Rathnam : విశాల్ రత్నం తెలుగు బిజినెస్ డీటెయిల్స్.. మంచి అడ్వాంటేజ్..

Rathnam : కోలీవుడ్ స్టార్ విశాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగువాడైనప్పటికి కోలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగాడు. మాస్ కమర్షియల్ హీరోగా వరుస హిట్లు కొట్టిన విశాల్ పందెంకోడి, భరణి, అభిమన్యుడు, వంటి సినిమాలతో తెలుగులో కూడా తన ఫాలోయింగ్ ని పెంచుకున్నాడు. ఇక లాస్ట్ ఇయర్ విశాల్ బాక్స్ ఆఫీస్ దగ్గర తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ను “మార్క్ ఆంటోనీ” మూవీ తో సొంతం చేసుకున్నాడు. ఈ సినిమా టాక్ మరీ ఓ రేంజ్ లో లేక పోయినా కూడా తమిళ్ లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా టోటల్ రన్ లో తమిళ్, తెలుగు కలిపి టోటల్ గా 102 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది. ఇక తెలుగు లో కూడా 4.3 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని బిజినెస్ ను రికవరీ చేసింది మార్క్ ఆంటోని మూవీ. ఇక ఈ ఇయర్ విశాల్ ఫుల్ జోరు మీదుండి వరుస సినిమాలను లైన్లో పెట్టాడు. అందులో హరి దర్శకత్వంలో వస్తున్న “రత్నం” మూవీ ఒకటి. ఇక వీరి కాంబోలో ఇంతకు ముందు భరణి, పూజ లాంటి హిట్ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు రత్నం సినిమా వీరి కాంబోలో హ్యాట్రిక్ సినిమాగా రాబోతుంది.

రత్నం తెలుగు బిజినెస్..

ఇక విశాల్ రత్నం మూవీ ఆడియన్స్ ముందుకు ఈ నెల 26న గ్రాండ్ గా తమిళ్, తెలుగు లో రిలీజ్ కానుండగా, తెలుగు లో సినిమా కొన్ని చోట్ల ఓన్ గా, రిలీజ్ చేస్తూ, మరికొన్ని చోట్ల అడ్వాన్స్ బేస్ మీద రిలీజ్ అవుతూ ఉండగా, ఓవరాల్ గా రత్నం సినిమా తెలుగు రాష్ట్రాల్లో వాల్యూ బిజినెస్ రేంజ్ మరోసారి 4 కోట్ల రేంజ్ లో ఉంటుందని అంచనా. అయితే విశాల్ రీసెంట్ మూవీస్ బిజినెస్ లు కూడా ఇదే రేంజ్ లో ఉండగా, ఇప్పుడు రత్నం మూవీకి కూడా ఇదే రేంజ్ లో బిజినెస్ ను అందుకుంది. ఇక తెలుగు లో రత్నం సినిమా ఇప్పుడు క్లీన్ హిట్ మార్క్ ని అందుకోవాలి అంటే 4.50 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. అయితే తమిళ్ ఓవరాల్ బిజినెస్ లెక్కలు ఇంకా తేలాల్సి ఉండగా, ఓవరాల్ గా తెలుగు లో మాత్రం పెద్దగా పోటి ఏమి లేకుండానే రిలీజ్ కానుండటంతో ఈ సినిమాకి మంచి అడ్వాంటేజ్ అని చెప్పాలి.

అడ్వాంటేజ్ ని క్యాష్ చేసుకుంటారా?

అయితే విశాల్ రత్నం మూవీ తెలుగులో కేవలం 4 కోట్ల బిజినెస్ ని చేయగా, మాస్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా 26న రిలీజ్ అవుతుండడం, పోటీగా పెద్దగా సినిమాలు లేకపోవడం ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ప్రతినిధి2 ఒక్కటే దీనికి పోటీగా రిలీజ్ అవుతుండగా, ఆ సినిమా జోనర్ పూర్తిగా వేరే కావడం వల్ల, బి,సి సెంటర్ల ప్రేక్షకులు రత్నం కి కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక రత్నం మూవీకి తెలుగు బిజినెస్ కూడా చాలా తక్కువే జరగడం వల్ల ఈ సినిమా కి మంచి టాక్ గనుక వస్తే వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉంది. పైగా సమ్మర్ హాలిడేస్ సినిమాకి మరో అడ్వాంటేజ్ కాగా, అన్నిటికీ మించి తెలుగులో నెలరోజులుగా ఒక్క హిట్ సినిమా లేకపోవడం వల్ల తెలుగు ఆడియన్స్ ఆకలిమీదున్నారు. ఈ టైం లో రత్నం మూవీకి మంచి టాక్ అనుక వస్తే వారాంతంలోనే బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు