Hi Nanna : నాని మూవీకి ప్రెస్టీజియస్ అవార్డ్..

Hi Nanna : టాలీవుడ్ లో న్యాచురల్ స్టార్ నాని సినిమాలకుండే ప్రత్యేకతే వేరు. నాని నటించే ఏ సినిమా అయినా మినిమం గ్యారెంటీ గా ఉంటుందని, ఆడియన్స్ ని డిస్సపాయింట్ చేయదని అందరూ అంటుంటారు. పొరపాటున కొన్ని సందర్భాల్లో థియేటర్లలో తన సినిమాలు అంతగా ఆడకపోయినా, టీవీల్లో ఓటిటి లలో మాత్రం అదరగొట్టేస్తుంటాయి. ఇక నాని గత సినిమాలను చూస్తే కూడా ప్రేక్షకులని మెప్పించడమే లక్ష్యంగా తాను సినిమాలు తీసినట్టు ఉంటుంది. అందుకే నాని సినిమాలకు అవార్డులు, రివార్డులు కూడా కామన్ గానే వస్తుంటాయి. ఇక లాస్ట్ టైం న్యాచురల్ స్టార్ నాని లీడ్ రోల్ లో నూతన దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘హాయ్ నాన్న’. వైరా క్రియేషన్స్ బ్యానర్ మొదటి సినిమాగా రూపొందిన ఈ సినిమా లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో రిలీజై ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. థియేటర్లలో మొదట తక్కువ ఓపెనింగ్స్ దక్కించుకున్నా లాంగ్ రన్ లో భారీ కలెక్షన్లను సాధించింది. ఇక ఆ తర్వాత ఈ సినిమా ఓటీటీ లో రిలీజ్ అయి గ్లోబల్ వైడ్ గా కూడా ఆడియన్స్ ను అలరించింది.

ఇంటర్నేషనల్ రేంజ్ లో.. బెస్ట్ ఫిల్మ్..

ఇక నాని హాయ్ నాన్న(Hi Nanna) సినిమాను తాజాగా ఇంటర్నేషనల్ ఆడియన్స్ కోసం హాయ్ డాడీగా ఇంగ్లిష్ లో రిలీజ్ చేశారు. నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉన్న ఈ సినిమా చూసి ఇంటర్నేషనల్ ఆడియన్స్ కూడా తెగ ఇంప్రెస్ అయ్యారు. ఇక నాని హాయ్ నాన్న కమర్షియల్ సక్సెస్ అందుకోవడమే కాదు, ఇప్పుడు ఎంతోమంది ప్రశంసలు అందుకుంది. తాజాగా హాయ్ నాన్న సినిమా ‘ఎథెన్స్ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫిల్మ్ ఫెస్టివల్’ లో ‘బెస్ట్ ఫీచర్ ఫిల్మ్’ అవార్డును కైవసం చేసుకుంది. ఎథెన్స్ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ మార్చి 2024 ఎడిషన్ లో నాని హాయ్ నాన్న ‘హాయ్ డాడీ’ పేరిట సినిమా బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గా నిలిచింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర యూనిట్ తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. అద్భుతమైన కథ, ఆకట్టుకునే కథనం తో ప్రేక్షకుల మెప్పు పొందిన హాయ్ నాన్న ఇప్పుడు ఎథెన్స్ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ జ్యూరీని ఆకర్షించింది. ఇంటర్నేషనల్ లెవెల్ లో తమ సినిమాకు వచ్చిన ఈ గుర్తింపు వల్ల మరిన్ని మంచి సినిమాలను చేయాలనే ఉత్సాహం వస్తుందని అన్నారు హాయ్ నాన్న మూవీ మేకర్స్.

దర్శకుడు శౌర్యవ్ స్పందన..

ఇక హాయ్ నాన్న సినిమాకు ఎథెన్స్ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అవార్డ్ రావడం చాలా సంతోషంగా ఉందని డైరెక్టర్ శౌర్యువ్ తన ఆనందాన్ని వ్యక్తం చేసాడు. ఇక తనకు ఈ సినిమా ఎంతో గౌరవాన్ని, గుర్తింపును తెచ్చింది. దీనికి కారణమైన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. మనం తీసిన సినిమా బాగుంటే అది బౌండరీస్ దాటి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తుందని మరోసారి ఈ సినిమా ప్రూవ్ చేసిందని అన్నారు. ఈ అవార్డుని అందించిన జ్యూరీకి, హాయ్ నాన్న సినిమాకు ప్రాణం పోసిన నటులకు పనిచేసిన టీం అందరికీ థాంక్స్ చెప్పారు శౌర్యువ్. ఇక నాని తదుపరి సరిపోదా శనివారం సినిమాతో ఆడియన్స్ ని పలకరించేందుకు రెడీ అయ్యాడు.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు