Nani : లైనప్ అంతా వయోలెన్సే… టైర్ 1 హీరో కావడానికేనా?

నేచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పర్ఫెక్ట్ కంటెంట్ సెలక్షన్ తో, డిఫరెంట్ జోనర్ సినిమాలతో ఎప్పటికప్పుడు తన అభిమానులకు తాజా ఫీలింగ్ వచ్చేలా సినిమాలు చేస్తూ ఉంటాడు. లేటుగా అయినా లేటెస్ట్ గా అన్నట్టు నెమ్మదిగా సినిమాలు చేసుకుంటూ వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంటున్నాడు ఈ యంగ్ హీరో. అయితే ప్రస్తుతం నాని లైనప్ చూస్తుంటే కొత్త అనుమానాలు రేకెత్తుతున్నాయి. ముఖ్యంగా టైర్ వన్ హీరో అనే స్టేటస్ తెచ్చుకోవడం కోసమే నాని ఇలాంటి డేరింగ్ స్టెప్ వేస్తున్నాడా? అనే డౌట్ వస్తోంది. సాధారణంగా ఆడియన్స్ బోర్ ఫీల్ అవ్వకుండా ఒక్కో సినిమా ఒక్కో జోనర్లో చేసే నాని రాబోయే నెక్స్ట్ మూడు సినిమాలను వరుసగా వయోలెన్స్ నేపథ్యంలోనే చేస్తుండడం దీనికి కారణం. ఇంతకీ నాని లైనప్ ఏంటి? వాటి కథేంటి? అనే వివరాల్లోకి వెళ్తే…

“సరిపోదా శనివారం”తో వయోలెన్స్ మొదలు
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ “సరిపోదా శనివారం”. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ఇప్పుడు షూటింగ్ దశలో ఉంది. వీళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తున్న రెండవ సినిమా ఇది. గతంలో “అంటే సుందరానికి” అనే సినిమా చేశారు. ఆ సినిమా నిరాశపరచినప్పటికీ డైరెక్టర్ వివేక్ కు నాని మరో ఛాన్స్ ఇవ్వడం విశేషం. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో స్టార్ ప్రొడ్యూసర్ డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ మూవీలో తమిళ బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ పాత్రను పోషిస్తుంది. ఎస్జే సూర్య ఈ మూవీలో విలన్ గా నటిస్తున్నారు. ఆగస్ట్ 29న ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నట్టు ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. తాజాగా ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన చిన్న టీజర్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఒక నాన్ వైలెంట్ బాయ్ వైలెంట్ గా మారితే ఎలా ఉంటుంది అన్నదే ఈ మూవీ స్టోరీ. నాని నెక్స్ట్ రెండు సినిమాలు కూడా ఇదే వైలెన్స్ నేపథ్యంలో రూపొందుతూ ఉండడం గమనార్హం.

Nani 32 అండ్ Nani 33 కూడా వయోలెన్సే…
నాని 32వ మూవీ సుజిత్ దర్శకత్వంలో రూపొందనుంది. ఈ మూవీలో ఒక వైలెంట్ మ్యాన్ ట్రాన్స్ఫర్మేషన్ ను సుజిత్ చూపించబోతున్నాడు. అలాగే నాని నెక్స్ట్ మూవీ కూడా దాదాపుగా ఇలాంటి బ్యాక్ డ్రాప్ లోనే రానుందని తెలుస్తోంది. నాని 33వ సినిమా డైరెక్టర్ వేణు యల్దండి దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఇదొక విలేజ్ రివేంజ్ డ్రామాగా, డివోషనల్ థీమ్ తో తెరకెక్కనుందని తెలుస్తోంది. నిజానికి వేణు దర్శకత్వంలో నాని మూవీ అటకెక్కిందనే రూమర్లు ఉన్నాయి. దానికి కారణం త్రివిక్రమ్ తో నాని నెక్స్ట్ మూవీ చేయబోతున్నాడు అనే వార్తలే. ఏదేమైనా ప్రస్తుతం అయితే త్రివిక్రమ్ దర్శకత్వంలో నాని నటించే ఛాన్స్ కనిపించట్లేదు.

- Advertisement -

టైర్ వన్ హీరో స్టేటస్ కోసమేనా?
ఇక ఈ లైనప్ చూసిన తర్వాత సినీ విశ్లేషకులు నాని టైర్ 1 హీరో స్టేటస్ కోసమే ఇంత వైలెన్స్ కు దిగుతున్నాడని అంటున్నారు. ఇప్పటిదాకా వరుసగా డిఫరెంట్ సినిమాలు చేసిన నాని ఇప్పుడు ఏకంగా మూడు ఒకే నేపథ్యంలో రూపొందుతున్న సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి ఇదే రీజన్ అని టాక్ నడుస్తోంది. మరి ఈ మూడు సినిమాల తర్వాత నాని స్టార్డంలో ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలి.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు