Team India Captain Rohit Sharma Movie : క్రికెటర్ రోహిత్ శర్మ నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా…?

Team India Captain Rohit Sharma Movie : టీం ఇండియా హిట్ మాన్ అనే ట్యాగ్ నుంచి సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా ఎదిగిన రోహిత్ శర్మ ఓ సినిమాలో నటించాడు అన్న విషయం మీకు తెలుసా ? అవును క్రికెట్ లోకి అడుగు పెట్టడాని కంటే ముందే ఆయన ఓ సినిమాలో కీలక పాత్రలో నటించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మరి ఇంతకీ రోహిత్ నటించిన మూవీ ఏంటి? అనే వివరాల్లోకి వెళ్తే…

రోహిత్ శర్మ ఫస్ట్ అండ్ లాస్ట్ మూవీ..

రోహిత్ శర్మ కీలకపాత్రలో నటించిన మూవీ హిందీ మూవీ. అయితే క్రికెట్ కంటే ముందే నటుడిగా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన రోహిత్ అందులో కూడా క్రికెటర్ గానే కన్పించడం గమనార్హం. చిన్న వయసులోనే హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈ క్రికెటర్ నటించిన మూవీ పేరు విక్టరీ. ఇందులో బాలీవుడ్ సినీ నిర్మాత హరి బవేజా కుమారుడు హర్మాన్ బవేజా హీరోగా నటించారు. వీళ్లతో పాటే అనుపమ్ కేర్, అమృత రావు వంటి సెలబ్రిటీలు కూడా ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలు పోషించారు. తాజాగా ఈ సినిమాలోని ఓ సన్నివేశానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

రోహిత్ శర్మకు గాయం…

రోహిత్ శర్మ నెట్స్ లో బ్యాటింగ్ చేస్తున్నట్టు ఆ వీడియోలో కనిపిస్తోంది. ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు బాల్ అతని కాలికి తగడం వల్ల తట్టుకోలేని బాధతో రోహిత్ విలవిల్లాడిపోతాడు. ఆ గాయం కారణంగా ఆయన తర్వాత మ్యాచ్ కు దూరంగా ఉండగా, అతని స్థానంలో విక్టరీ సినిమాలో హీరోగా నటించిన హర్మాన్ ఎంట్రీ ఇస్తాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టీంట హల్చల్ చేస్తోంది. కాగా రోహిత్ శర్మ నటించిన ఏకైక మూవీ, ఫస్ట్ అండ్ లాస్ట్ మూవీ కూడా ఇదే కావడం విశేషం.

- Advertisement -

రోహిత్ తెలుగు వాడే…

టీమ్ ఇండియా కెప్టెన్ గా ఎదిగిన రోహిత్ శర్మ తల్లి పేరు పూర్ణిమ శర్మ. ఆమె పుట్టినిల్లు ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం. ఇక రోహిత్ శర్మ తండ్రి గురునాథ్ శర్మ మహారాష్ట్రకు చెందిన వ్యక్తి కావడంతో రోహిత్ మాతృభాష మరాఠీ అయ్యింది. మహారాష్ట్రలోని నాగపూర్ లో 1987 ఏప్రిల్ 30న రోహిత్ జన్మించాడు. ఆయనకు విశాల్ శర్మ అనే తమ్ముడు కూడా ఉన్నాడు. మరాఠీ అయినప్పటికీ రోహిత్ హిందీ ఇంగ్లీష్ తెలుగు భాషలను కూడా బాగా మాట్లాడగలడు. కాగా రోహిత్ శర్మ తండ్రి ఉద్యోగం కోల్పోవడంతో చిన్నప్పుడే కుటుంబ భారాన్ని మోయాల్సిన పరిస్థితిలో నెలకొన్నాయి.

అప్పుడు రోహిత్ క్రికెట్ ఆడడం అతని తల్లికి అసలు ఇష్టం లేదట. అయినప్పటికీ అతడు రంజి ట్రోఫీ ఆడుతూనే ఇండియన్ ఆయిల్ కంపెనీలో పని చేసి తన కుటుంబాన్ని పోషించాడు. అలా ఒకవైపు కుటుంబ భారాన్ని మోస్తూనే మరోవైపు తనకు ఇష్టమైన క్రికెట్ ని వదలకుండా ఏకంగా టీమ్ ఇండియా కెప్టెన్ గా ఎదిగాడు. ఆఫ్ స్పిన్నర్ గా కెరీర్ మొదలు పెట్టిన రోహిత్ ఇప్పుడు ఏకంగా టీం ఇండియా కెప్టెన్ గా ఎదిగి ఎంతోమందికి పూర్తిగా నిలిచాడు. ఇక రోహిత్ కి క్రికెట్ మాత్రమే కాదు ఫుట్బాల్ అంటే కూడా చాలా ఇష్టం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు