Sharukh Khan : కూతురికోసం 200 కోట్ల ఖర్చుపెడుతున్నాడు..

Sharukh Khan : బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ప్రస్తుతం బాలీవుడ్ లోనే సూపర్ ఫామ్ లో ఉన్న హీరో. కొన్నాళ్ళుగా వరుస ప్లాపులతో డీలా పడ్డ ఈ హీరో, లాస్ట్ ఇయర్ పఠాన్, జవాన్, డుంకి వంటి చిత్రాలతో హ్యాట్రిక్ ఘన విజయాలు అందుకోవడమే కాకుండా, బాలీవుడ్ లో ఏకంగా 1000 కోట్ల ఇండస్ట్రీ హిట్ చిత్రాలు నెలకొల్పి రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇదిలా ఉండగా షారుఖ్ ఖాన్ తన కూతురు సుహానా ఖాన్ ని హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ చేస్తూ భారీ సినిమా నిర్మిస్తున్నాడన్న సంగతి తెలిసిందే. ఇక షారుక్ ఖాన్ వారసురాలు బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడెప్పుడా? అని ప్రేక్ష‌కాభిమానులు కూడా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. అయితే ఐదేళ్ల కింద ఓ షార్ట్ ఫిల్మ్ లో నటించిన సుహానా, ఇప్పుడు ‘ది అర్చిస్’ అనే చిత్రంలో నటిస్తుండగా, ఆ మూవీ నెట్ ఫ్లిక్స్ లో విడుదల కాబోతుంది. అయితే సుహానా ఖాన్ హీరోయిన్ తాజాగా ఓ భారీ ప్రాజెక్ట్ షురూ అయింది.

కూతురి కోసం షారుఖ్ 200 కోట్లు..

ఇక బాలీవుడ్ లో ‘కింగ్’ అనే సినిమాతో షారుఖ్ ఖాన్ కూతురు సుహానా హీరోయిన్ గా లాంచ్ కాబోతుంది. సుజోయ్ ఘోష్ చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తుండగా, యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవి గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా తెరకెక్కబోయే చిత్రం, సుహానా ఖాన్ కి తొలి సినిమా కావ‌డంతో బ‌డ్జెట్ విష‌యంలో ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా నిర్మించాల‌ని షారుఖ్ మేకర్స్ కి ఆదేశాలిచ్చారు. అంతే కాదు ఈ సినిమాకోసం షారుఖ్ ఖాన్ నిర్మాతగా మారి ఏకంగా 200 కోట్లు ఖర్చు పెడుతున్నాడట. ఇదే నిజ‌మైతే ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలో ఇదో చ‌రిత్ర అవుతుంది అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. వార‌సుల కోసం ఇంత‌గా ఏ తండ్రి ఒక సినిమా కోసం ఖ‌ర్చు చేయ‌లేదు. అది కూడా తొలి సినిమాకే షారుఖ్ ఇంత ఖర్చు పెడుతున్నాడంటే, మామూలు విషయం కాదు. పైగా ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ కూడా కీలక పాత్ర పోషిస్తున్న‌ట్లు ఇప్ప‌టికే వార్తలు వస్తున్నాయి.

తండ్రితో తొలి సినిమాలోనే స్క్రీన్ షేర్..

అయితే సుహానా ఖాన్ హీరోయిన్ గా నటించబోయే కింగ్ సినిమాలో తండ్రి షారుఖ్ (Sharukh Khan) కూడా కీలక పాత్రలో నటించనున్నారట. అయితే అది సుహానా కి గురువు పాత్రలో షారుఖ్ నటిస్తున్నాడట. ఇక తొలి సినిమాకే కుమార్తెకి గురువు పాత్ర‌లో షారుఖ్ న‌టించ‌నున్నారంటే విశేషమనే చెప్పాలి. ఇక యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రతీ స‌న్నివేశం ప్ర‌త్యేకంగా ఉండ‌టం కోసం విదేశీ స్టంట్ మాస్ట‌ర్ల‌ను రంగంలోకి దించుతున్నారుట‌. అంతేకాదు ఇందులో గురువు పాత్ర అయినా షారుఖ్ రోల్ సినిమాలో చాలా ప‌వ‌ర్ పుల్ గా ఉంటుంద‌ని, కింగ్ ఖాన్ ఇమేజ్ కి తగ్గట్టు డిజైన్ చేసారని తెలుస్తుంది. ఏది ఏమైనా కూతురు సుహానా కోసం షారుఖ్ ఇంత భారీ బడ్జెట్ ఖర్చు పెడుతూ, కూతురి కోసం త‌న ఇమేజ్ ని ప‌క్క‌న‌బెట్టి రంగంలోకి దిగుతున్నాడు. అయితే ఈ సినిమా గురించి ఇతర పాత్రలు, ఇంకా టెక్నికల్ కాస్ట్ & క్రూ పై త్వరలోనే వివరాలు చిత్ర యూనిట్ వెల్లడించనున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు