Rajamouli: అప్పుడు కన్ఫ్యూజన్ – ఇప్పుడు క్లారిటీ

శాంతి నివాసం అనే సీరియల్ కి దర్శకుడుగా పనిచేసి, “స్టూడెంట్ నెంబర్ వన్” సినిమాతో దర్శకుడుగా మారాడు ఎస్ ఎస్ రాజమౌళి. ఇప్పుడు ఎస్ఎస్ రాజమౌళి అంటే అది కేవలం పేరు కాదు అది ఒక ప్రభంజనం. ఎందుకంటే కేవలం చాలామంది హీరోలకి హిట్ సినిమాలు ఇవ్వడమే కాకుండా, భారతీయ సినిమాను కూడా ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దిగ్గజ దర్శకుడు. ఒకప్పుడు తెలుగు సినిమా అంటే ఎక్కడో ఉండేది. కానీ ఇప్పుడు తెలుగు సినిమా అంటే ప్రపంచంలో ఎక్కడబడితే అక్కడ ఉంటుంది.

స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా మంచి హిట్ అయింది. రాజమౌళి కి కూడా దర్శకుడుగా మంచి సంతృప్తినిచ్చింది. ఆ సినిమా తర్వాత చేసిన సింహాద్రి సినిమా మరో బ్లాక్ బస్టర్ అయింది. అక్కడితో రాజమౌళి ప్రతి సినిమాకి తన యొక్క స్థాయిని, తన యొక్క స్టార్ డం ని తన యొక్క పంథాను పెంచుకుంటూ వస్తున్నాడు. సినిమాను మించి సినిమా చేస్తూ నేడు ప్రపంచ సినిమాకి ఒక ఐకాన్ గా నిలిచాడు ఎస్ఎస్ రాజమౌళి.

అయితే దర్శకులు కూడా తమకంటూ ఈ దర్శకుడు పోటీ అంటూ ఫీల్ అవుతుంటారు. అలా ఎన్నో సందర్భాల్లో ఒక కమర్షియల్ సినిమా తీస్తే మేమంతా సర్దుకోవాల్సిందే అనే డైరెక్టర్లు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇద్దరు ఉన్నారు. వారిలో ఒకరు సుకుమార్ మరొకరు త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటూ చాలాసార్లు చెప్పుకొచ్చాడు ఎస్ఎస్ రాజమౌళి. అలానే మహేష్ బాబు బిజినెస్ మేన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ మేము సంవత్సరాలు సంవత్సరాలు కష్టపడుతుంటే పూరి జగన్నాథ్ ఒక డైలాగ్ తో కొట్టేస్తాడు. ఈయన దగ్గర నేను పని చేయాలనుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.

- Advertisement -

తెలుగు దర్శకులను గౌరవించే రాజమౌళి ఆ స్థాయికి వెళ్తారు అని చాలామంది ఊహించి ఉండరు. ఇకపోతే బిజినెస్ మేన్ ఆడియో ఫంక్షన్ లో ఎస్ఎస్ రాజమౌళి మాట్లాడుతూ.. మహేష్ బాబుతో సినిమా ఖచ్చితంగా ఉంటుంది. మహేష్ బాబుతో సినిమా చేస్తే ఎలాంటి సినిమా చేయాలో అనే క్లారిటీ అప్పుడు లేదంటూ చెప్పొచ్చాడు. ఒక అడ్వెంచర్ ఫిలిం చేయాలా, ఒక జేమ్స్ బాండ్ కైండ్ ఆఫ్ ఫిలిం చేయాలా, లేకపోతే ఒక మాస్ కమర్షియల్ సినిమా చేయాలా అంటూ బిజినెస్ మేన్ ఆడియో ఈవెంట్ లో ఒక స్పీచ్ ఇస్తూ వచ్చాడు ఎస్ఎస్ రాజమౌళి. అయితే అప్పుడు రాజమౌళికి మహేష్ బాబు తో ఎటువంటి సినిమా చేయాలని క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు దాదాపుగా ఆ క్లారిటీ వచ్చేసిందని చెప్పొచ్చు.

మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతుంది.
ఇది ఒక అడ్వెంచర్స్ ఫిలిం అని తెలుస్తుంది. ఈ సినిమాపై అందరికీ మంచి నమ్మకాలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు అని చెప్పడం అతిశయోక్తి కాదు. ఎందుకంటే ట్రిపుల్ ఆర్ సినిమా సాధించిన ఘనత అలాంటిది. ఇకపోతే ఈ సినిమా తెరపైకి ఎక్కి ప్రేక్షకుల ముందుకు రావడానికి దాదాపు ఒక నాలుగు సంవత్సరాలు వరకు టైం పడుతుందని చెప్పవచ్చు. మొత్తానికి ఎప్పుడో జరగాల్సిన సినిమా ఇప్పుడు జరుగుతుండడం విశేషం.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు