Best Telugu Dubbed Hollywood Movies : ఈ హాలీవుడ్ సినిమాలను అసలు మిస్ చేయకండి

Best Telugu Dubbed Hollywood Movies : సాధారణంగా మనం చిన్నప్పటి నుంచి హాలీవుడ్ మూవీస్ చూస్తూనే ఉన్నాము..అయితే నేరుగా ఇంగ్లీషులో చూడలేకపోయినా తెలుగు వెర్షన్ లో ఎన్నో చూసాం. అయితే మెల్లిమెల్లిగా చాలామంది డబ్డ్ వెర్షన్ కాకుండా నేరుగా ఇంగ్లీషులోనే సినిమాలు చూసేస్తున్నారు.. అయితే ఇది అందరికీ కంఫర్ట్ గా ఉండదు. ఈ క్రమంలోనే హాలీవుడ్ లో తెరకెక్కించిన చిత్రాలను తెలుగులో డబ్ చేసి ఓటీటీ లోకి అందుబాటులోకి తీసుకొచ్చారు. మరి హాలీవుడ్ నుంచి తెలుగులో డబ్ అయ్యి ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకునే బెస్ట్ చిత్రాలు కొన్నింటిని ఇప్పుడు మనం చూద్దాం. మరి ఏవి మిస్ అయినా సరే ఈ చిత్రాలు మాత్రం మీరు అస్సలు మిస్ కాకండి..

ది డార్క్ నైట్ …

The Dark Night
The Dark Night

ఈ చిత్రాన్ని ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టొఫర్ నొలన్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం డి.సి. కామిక్స్ లోని బాట్ మాన్ సీరీస్ ల ఆధారంగా రూపొందించబడింది. బాట్ మాన్ త్రయంలో ఇది రెండవ చిత్రం. మొదటి చిత్రం “బాట్ మాన్ బిగిన్స్” కాగా మూడవ చిత్రం ” ది డార్క్ నైట్ రైసెస్”. హీరో బ్యాట్ మెన్ అయినా అందరికీ బాగా నచ్చిన క్యారెక్టర్ జోకర్. ముఖ్యంగా తెలుగు వెర్షన్ లో జోకర్ వచ్చినప్పుడు “వచ్చిందండి వయ్యారి” అనే డైలాగ్ చాలా పాపులర్ అయింది. ఇక చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుగు వెర్షన్ చూసేయండి.

ఓటీటీ ఫ్లాట్ ఫామ్.. నెట్ ఫ్లిక్స్, జియో సినిమా , అమెజాన్ ప్రైమ్ వీడియో
IMDb రేటింగ్ : 9/10

- Advertisement -

పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్…

Pirates of the Caribbean
Pirates of the Caribbean

తెలుగు ఆడియన్స్ కి ఒక టైం వరకు హాలీవుడ్ లో ఎన్ని జానర్ లలో సినిమాలు చూసినా.. ఈ పైరేట్స్ జానర్ పెద్దగా పరిచయం లేదు. పైగా ఫీచర్ ఫిలింలో ఎక్కడ చూడలేదు. ఈ సినిమాలో అడ్వెంచర్ , ఫైట్స్, విజువల్స్ ఇవన్నీ ఉన్నా కూడా ఈ సినిమాలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నది కెప్టెన్ జాక్ ప్యారో.. జాక్ స్పారో చేసే కన్నింగ్ పనులు , జోక్స్ మాత్రం ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఇంగ్లీషులోనే చాలా ఫన్నీ అంటే.. ఇక తెలుగు డబ్డ్ వెర్షన్ ఇంక ఎంత ఫన్నీగా ఉంటుందో ఆలోచించండి.. అల్టిమేట్ ఫన్ కావాలంటే వెంటనే చూసేయండి..

ఓటీటీ ఫ్లాట్ ఫామ్: అమెజాన్ ప్రైమ్ వీడియో
IMDb రేటింగ్ : 9/10

వ్యాన్ హెల్సింగ్…

Van Helsing
Van Helsing

సాధారణంగా ఇప్పటి సినిమాలు చూస్తే.. మనకు ఒక రిఫరెన్స్ పాయింట్ దొరుకుతుంది. 2004లో ఒక మ్యాజికల్ డిఫరెంట్ వరల్డ్ లో డిఫరెంట్ క్రియేటర్స్, గ్రాఫిక్స్ , మ్యాజిక్.. ఇలాంటివి ఒకేసారి చూసేసరికి మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. మాన్స్టర్స్ ని చూస్తే ఒక్కటే భయం అప్పట్లో.. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఈ సినిమా .. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కావాలి అంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఓటీటీ ఫ్లాట్ ఫామ్: అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీ
IMDb రేటింగ్ :6.1/10

ది మమ్మీ…

The Mummy
The Mummy

90ల కిడ్స్ కి బాగా నచ్చిన చిత్రం ఇది. అడ్వెంచర్ మాత్రమే కాదు హారర్ ఎలిమెంట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. విలన్ కూడా స్క్రీన్పై చూడగానే చాలా భయంకరంగా అనిపిస్తాడు. ఇక హాలీవుడ్ సంగతి పక్కన పెడితే తెలుగులో మాత్రం ఈ సినిమా మీకు రెట్టింపు స్థాయిలో వినోదాన్ని అలాగే రెట్టింపు స్థాయిలో భయాన్ని కూడా పుట్టిస్తుంది.

ఓటీటీ ఫ్లాట్ ఫామ్: అమెజాన్ ప్రైమ్ వీడియో , జియో సినిమా, Zee 5
IMDb రేటింగ్:7.1/10

వీటితోపాటు అమెజాన్ ప్రైమ్ వీడియోలో “సా “..
నెట్ ఫ్లిక్స్ లో “ఇన్సెప్షన్” సినిమా…
నెట్ ఫ్లిక్స్ లో “కింగ్ కాంగ్”..
అమెజాన్ ప్రైమ్ వీడియో లో ది రైడ్..
నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ “జాన్ విక్”..
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో “అవతార్”..
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ” ఇండియన్ జాన్స్”..ఇలా ఈ చిత్రాలను మీరు తెలుగు డబ్డ్ వెర్షన్ ( Best Telugu Dubbed Hollywood Movies) లో అసలు మిస్ కాకండి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు