Mufasa : లయన్ కింగ్ ను మించిన ముఫాస.. ఫ్రీక్వెల్ కి రెండు రెట్లు బడ్జెట్?

Mufasa : హాలీవుడ్ లో “ది లయన్ కింగ్” మూవీస్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. హాలీవుడ్‌లో తెరకెక్కే యానిమేషన్ చిత్రాలంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ప్రేక్షకులు ఇష్టపడతారు. అలా ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్‌ను సంపాదించుకున్న యానిమేషన్ చిత్రాల్లో ‘లయన్ కింగ్’ కూడా ఒకటి. అయిదేళ్ల కింద “ది లయన్ కింగ్” పేరుతో సింహం నేపథ్యంలో భారీ విజువల్ వండర్ వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక ఇండియాలోనూ వంద కోట్లకు పైగా కలెక్షన్స్ కొల్లగొట్టింది. ముఖ్యంగా చిన్న పిల్లల్ని ఈ సినిమా ఎంతో ఆకట్టుకుంది. ఇక అప్పట్లో సింబా పాత్రకి నాని, విలన్ స్కార్ పాత్రకి జగపతిబాబు, అలాగే టిమోన్, పుంబా లాంటి కామెడీ పాత్రలకి బ్రహ్మానందం, ఆలీ లతో డబ్బింగ్ చెప్పించి అదరగొట్టారు. అయితే మళ్ళీ ఇన్నాళ్లకు మోస్ట్ అవైటెడ్ ప్రీక్వెల్ గా “ముఫాసా” రెండో భాగంగా రాబోతుంది. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ అయి సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతుంది.
ఇక ఈ సినిమాలో ‘ముఫాస.. ఒక సాధారణ లయన్‌గా పుట్టి, తర్వాత లయన్ కింగ్ ఎలా అయ్యాడు అనేది ‘ముఫాస: ది లయన్ కింగ్’ కథ. మూవీ అంతా ఇదే కథపై ఆధారపడి ఉంటుందని తెలిసిందే. దాన్ని మేకర్స్ ఎంత ఇంట్రెస్టింగ్ గా తీశారన్నదే అసలు సవాల్.

30 ఏళ్లగా లయన్ కింగ్ కథలు..

ఇక ‘లయన్ కింగ్’లో ముఫాస (Mufasa) ను సింహాలకు రాజుగా చూపించారు. ఆ తర్వాత తనకు సింబా అనే కొడుకు పుట్టడంతో తర్వాత సినిమా కథ అంతా సింబా చుట్టూ తిరుగుతుంది. కానీ అసలు ముఫాస.. లయన్ కింగ్ ఎలా అయ్యాడు, లయన్ కింగ్‌గా ఎలా పేరు సంపాదించుకున్నాడు అనేది ‘ముఫాస: ది లయన్ కింగ్’లో ప్రేక్షకులు చూడబోతున్నారు. ఈ మూవీని మూన్‌లైట్ దర్శకుడు బ్యారీ జెన్కిన్స్ తెరకెక్కించారు. 1994లో విడుదలయిన డిస్నీ యానిమేటెడ్ క్లాసిక్ అయిన లయన్ కింగ్‌ ను పూర్తిస్థాయి సినిమాలాగా మార్చి ప్రేక్షకులను మెప్పించడం అంత సులభం కాదు. కానీ మేకర్స్ అందులో ఇప్పటికే సక్సెస్ అయ్యారు. మరోసారి ప్రీక్వెల్ ‘ముఫాస : ది లయన్ కింగ్’తో ఆ సక్సెస్ ను కొనసాగించడానికి వచ్చేస్తున్నారు. దాదాపు 30 ఏళ్ళ నుండి ది లయన్ కింగ్ కి సంబంధించిన కథల పుస్తకాలు, అనిమేషన్ లతో పాటు, ఇప్పుడు విజువల్ వండర్స్ గా ప్రత్యేకంగా సినిమాలు వస్తున్నాయి. చిన్న పిల్లల్లో వీటికి ఎప్పుడూ ఆదరణ తగ్గదు.

డిసెంబర్ లో రిలీజ్..

ఇక తాజాగా రిలీజ్ అయిన ‘ముఫాస: ది లయన్ కింగ్’ ట్రైలర్ ప్రారంభమవ్వగానే, అందమైన మంచు ప్రాంతంలో మొదలవుతుంది. కోతి క్యారెక్టర్ అయిన రఫీకి చెప్పే డైలాగ్‌తో ప్రారంభమవుతుంది. ‘వెలుగుకు మరోవైపు, కొండలకు చాలా దూరంలో ఈ కథ మొదలవుతుంది. అక్కడ ఒక సింహం జన్మించింది. అదే సింహం మన జీవితాలను ఎప్పటికీ మార్చేస్తుంది. ‘ముఫాస: ది లయన్ కింగ్’ ట్రైలర్‌ను బట్టి చూస్తే ‘లయన్ కింగ్’లో ఉండే చాలావరకు పాత్రలు.. ఈ మూవీలో కూడా ఉంటాయని అర్థమవుతోంది. ఇక ఈ సినిమాకు బ్యారీ జెన్కిన్స్ దర్శకత్వం వహిస్తుండగా, ఇందులో రఫీకిగా జాన్ కానీ, పుంబాగా సేథ్ రాగెన్, టిమాన్‌గా బిల్లీ ఐచ్నర్, సింబాగా డోనాల్డ్ గ్రోవెర్ డబ్బింగ్ చెప్పారు. ఇక ముఫాసగా ఆరోన్ పైర్రీ వాయిస్ వినిపించనుంది. డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా ‘ముఫాస: ది లయన్ కింగ్’ చిత్రం థియేటర్లలో సందడి చేయనుందని మేకర్స్ ఇప్పుడే ప్రకటించేశారు. దాదాపు 30 భాషలలో సినిమాని రిలీజ్ చేయనున్నారట. ఇక ఈ ప్రీక్వెల్ కి మొదటి పార్ట్ ని మించి భారీగా డబుల్ ఖర్చు అయిందని సమాచారం. ఇక సినిమా రిలీజ్ కి ఇంకా టైముంది కాబట్టి తీరిగ్గా ప్రమోషన్లతో సినిమాపై అంచనాలను పెంచేస్తారనడం లో సందేహం లేదు. ఇక ది లయన్ కింగ్ ప్రీక్వెల్ గా వస్తున్న ముసఫా.. ది లయన్ కింగ్ ఇండియాలో ఈసారి 200 కోట్లు కొల్లగొట్టొచ్చని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు