Sharukh Khan : కింగ్ ఖాన్ కూతురు సుహానా ఎంట్రీకి సిద్ధం! తొలి సినిమాలోనే తండ్రితో స్క్రీన్ షేర్?

Sharukh Khan : బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు ఇండియాలోనే అత్యధికంగా పారితోషకం తీసుకున్న హీరోగా బాలీవుడ్ ని ఏలిన ఈ హీరో కొన్నాళ్ళు వరుస ప్లాపులతో డీలా పడ్డాడని తెలిసిందే. అయితే అనూహ్యంగా లాస్ట్ ఇయర్ పఠాన్, జవాన్, డుంకి వంటి చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలు అందుకోవడమే కాకుండా బాలీవుడ్ లో 1000 కోట్ల ఇండస్ట్రీ హిట్ చిత్రాలు నెలకొల్పి రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇదిలా ఉండగా షారుఖ్ ఖాన్ ఫ్యామిలీ కూడా సోషల్ మీడియా లో ఎంత యాక్టీవ్ గా ఉంటారో తెలిసిందే. కొడుకు ఆర్యన్ ఖాన్ బాలీవుడ్ లో కాస్త బ్యాడ్ అయినా, కూతురు సుహానా ఖాన్ మాత్రం సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ గా ఉంటుంది. ఇక షారుక్ ఖాన్ వారసురాలు సుహానాఖాన్ బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడెప్పుడా? అని ప్రేక్ష‌కాభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. ఐదేళ్ల కింద ఓ షార్ట్ ఫిల్మ్ లో నటించిన సుహానా త్వరలోనే హీరోయిన్ గా గ్రాండ్ గా లాంచ్ కాబోతుందని తెలుస్తుంది.

మెయిన్ లీడ్ హీరోయిన్ గా గ్రాండ్ ఎంట్రీ కి సిద్ధం..

క సుహానా ఖాన్ ప్రస్తుతం ‘ది అర్చిస్’ అనే చిత్రంలో నటిస్తుండగా ఆ మూవీ నెట్ ఫ్లిక్స్ లో విడుదల కాబోతుంది. అయితే అందులో సుహానా మాత్రమే కాకుండా ఖుషి కపూర్, ఇంకా బాలీవుడ్ స్టార్ కిడ్స్ నటిస్తున్నారు. అయితే ఈ సినిమా త‌ర్వాత హీరోయిన్ గా డెబ్యూ కోసం ఎదురుచూస్తోన్న స‌మ‌యమిది. తాజాగా ఆ ప్రాజెక్ట్ షురూ అయింది. ‘కింగ్’ అనే సినిమాతో షారుఖ్ ఖాన్ కూతురు సుహానా లాంచ్ కాబోతుంది. సుజోయ్ ఘోష్ చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తుండగా, యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవి గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇక సుహానా ఖాన్ కి తొలి సినిమా కావ‌డంతో బ‌డ్జెట్ విష‌యంలో ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా నిర్మించాల‌ని షారుఖ్ ఆదేశాలిచ్చారు. అయితే ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ కూడా గెస్ట్ రోల్ పోషిస్తున్న‌ట్లు ఇప్ప‌టికే వార్తలు వస్తున్నాయి.

తండ్రితో తొలి సినిమాలోనే స్క్రీన్ షేర్..

అయితే సుహానా ఖాన్ హీరోయిన్ గా నటించబోయే తొలి సినిమాలో తండ్రి షారుఖ్ (Sharukh Khan) అతిథి పాత్రలో నటించనున్నారట. కానీ అది అయిదారు నిముషాలు ఉండే అతిధి పాత్ర కాదని, సుహానా కి గురువు పాత్ర అని తాజాగా లీకైంది. ఇక తొలి సినిమాకే కుమార్తెకి గురువు పాత్ర‌లో షారుఖ్ న‌టించ‌నున్నారంటే విశేషమనే చెప్పాలి. ఇక ఈ క‌థ‌కి సంబంధించిన ప‌నుల‌న్నింటిని షారుఖ్ ద‌గ్గ‌రుండి చూస్తున్నారుట‌. ఎప్ప‌టిక‌ప్పుడు పర్యవేక్షిస్తూ మేకింగ్ పగడ్బందీగా ప్లాన్ చేస్తూ భారీ మార్పులు చేయిస్తు న్నారుట‌. ప్రతీ స‌న్నివేశం ప్ర‌త్యేకంగా ఉండ‌టం కోసం విదేశీ స్టంట్ మాస్ట‌ర్ల‌ను రంగంలోకి దించుతున్నారుట‌. ఇక పేరుకు గురువు పాత్ర అయినా షారుఖ్ రోల్ సినిమాలో చాలా ప‌వ‌ర్ పుల్ గా ఉంటుంద‌ని, కింగ్ ఖాన్ ఇమేజ్ కి తగ్గట్టు డిజైన్ చేసారని తెలుస్తుంది. మామూలుగా షారుఖ్ ఖాన్ లాంటి నటుడు వేరే సినిమాల్లో ఎంతో ఇంపార్టెన్స్ ఉంటే గాని నటించాడు. ఇతర స్టార్ హీరోల సినిమాల్లో అయినా బాగా ఆలోచిస్తారు. కానీ కుమార్తె కోసం త‌న ఇమేజ్ ని ప‌క్క‌న‌బెట్టి రంగంలోకి దిగుతున్నాడు. అయితే ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందో, ఇతర పాత్రలు, ఇంకా టెక్నికల్ కాస్ట్ & క్రూ పై త్వరలోనే వివరాలు చిత్ర యూనిట్ వెల్లడించనున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు