Hi Nanna: ఆల్ సెట్ ఫర్ టెలివిజన్ ప్రీమియర్

నాచురల్ స్టార్ నాని ప్రముఖ దర్శకుడు బాపు గారి దగ్గర రాధాగోపాలం సినిమాకి క్లాప్ అసిస్టెంట్ గా పనిచేసిన నాని. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ చేసి. అష్టా చమ్మా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అక్కడితో నాని విభిన్నమైన సినిమాలు చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నాడు. మంచి సినిమాలు ఎన్నుకుంటూ తన కెరీర్ లో ముందుకు వెళ్లాడు.

ఇకపోతే రీసెంట్ టైమ్స్ లో నాని ఫిల్మోగ్రఫీ గురించి మాట్లాడుకోవాలంటే అద్భుతం అని చెప్పొచ్చు. ఒకదానికి మించి ఒక డిఫరెన్స్ కాన్సెప్ట్ ఎంచుకుంటూ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయిపోయాడు నాని. నాని సినిమా వస్తుందంటే చాలు ఏమీ ఆలోచించకుండా థియేటర్ కి వెళ్లిపోవచ్చు అనే స్థాయికి ఆడియన్స్ ను తీసుకొచ్చాడు. నాని గత ఐదు సినిమాలు కూడా ఆడియన్స్ కి సంతృప్తి ఇచ్చాయి.

నాని చేసిన సినిమాలు కమర్షియల్ గా రీసెంట్ టైమ్స్ లో కొన్ని హిట్ కాకపోయినా కూడా ఆడియన్స్ కి అయితే మాత్రం అద్భుతంగా నచ్చాయని చెప్పొచ్చు. జెర్సీ సినిమా తర్వాత నాని సినిమాలను ఎంచుకునే విధానం ఇప్పటికీ చాలామందికి ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

- Advertisement -

నాని చేసిన సినిమా “శ్యామ్ సింగ రాయ్” ఈ సినిమా పునర్జన్మ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమా కమర్షియల్ గా కూడా మంచి హిట్ ను సాధించింది. అయితే నాని సినిమా టిక్కెట్ రేట్ల విషయంలో అప్పట్లో చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనిపించాయి. అందువలన నాని సినిమా టికెట్ కాస్ట్ లను కొన్ని ఏరియాలలో తగ్గించడం కూడా జరిగింది. అందువలన ఈ సినిమా అధిక లాభాలను పొందుకోలేదు. కానీ సినిమా మాత్రం ఆడియన్స్ ను బాగానే ఆకట్టుకుంది.

ఆ సినిమా తర్వాత నాని చేసిన సినిమా అంటే సుందరానికి. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. కానీ ఈ సినిమాకి ఇప్పటికీ ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అని ఫీల్ అవుతారు చాలామంది. ఈ సినిమాకు ఉన్న వర్త్ అలాంటిదని చెప్పొచ్చు. వివేక్ ఆత్రేయ ఈ సినిమాను డీల్ చేసిన విధానం అంత అద్భుతంగా ఉంటుంది. ఇప్పటికీ ఈ సినిమా చూసిన కూడా ఒక ఫ్రెష్ ఫీల్ క్రియేట్ అవుతుంది.

ఈ సినిమా తర్వాత నాని చేసిన సినిమా దసరా. దసరా సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు దసరా సినిమా కమర్షియల్ గా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. దాదాపు 100 కోట్లకు పైగా వసూలు చేసింది ఈ సినిమా. నాని కెరియర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా దసరా సినిమాను పేర్కొనవచ్చు.

ఇక నాని రీసెంట్ గా చేసిన సినిమా “హాయ్ నాన్న”. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ సాధించింది. ఇకపోతే కేవలం కలెక్షన్స్ మాత్రమే కాకుండా, చాలామందికి ఫేవరెట్ ఫిల్మ్ అయింది. హాయ్ నాన్న సినిమా ఇప్పుడు జెమినీ లో మార్చి 18 వ తారీఖున ప్రీమియర్ కానుంది. ఈ సినిమాకి టీవీలో ఎంత ఆదరణ లభిస్తుందో వేచి చూడాలి.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు