Vd14: సూర్య రిజెక్ట్ చేసిన కథ ను విజయ్ ఓకే చేశాడా.?

Vd14: ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్ లో విజయ్ దేవరకొండ ఒకరు. మొదటగా కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో కనిపించి ఆ తర్వాత ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నాడు. ఆ సినిమా తర్వాత హీరోగా పెళ్లిచూపులు అనే సినిమాను చేశాడు. తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. తన మొదటి సినిమాతోనే చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గర అయిపోయాడు విజయ్. తరుణ్ భాస్కర్ కూడా ఒక మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఈ సినిమాతోనే వచ్చింది.

Vd14: Did Vijay OK the story that Surya rejected?
Vd14: Did Vijay OK the story that Surya rejected?

గీత గోవిందం తో 100 కోట్ల మార్కెట్

ఆ సినిమా తర్వాత విజయ్ చేసిన సినిమా అర్జున్ రెడ్డి. ఇక ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఒక సినిమాను ఇలా కూడా తీయొచ్చు. ప్రతి క్రాఫ్ట్ ని ఇంత క్లారిటీగా చూపించొచ్చు అని ఈ సినిమాతో నిరూపించాడు సందీప్ రెడ్డి వంగ. ఒక మామూలు కథని అందర్నీ ఆకట్టుకునేలా చూపించి తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ను సంపాదించుకున్నాడు. సినిమా తర్వాత ఏకంగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు సందీప్ రెడ్డి వంగ. ఆ తర్వాత గీతగోవిందం అనే సినిమాను చేశాడు విజయ్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 100 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమాతో మరోసారి ఫ్యామిలీ ఆడియన్స్ కి మరింత చేరువయ్యాడు.

- Advertisement -

టాక్సీవాలా తో దర్శకుడిగా పరిచయం

విజయ్ దేవరకొండ చేసిన టాక్సీవాలా సినిమా కూడా మంచి హిట్ అయింది. ఈ సినిమాతో రాహుల్ సంకృత్యన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయం అయ్యాడు. మొదటి సినిమాతోనే రాహుల్ మంచి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత రాహుల్ చేసిన సినిమా శ్యామ్ సింగ రాయ్. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది. పునర్జన్మ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా అందర్నీ బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో నాని పర్ఫామెన్స్ అద్భుతమని చెప్పొచ్చు. అయితే నాని చేసిన కొన్ని కామెంట్స్ వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ సినిమాపై కక్ష సాధింపు చర్యలు చేపట్టింది. సరైన టికెట్ ప్రదేశం కూడా ఈ సినిమాకి పెట్టలేదు. కానీ ఈ సినిమా మాత్రం అద్భుతంగా ఉంటుంది.

Vd14 రిజక్ట్ చేసిన హీరోలు

ఇకపోతే ఇప్పుడు రాహుల్ మళ్లీ విజయ్తో సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాను అనౌన్స్ చేసింది చిత్ర యూనిట్. అయితే ఈ కథను ముందు తమిళ్ స్టార్ హీరో సూర్యకి చెప్పాడట రాహుల్. అయితే సూర్య ఈ కథను ఒప్పుకోలేదట. ఆ తర్వాత సూర్య తమ్ముడు కార్తీక్ కూడా చెప్పాడు రాహుల్, అయినా కూడా వర్కౌట్ కాలేదట. ఆ తర్వాత ఆ స్క్రిప్ట్ కి కొద్దిపాటి చేంజెస్ చేసి విజయ్ దేవరకొండకు చెప్పాడు రాహుల్. విజయ్ ఈ స్క్రిప్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ సినిమా పట్టాలెక్కనుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు