Drug Cases: సినిమానే ఒక మత్తు

ఈ సమాజంలో చాలా జరుగుతుంటాయి. కానీ కొన్ని జరిగినప్పుడు వాటిలో సినిమా వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉంటే. వాటి గురించి చర్చ వేరే రేంజ్ లో ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే చాలామంది ఎన్నో తప్పుల్లో దొరికినా కూడా దాంట్లో సినిమా వాళ్ళు ఉంటేనే చాలామందికి ఒక రకమైన క్యూరియాసిటీ ఒక రకమైన ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. అందుకే డ్రగ్స్ కేసుల్లో పెద్దపెద్ద మంది పట్టుబడిన కూడా సినిమా వాళ్ళ పేర్లే పదే పదే వస్తుంటాయి.

ఈ డ్రగ్స్ కేసుల్లో సినిమా వాళ్ళ పేర్లు రావడం అనేది ఇది మొదటిసారి కాదు. ఇదివరకే చాలాసార్లు ఇలాంటివి జరిగాయి లేకపోతే లాస్ట్ టైం ఈ కేసులో కేవలం సినిమా వాళ్ళనే టార్గెట్ గా పెట్టి దాదాపు 15 మంది నుంచి 20 మంది వరకు సినిమా వాళ్ళను ఇంట్రాగేషన్ చేస్తూ, వాళ్లపైన టీవీల్లో స్క్రోలింగ్ వేస్తూ నిరూపణ కాకముందే టార్గెట్ చేశారు.

ఆ టైంలో స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఎదుర్కొన్న సమస్యలు అన్ని ఇన్ని కాదు. అయితే విషయం కన్ఫామ్ కాకముందే చాలా మంది డ్రగ్స్ తీసుకున్నారంటూ మానసికంగా వేధించారు. కేవలం పూరి జగన్నాథ్ మాత్రమే కాకుండా రవితేజ, ఛార్మి, సుబ్బరాజు, నవదీప్ వంటి ఎంతోమంది సినిమా వాళ్ళను ఆ రోజుల్లోనే నిందితులుగా చెప్పుకొచ్చారు. ఇకపోతే ఆ కేసులు ఇంకా కొలిక్కి రాలేదు. ఆ కేసులు నిర్ధారణ కాకపోతే ఇది తప్పుడు ప్రచారం అంటూ స్క్రోలింగ్ వేస్తారు. అవే కేసులు రుజువైతే అదే బ్రేకింగ్ న్యూస్ అవుద్ది అంటూ పూరి జగన్నాథ్ చాలా సార్లు బాధపడిన విషయం తెలిసిందే.

- Advertisement -

ఇకపోతే రీసెంట్ గా మరోసారి ఈ డ్రగ్స్ కేస్ కలకలం మొదలైంది. అయితే దర్శకుడు క్రిష్ ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారంటూ చాలా వార్తలు వినిపించాయి. వాస్తవానికి క్రిష్ ఆ హోటల్లో ఒక వ్యక్తిని కలవడానికి వెళ్లి అరగంటలోనే వచ్చేసానని పోలీసులు కూడా తెలిపారు. అయితే ఈ విషయం పెద్దగా బయటకు రాలేదు కానీ కేసులో ఇన్వాల్వ్ అయినట్టు మాత్రం చాలా మంది అనుకున్నారు.

ఏదేమైనా ఇదే విషయంపైన పూరి జగన్నాథ్ ఒక ఇంటర్వ్యూ లో కూడా డైరెక్టర్ గా స్పందించారు. ఏదైనా లోలో ఉన్నప్పుడు ఇంకా డ్రగ్స్ తీసుకుంటే లోపలికి వెళ్తాం తప్ప జీవితంలో పైకి రాలేము అంటూ ఓపెన్ గా చెప్పారు. ఏదేమైనా కూడా రాజకీయ నాయకులు పేర్లు, పెద్ద పెద్ద బడాబాబుల పేర్లు, కంటే కూడా సినిమా వాళ్ళ పేర్లు మాత్రం గట్టిగా వినిపిస్తుంటాయి.

సినిమా వాళ్లకి సినిమా తప్ప ఇంకో ప్రపంచం ఉండదు అని అంటారు. అయితే సినిమాని ఖచ్చితంగా ప్రేమిస్తూ సినిమాని తపస్సులా చేస్తే సినిమాను మించిన డ్రగ్ ఉండదని వాస్తవం. ఎందుకంటే సినిమాయే ఒక మత్తు. సినిమా అనే మత్తు పట్టుకుంది అంటే అది వదలటం మామూలు కష్టం కాదు. ఇంకా ఇంకా లోపలికి లాగుతూ ఉంటుంది. సో చాలామంది తెలుసుకోవాల్సింది ఏంటంటే నిజంగా సినిమాను ప్రేమిస్తే దానిని మించిన డ్రగ్ ఉండదు.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు