SSMB29: టైటిల్ పై క్లారిటీ ఇచ్చిన ఎస్ఎస్ రాజమౌళి

ఎస్.ఎస్ రాజమౌళి ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు తెలుగు ప్రజలు మాట్లాడుకునే పేరు ఇది. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చించుకుని పేరు ఇది. ఎందుకంటే ట్రిపుల్ ఆర్ సినిమాతో ఎస్ఎస్ రాజమౌళి క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. శాంతి నివాసం సీరియల్ కి దర్శకత్వం వహించిన ఎస్ ఎస్ రాజమౌళి స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో తెలుగు తెరకు దర్శకుడుగా పరిచయం అయ్యాడు. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకొని మంచి పేరుని సాధించాడు.

ఆ తర్వాత అందరిలా కాకుండా, తనకంటూ ఒక విభిన్నమైన శైలిని ఎంచుకుంటూ, ఒక్కో మెట్టు ఎక్కుతూ ఆఖరికి తెలుగు సినిమాను శిఖరం మీద కూర్చుని పెట్టే స్థాయికి ఎదిగాడు. నేడు భారతీయ సినిమా అంటే ఎస్ఎస్ రాజమౌళి అని చెప్పొచ్చు. భారతీయ సినిమాను ప్రపంచ చిత్రపటంలో పెట్టిన ఘనత ఎస్.ఎస్ రాజమౌళి ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

ఇకపోతే రాజమౌళి చాలామంది హీరోల్ని స్టార్ హీరోలను చేసాడు. కానీ ఇప్పటివరకు స్టార్ హీరోలతో పని చేయలేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు అంటే ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ అని చెప్పొచ్చు. వీరిలో అల్లు అర్జున్ మినహా మిగతా హీరోలను స్టార్ హీరోలను చేసింది మాత్రం రాజమౌళి. అప్పటివరకు సాఫీగా సాగుతున్న ప్రభాస్ కెరియర్ లో చత్రపతి సినిమా వచ్చి అద్భుతమైన హిట్ ను సాధించి ప్రభాస్ ని స్టార్ హీరోని చేసింది.

- Advertisement -

ఇకపోతే రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రామ్ చరణ్ కెరియర్ లో మగధీర సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలియంది కాదు. ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ అయిన ఆ సినిమాతోనే రామ్ చరణ్ స్టార్ గా ఎదిగాడు. ఇంక జూనియర్ ఎన్టీఆర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఎన్టీఆర్ కెరియర్ లో ఉన్న బ్లాక్ బస్టర్ సినిమాలు సింహాద్రి,యమదొంగ, స్టూడెంట్ నెంబర్ వన్ వంటి హిట్ సినిమాలన్నీ రాజమౌళి దర్శకత్వంలో వచ్చినవి.

అలానే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అంటే పవన్ కళ్యాణ్ అండ్ మహేష్ బాబు అని చెప్పొచ్చు. వీరిద్దరిలో ఎవరితో కూడా ఇప్పటివరకు వర్క్ చేయలేదు ఎస్ ఎస్ రాజమౌళి. వీరిద్దరిలో ఎవరితో అయిన వర్క్ చేస్తే చాలా మందికి చూడాలని కోరిక ఉంది. అయితే ఎట్టకేలకు ఆ కోరిక నెరవేరుతుంది.

ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు తన 29వ సినిమాను చేయనున్నారు. అయితే ఈ సినిమా గురించి ఒక క్రేజీ అప్డేట్ ను ప్రకటించారు ఎస్ఎస్ రాజమౌళి. మొన్నటివరకు సోషల్ మీడియాలో ఈ సినిమాకు మహారాజ్ అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు వార్తలు వినిపించాయి అయితే వీటి పైన ఎస్ఎస్ రాజమౌళి క్లారిటీ ఇచ్చారు.

బళ్లారిలోని అమృతేశ్వర ఆలయం ప్రారంభోత్సవానికి వెళ్ళిన రాజమౌళి అక్కడ చాలామంది ప్రముఖులను కలిశారు. వారిలో కొంతమంది రాజమౌళి యొక్క తదుపరి ప్రాజెక్టు గురించి అడిగినప్పుడు. తను మహేష్ బాబు తో సినిమా చేస్తున్నానని, అదొక ఫారెస్ట్ అడ్వెంచర్ ఫిలిం అని, ఈ సినిమాకి ఇంకా టైటిల్ ను ఫిక్స్ చేయలేదని చెప్పుకొచ్చారు.

ఎస్ ఎస్ రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాను కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటివరకు రాజమౌళి చేసిన ప్రతి సినిమాకు ఎం ఎం కీరవాణి సంగీతం అందించారు.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు