంగా క్యాన్సర్ మహమ్మారితో బాధపడుతున్నారు. దాదాపు 5 సంవత్సరాలకు పైగానే ఆసుపత్రిలో వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. దీంతో ఆమె కోలుకుంటారని అందరూ అనుకున్నారు.. కానీ ఊహించని విధంగా ఈ మధ్యన ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆమె బుధవారం రాత్రి ప్రాణాలు కోల్పోయారు..

- Advertisement -

తల్లి మరణం పై కెవ్వు కార్తీక్ పోస్ట్..

గతంలో కూడా కెవ్వు కార్తీక్ తల్లి పలుమార్లు బుల్లితెరపై కనిపించి సందడి చేసిన విషయం తెలిసిందే. ఆమెకు క్యాన్సర్ అని నిర్ధారణ అయిన తర్వాత కూడా ఆమె చాలాసార్లు షోలు, ఈవెంట్లలో కూడా పాల్గొన్నారు అయితే ఈ మధ్య కెవ్వు కార్తీక్ తన తల్లి ఆరోగ్యం గురించి పోస్ట్ పెడుతుండడంతో ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు సైతం కామెంట్లు చేశారు అయినా సరే ఆమె కోలుకోలేకపోవడం విషాదకరమని చెప్పాలి.. ఇకపోతే తన తల్లి వార్తను కెవ్వు కార్తిక్ తాజాగా తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలిపారు.. ఈ మేరకు తన ఖాతాలో.. “అమ్మా.. గత ఐదు సంవత్సరాల రెండు నెలలుగా క్యాన్సర్ పై అలుపెరగని పోరాటం చేశావు.. నీ జీవితం అంతా ఒక యుద్ధమే.. మమ్మల్ని కన్నావు..నాన్నకు తోడుగా కుటుంబాన్ని కష్ట పరిస్థితుల్లో కూడా కంటికి రెప్పలా కాపాడావు.. అమ్మ ఈ ఐదేళ్లలో ఒంటరిగా ఎలా పోరాడాలి అనే విషయాలను మాకు నేర్పావు అంటూ కన్నీటి పర్యంతం అవుతూ ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు కెవ్వు కార్తిక్..

అన్నీ నేర్పావు కానీ అది ఎందుకు నేర్పలేదు..

అంతేకాదు అదే పోస్టులో అమ్మ నీ ఆత్మస్థైర్యం నాలో ధైర్యాన్ని నింపింది. అన్నీ నేర్పావు కానీ నువ్వు లేకుండా ఎలా బ్రతకాలో నేర్పలేదు.. ఎందుకమ్మా..?.. మా అమ్మ కోసం ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు.. మా అమ్మకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్స్ అందరికీ నా పాదాభివందనం అంటూ కెవ్వు కార్తిక్ రాసుకొచ్చారు.. ఇక ఈ విషయం తెలిసిన అభిమానుల సైతం కన్నీటి పర్యంతమవుతూ.. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కామెంట్లు చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Kevvu Kartheek (@kevvukartheek)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు